జిఎస్‌టి ప్రభావం: బస్సుల మీద 27.8 నుండి 43 శాతానికి పెరిగిన ట్యాక్స్

Written By:

భారత ప్రభుత్వం జూలై 1, 2017 న అమలు చేయడానికి సిద్దమైన నూతన పన్ను విధానం జిఎస్‌టి, ఆటోమొబైల్ రంగానికి మరో చేదు వార్తనిచ్చింది. ప్రజా రవాణాలో కీలకంగా ఉన్న బస్సుల మీద ట్యాక్స్ విపరీతంగా పెరిగింది.

బస్సుల మీద పెరిగిన ట్యాక్స్

ట్రాన్స్‌పోర్ట్ బస్సుల మీద ప్రస్తుతం ఉన్న 28 శాతం నిర్ధిష్ట ట్యాక్స్‌తో కలుపుకుని, అదనంగా 15 శాతం సెస్ కలిపి మొత్తం 43 శాతంగా ట్యాక్స్‌ను నిర్ణయించింది జిఎస్‌టి మండలి. హైబ్రిడ్ మరియు లగ్జరీ వాహనాల స్లాబుల్లోకే ప్రజా రవాణాకు వినియోగించే వాహనాలు రావడంతో ఒకే ట్యాక్స్‌ను నిర్ణయించింది.

బస్సుల మీద పెరిగిన ట్యాక్స్

ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, డ్రైవర్‌తో కలుపుకొని పది మరియు అంత కన్నా ఎక్కువ మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న బస్సుల మీద జిస్‌టి నిర్దిష్ట ట్యాక్స్ 28 శాతం మరియు అదనపు సెస్ 13 శాతం కలుపుకొని మొత్తం 43 శాతంగా నిర్ణయించడం జరిగింది.

బస్సుల మీద పెరిగిన ట్యాక్స్

ప్రస్తుతం, ట్రాన్స్‌పోర్ట్ బస్సుల మీద ట్యాక్స్ రేటు 27.8 శాతంగా ఉంది. జిఎస్‌టి అమలైతే ఇది భారీగా పెరగుతోంది. దీని గురించి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) స్పందిస్తూ, బస్సుల మీద ట్యాక్స్ పెరగడంతో సాధారణ ప్రజానీకం మీద అధిక భారం పడనుందని తెలిపింది.

బస్సుల మీద పెరిగిన ట్యాక్స్

సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ మాట్లాడుతూ, " నగరాల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి అందరూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి, ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ మీద భారీగా ట్యాక్స్ పెంచడంతో ఆ ప్రభావం ప్రజల మీద పడనుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వారి లక్ష్యాలకే తూట్లు పొడుస్తోందని వాఖ్యానించారు."

బస్సుల మీద పెరిగిన ట్యాక్స్

ఆశోక్ లేలాండ్ అధికారి ఒకరు స్పందిస్తూ, "పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ మీద ట్యాక్స్ విపరీతంగా పెంచడంతో, ఆ భారం బస్సుల ఆపరేటర్ల మరియు ప్రయాణికుల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు."

బస్సుల మీద పెరిగిన ట్యాక్స్

జిఎస్‌టి కౌన్సిల్ తొలుత హైబ్రిడ్ వాహనాల మీద 43 శాతం నిర్ణయించింది. ఆ తరువాత పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ మీద కూడా అదే ట్యాక్స్ వడ్డించింది. కొన్ని తయారీ సంస్థలు దీనిని 18 శాతానికి కుదించాలని డిమాండ్ చేసినప్పటికీ ఎలాంటి మార్పులు జరగలేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఉద్గారాలను తగ్గించేందుకు అందరూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగించడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే, జిఎస్‌టిలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల మీద అమలు చేస్తున్న ట్యాక్స్ తీరును చూస్తే, మొత్తం వ్యతిరేకంగా ఉంది.

English summary
Read In Telugu GST Effect- Transport Buses To Be Pricier
Story first published: Friday, June 30, 2017, 17:59 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark