ఫోర్స్ గుర్ఖా వెహికల్స్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ప్రత్యేకతలు...

Written By:

ఫోర్స్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి గుర్ఖా ఎస్‌యూవీలను విడుదల చేసింది. బిఎస్-4 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 8.45 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.48 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ విడుదల

బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లతో ఫోర్స్ మోటార్స్ గుర్ఖా ఎస్‌యూవీలను ప్రవేశపెట్టింది. కొత్త ఇంజన్‌లతో పాటు మల్టి లింక్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ గల సరికొత్త ఛాసిస్‌తో పాటు సరికొత్త ఎక్ట్సీరియర్ కాస్మొటిక్ మార్పులు ఇందులో చోటు చేసుకున్నాయి.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ విడుదల

సాంకేతికంగా ఫోర్స్ గుర్ఖాలో 2.6-లీటర్ సామర్థ్యం గల బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే డీజల్ ఇంజన్ అందివ్వడం జరిగింది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 85బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ విడుదల

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ ధరలు:

ఫోర్స్ గుర్ఖా వేరియంట్లు ధరలు
ఫోర్స్ గుర్ఖా ఎక్ప్సెడిషన్ 4x2 (5-డోర్) రూ. 8.45 లక్షలు
ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ప్లోరర్ 4x4 (3-డోర్) రూ. 9.39 లక్షలు
ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ప్లోరర్ 4x4 (5-డోర్) రూ. 11.48 లక్షలు

అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ విడుదల

ఫోర్స్ మోటార్స్ గుర్ఖా ఎస్‌యూవీని ఎక్ప్సెడిషన్ మరియు ఎక్స్‌ప్లోరర్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. గుర్ఖా ఎక్స్‌ప్లోరర్ వేరియంట్‌ను హార్డ్ లేదా సాఫ్ట్ టాప్, మూడు డోర్లు లేదా ఐదు డోర్లు, ఐదు మంది లేదా ఏడు మంది సీటింగ్ కెపాసిటితో పర్మినెంట్ ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ విడుదల

ఫోర్స్ గుర్ఖా లోని మరో వేరియంట్ ఎక్ప్సెడిషన్ ఐదు డోర్ల వెర్షన్‌లో లభిస్తోంది. సుమారుగా తొమ్మిది మంది వరకు ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఇందులో కేవలం రియర్ వీల్ డ్రైవ్ మాత్రమే కలదు.

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ విడుదల

బిఎస్-4 అప్‌గ్రేడ్స్‌తో వచ్చిన ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీలో, సరికొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్, బాడీ మీద సరికొత్త గ్రాఫిక్స్, క్లియర్ లెన్స్ హెడ్ ల్యాంప్స్, పొడవాటి ఫుట్ బోర్డ్ వంటివి ఉన్నాయి. మరియు పోర్స్ గుర్ఖాను నాలుగు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, సుప్రీమ్ వైట్, మ్యాట్ బ్లాక్, కాపర్ రెడ్, మరియు మూన్ బీమ్ సిల్వర్.

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఫోర్స్ మోటార్స్ గుర్ఖా ఎస్‌యూవీని సబ్ 4-మీటర్ లోపు పొడవుతో ఎక్స్‌ప్లోరర్ వేరియంట్లో పోటీతత్వమైన ధరతో ప్రవేశపెట్టింది. అయితే, ఎక్కువ మంది ప్రయాణించేందుకు వీలుగా ఎక్ప్సెడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది.

English summary
Read In Telugu: Force Gurkha BS4 Model Launched In India; Prices Starts At Rs 8.45 Lakh
Story first published: Monday, September 11, 2017, 20:41 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark