ఫోర్డ్ మస్టాంగ్ క్రాష్ పరీక్షల్లో అసంతృప్తికర ఫలితాలు

అమెరికాకు చెందిన కండలు తిరిగిన ఫోర్డ్ మస్టాంగ్ కారుకు నిర్వహించిన యూరో ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో ఊహించిన ఫలితాలు సాధించింది. భద్రత పరమైన క్రాష్ పరీక్షల్లో కేవలం రెండు స్టార్లకే పరిమితం అయ్యింది.

By Anil

అమెరికాకు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఇకానిక్ కారు మస్టాంగ్‌ను 60 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి కూడా విడుదల చేయలేదని మస్టాంగ్ ప్రేమికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే గత ఏడాదిలో ఫోర్డ్ చరిత్రను తిరగరాస్తూ మస్టాంగ్ ఇకానిక్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

ఫోర్డ్ మస్టాంగ్ క్రాష్ పరీక్షలు

అయితే యూరో ఎన్‌సిఎపి భద్రత పరంగా నిర్వహించే క్రాష్ పరీక్షల్లో అత్యంత దారుణమైన ఫలికతాలకు పరిమితమైంది. చాలా వరకు సాధారణమైన కార్లు ఐదుకు ఐదు మరియు నాలుగు స్టార్ల ర్యాంకింగ్ సాధిస్తుంటే ఇది మాత్రం కేవలం 2 స్టార్ల రేటింగ్ పొందింది.

ఫోర్డ్ మస్టాంగ్ క్రాష్ పరీక్షలు

ఫోర్డ్ అభివృద్ది చేసిన ఆరవ తరం మస్టాంగ్ కారును రైట్ హ్యాండ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉన్న దేశాల్లోకి విడుదల చేసింది. భద్రత పరీక్షలు జరిపింది ఈ కారుకే. యూరో ఎన్‌సిఎపి వారి ఆధ్వర్యంలో ఫోర్డ్ తమ మస్టాంగ్ కారుకు క్రాష్ పరీక్షలు జరిపించడం ఇదే మొదటి సారి.

ఫోర్డ్ మస్టాంగ్ క్రాష్ పరీక్షలు

క్రాష్ పరీక్షల్లో నిరాశపరిచే ఫలితాలకు కారణం మస్టాంగ్ కారులో ఆటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) లేకపోవడం ప్రధానం కారణం అని తెలిసింది.

ఫోర్డ్ మస్టాంగ్ క్రాష్ పరీక్షలు

అంతే కాకుండా ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ మరియు కో డ్రైవర్ యొక్క ఎయిర్ బ్యాగులు సరసమైన సమయానికి విచ్చుకోలేదనే అంశాన్ని యూరో ఎన్‌సిఎపి వెల్లడించింది. వెనుక వైపు ప్రయాణికులు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని తెలిసింది.

ఫోర్డ్ మస్టాంగ్ క్రాష్ పరీక్షలు

ఫ్రంట్ సైడ్ యాక్సిడెంట్ ద్వారా వెనుక సీటులో ప్రయాణించే వారి తొడ ఎముక, మోకాలు మరియు పొత్తి కడుపు వంటి భాగాలు ప్రమాదానికి గురయ్యే చాన్స్ ఉన్నట్లు తెలిసింది.లోడ్ లిమిటర్స్ మరియు ప్రిటెన్షనర్లు పనితీరులో లోపం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

ఫోర్డ్ మస్టాంగ్ క్రాష్ పరీక్షలు

పెద్దల పరంగా కాకుండా పిల్లల భద్రత పరంగా కూడా అసంతృప్తికరమైన ఫలితాలు నమోదయ్యాయి. చిన్న పిల్లల కోసం 10 ఏళ్ల పిల్లల కోసం అన్నట్లుగా డమ్మీ బొమ్మను సీటులో కూర్చోబెట్టి పరీక్షిస్తే, సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్ ఉన్నా కూడా కారు బాడీలోని సి-పిల్లర్ ను డీకొట్టిందని తెలిసింది.

ఫోర్డ్ మస్టాంగ్ క్రాష్ పరీక్షలు

ఫోర్డ్ మోటార్స్ దీనికి వివరణ ఇస్తూ, వచ్చే ఏడాదిలో అమ్మకాలకు రానున్న మస్టాంగ్ కారులో ప్రమాద తీవ్రతను తగ్గించే భద్రత ఫీచర్లను అందిస్తామని యూరో ఎన్ఎన్‌సిఎపి కి వివరించింది.

ఫోర్డ్ మస్టాంగ్ క్రాష్ పరీక్షలు

వచ్చే ఫోర్డ్ మస్టాంగ్ లో రానున్న ఫీచర్లు(ఫోర్డ్ మేరకు), అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, పాదచారులను గుర్తించడం మరియు ప్రమాద హెచ్చరికలను తెలిపే ఫీచర్లు.

ఫోర్డ్ మస్టాంగ్ క్రాష్ పరీక్షలను వీడియో ద్వారా స్వయంగా వీక్షించగలరు...

ఫోర్డ్ మస్టాంగ్ క్రాష్ పరీక్షలు

ఇండియాలో ఉన్న టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

రిపబ్లిక్ డే గెస్ట్: అబుదాబి రాజు గారి ఆడంబరమైన విమానం

బజాజ్ లెంజెండరీ స్కూటర్ చేతక్ రీలాంచ్ వివరాలు...!!

Most Read Articles

English summary
Ford Mustang Scores Poor Safety Rating In Euro NCAP Crash Tests
Story first published: Friday, January 27, 2017, 17:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X