భారీగా పెరగనున్న హోండా కార్ల ధరలు

Written By:

2018 కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలని చూస్తున్నారా....? అయితే మీరు తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే. హోండా కార్లు వచ్చే ఏడాది ప్రారంభం నుండి విపరీతంగా పెరగనున్నాయి. జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ జనవరి 1, 2018 నుండి తమ కార్ల మీద గరిష్టంగా రూ. 25,000 ల వరకు ధరలు పెంచడానికి సిద్దమైంది.

పెట్టుబడి భారం రోజురోజుకీ పెరుగుతుండటంతో, అన్ని మోడళ్ల మీద 1 నుండి 2 శాతం వరకు ధరల పెంపు ఆలోచనలో హోండా ఉంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
పెరుగుతున్న హోండా కార్ల ధరలు

హోండా ఇండియా లైనప్‌లో ప్రారంభ మోడల్ బ్రియో హ్యాచ్‌బ్యాక్, దీని ప్రారంభ ధర రూ. 4.66 లక్షలు మరియు హోండా హై ఎండ్ మోడల్ అకార్డ్ హైబ్రిడ్, దీని గరిష్ట ధర రూ. 43.21 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. హోండా సిటి మరియు డబ్ల్యూఆర్-వి మోడళ్లు ప్రస్తుతం ఇండియా లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి.

పెరుగుతున్న హోండా కార్ల ధరలు

హోండా డబ్ల్యూఆర్-వి ధరల శ్రేణి రూ. 8.51 లక్షలు నుండి 11.15 లక్షల వరకు ఉన్నాయి. అదే విధంగా, హోండా సిటి ధరల శ్రేణి రూ. 9.95 లక్షల నుండి రూ. 15.71 లక్షల మధ్య ఉంది.

పెరుగుతున్న హోండా కార్ల ధరలు

1 నుండి 2 శాతం మేర ధరలు పెంపు ఖచ్చితమైతే, విపణిలో ఉన్న డబ్ల్యూఆర్-వి ధర రూ. 8,000 నుండి రూ. 20,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా హోండా సిటి మీద రూ. 9,000 నుండి 16,000 ల వరకు పెరిగే అవకాశం ఉంది.

*ఈ ధరల పెంపు కేవలం అంచనా మాత్రమే.

పెరుగుతున్న హోండా కార్ల ధరలు

ఇటీవల జపాన్ దిగ్గజం ఇసుజు మోటార్స్ ధరలు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇసుజు వాహనాల ధరలు గరిష్టంగా రూ. 1 లక్ష వరకు పెరిగాయి. అంతే కాకుండా స్కోడా ఇండియా కూడా తమ ఉత్పత్తుల మీద 2 నుండి 3 శాతం మేర ధరలు పెంచనున్నట్లు తెలిసింది.

పెరుగుతున్న హోండా కార్ల ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జనవరి 2018తో పోల్చుకుంటే డిసెంబర్ 2017లో హోండా కార్ల ధరలు తక్కువగానే ఉంటాయి. కాబట్టి కొత్త సంవత్సరంలో కొత్త కారును కొందామనే ఆలోచనలో ఉన్నట్లయితే నష్టపోయినట్లే. ఎవరైతే వచ్చే ఏడాది ప్రారంభంలో హోండా కార్లను కొనాలనుకుంటున్నట్లయితే ఈ డిసెంబర్‌లోనే ఎంచుకోవడం ఉత్తమం అని డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

English summary
Read In Telugu: Honda Car Prices To Be Increased — Here's When It's Effective From
Story first published: Friday, December 8, 2017, 9:50 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark