సరికొత్త ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన ఫోర్డ్: వేరియంట్లు, ధరలు, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:

ఫోర్డ్ ఇండియా విభాగం విపణిలోకి సరికొత్త 2017 ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. సరికొత్త 2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 7.31 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఆల్ న్యూ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లభించే వేరియంట్, ఇంజన్ వివరాలు, ఫీచర్లు, ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ అప్‌డేట్స్ మరియు సేఫ్టీ ఫీచర్లతో పాటు పూర్తి వివరాలు క్రింది కథనంలో...

ఫోర్డ్ ఇండియా తమ సరికొత్త ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీలు భారీ మార్పులు చేసింది. ఒక్క ధర మినహాయిస్తే. ఎందుకంటే మునుపటి ఎకోస్పోర్ట్ వేరయంట్లు మరియు కొత్తగా విడుదలైన ఎకోస్పోర్ట్ వేరియంట్ల ధరలు ఒక్కటే.

Recommended Video - Watch Now!
[Telugu] Tata Nexon Review: Specs
2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఐదు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. అవి, ఆంబియంట్, ట్రెండ్, ట్రెండ్ ప్లస్, టైటానియం, టైటానియం ప్లస్. ఈ వేరియంట్లు పెట్రోల్ మరియు డీజల్ ఆప్షన్స్‌లో లభిస్తున్నాయి. పెట్రోల్ వెర్షన్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ట్రెండ్ ప్లస్, టైటానియం ప్లస్ వేరియంట్లు కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తున్నాయి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఎకోస్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ల ధరలు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధరలు
Ambiente Rs 731,200
Trend Rs 804,500
Trend+ AT Rs 934,100
Titanium Rs 917,700
Titanium+ AT Rs 1,099,100
2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఎకోస్పోర్ట్ డీజల్ వేరియంట్ల ధరలు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధరలు
Ambiente Rs 801,700
Trend Rs 871,000
Trend+ Rs 910,600
Titanium Rs 985,900
Titanium+ Rs 1,067,300
2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్

సరికొత్త ఫేస్‌లిఫ్ట్ ఎకోస్పోర్ట్‌లో వచ్చిన అతి ప్రధానమైన మార్పు ఫ్రంట్ డిజైన్. మునుపటి ఎకోస్పోర్ట్‌లో రెండుగా ఉన్న ఫ్రంట్ గ్రిల్ స్థానంలో, ఈ మధ్య ఫోర్డ్ పరిచయం చేసిన ఎండీవర్ లోని పెద్ద పరిమాణంలో ఉన్న సింగల్ గ్రిల్ ఇందులో అందింది. క్రోమ్ హారిజంటల్ స్లాట్లకు మధ్యలో యథావిధిగా అమర్చిన ఫోర్డ్ లోగో గుర్తించవచ్చు.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఫ్రంట్ క్రోమ్ గ్రిల్‍కు ఇరువైపు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న పెద్ద పరిమాణంలో గల ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ సెక్షన్‌లో హెడ్ ల్యాంపుకు క్రిందుకుగా ఫాగ్ ల్యాంప్స్‌కు జోడింపుతో టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్‍కు క్రిందుగా సిల్వర్ స్కిడ్ ప్లేట్లను అందివ్వడం జరిగింది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, పెద్ద మార్పులేమీ చోటు చేసుకోలేదు. అయితే, ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్ టైటానియం ప్లస్ లో 17-అంగుళాల పరిమాణంలో ఉన్న చక్రాలు 205/50 ఆర్17 కొలతల్లో గల టైర్లతో వచ్చింది. రియర్ బంపర్‌లో స్కిడ్ ప్లేట్స్ అందించి స్పేర్ వీల్ డిజైన్‌లో మార్పులు చేసింది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇంటీరియర్

ఇంటీరియర్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బ్లాక్ థీమ్ ఇంటీరియర్ మరియు డ్యాష్ బోర్డు మధ్యలో ఉన్న 8-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

వాయిస్ కమాండ్ యాక్సెస్ కోసం ఫోర్డ్ సింక్ 3 సిస్టమ్ వినియోగించారు. సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే మరియు 7-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి సపోర్ట్స్ కలిగి ఉంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

బ్రాండ్ న్యూ బేర్-బోన్స్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సరికొత్త డిజైన్‌లో గల ఏ/సి ఎయిర్ వెంట్స్, మరియు పియానో బ్లాక్ సరౌండింగ్స్, ట్విన్ యుఎస్‌బి పోర్ట్స్ మరియు పలు రకాల స్టోరేజ్ స్పేస్ ఇందులో ఉన్నాయి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌ భద్రత ఫీచర్లు

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి తప్పనిసరిగా ఇవ్వబడ్డాయి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

అయితే, ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ టాంప్ వేరియంట్ టైటానియం ప్లస్ లో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, స్పీడ్ లిమిటర్ గల క్రూయిజ్ కంట్రోల్, మరియు ఐఎస్ఒ ఫిక్స్ సీట్ మౌంట్స్ ఉన్నాయి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్

సరికొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ రెండు ఇంజన్ వేరియంట్లలో మరియు గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో లభించును. ఫేస్‌లిఫ్ట్ విడుదలతో సరికొత్త 1.5-లీటర్ మూడు సిలిండర్ల డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ పరిచయం చేసింది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌లో లభించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6,500ఆర్‌పిఎమ్ వద్ద 121బిహెచ్‌పి పవర్ మరియు 4,500ఆర్‌పిఎమ్ వద్ద 150ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లోని 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ 3,750ఆర్‌పిఎమ్ వద్ద 98.6బిహెచ్‌పి పవర్ మరియు 1,750-3,250ఆర్‌పిఎమ్ మధ్య 205ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యుల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తోంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ మైలేజ్ వివరాలు

  • ఎకోస్పోర్ట్ 1.5-లీటర్ పెట్రోల్ మ్యాన్యువల్ - 17కిమీ/లీ
  • ఎకోస్పోర్ట్ 1.5-లీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ - 14.8కిమీ/లీ
  • ఎకోస్పోర్ట్ 15-లీటర్ డీజల్ మ్యాన్యువల్ - 23కిమీ/లీ
2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ ఇండియా తమ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని విప్లవాత్మక మార్పులతో తీసుకొచ్చింది. కాంపాక్ట్ ఎస్‌యూవీని కోరుకునే ప్రతి కస్టమర్‌కు నచ్చే రీతిలో అధునాతన ఫీచర్లు, ప్రీమియం ఫీల్ కలిగించే ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ దీని సొంతం.

అమెరికా దిగ్గజం ఫోర్డ్ మారుతి వితారా బ్రిజా మరియు టాటా నెక్సాన్ ఎస్‌యూవీలను ఎదుర్కునేందుకు ఎలాంటి ధరల పెంపు లేకుండా ఎకోస్పోర్ట్‌లో భారీ మార్పులు తీసుకొచ్చింది.

English summary
Read In Telugu: 2017 Ford EcoSport Facelift Launched At Rs 7.31 Lakh In India; Available With 7 Colours, 10 Models

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark