మొబీలియో ఎమ్‌పీవీ ప్రొడక్షన్ ఆపేసిన హోండా - కారణమేంటి?

Written By:

మార్కెట్లో మొబీలియో ఎమ్‌పీవీకి డిమాండ్ లేకపోవడం కారణం చేత, దీని ప్రొడక్షన్‌కు శాస్వతంగా స్వస్తి పలికినట్లు హోండా మోటార్స్ తెలిపింది. అయితే లైనప్ నుండి ఓ మోడల్ తొలంగించే సందర్భంలో దీనికి ప్రత్యామ్నాయ మోడల్ మీద దృష్టి సారించినట్లు తెలిసింది.

గడిచిన నెలలో ఒక్క మొబీలియో ఎమ్‌పీవీ వాహనాన్ని కూడా హోండా అమ్మలేకపోయింది. ఈ కారణం చేత ప్రొడక్షన్‌కు స్వస్తి పలికినట్లు తెలిసింది.

హోండా కార్స్ ఇండియా సిఇఓ మరియు ప్రెసిడెంట్ యోఇచిరో యుయెనో మాట్లాడుతూ, ఈ ఏడాది నుండి నూతన భద్రతా రెగ్యులేషన్స్ అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం మొబీలియో రెగ్యులేషన్స్‌ను పాటించలేకపోతోంది. కాబట్టి ఉత్పత్తుల మోడిఫికేషన్‌ లేదా నూతన ఉత్పత్తుల కోసం మరింత పెట్టుబడిపెట్టాల్సిన అవసరం ఉందని తెలిపాడు.

మొబీలియో మెరుగైన అమ్మకాలను సాధించని సమయం నుండి ఎమ్‌పీవీ సెగ్మెంట్లోకి మరో మోడల్ తెచ్చేందుకు ఎంత మేర పెట్టుబడి పెట్టాలి అనే అంశం మీద హోండా మోటార్స్ తర్జనభర్జనలు చేస్తోంది.

హోండా మోటార్స్ 2014 లో మొబీలియో ఎమ్‌పీవీని విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 40,789 యూనిట్ల మొబీలియో అమ్మకాలు జరిపింది. విపణిలో మారుతి ఎర్టిగా మరియు రెనో లాజీ వాహనాలతో గట్టి పోటీని ఎదుర్కుంది.

మొబీలియో మీద ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే, మరో రెండు నెలల్లో కొత్త తరం మొబీలియోను ఇండియాకు తీసుకువచ్చే విశయం. ఇప్పటికే హోండా తమ అప్‌డేటెడ్ మొబీలియో ఎమ్‌పీవీని ఇండోనేషియా మార్కెట్లో అందుబాటులో ఉంచింది.

మారుతి బాలెనో ఆర్ఎస్ విడుదల: ధర రూ. 8.69 లక్షలు
మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ ను విపణిలోకి విడుదల చేసింది. మారుతి నుండి బాలెనో ఆర్ఎస్ మొట్టమొదటి శక్తివంతమైన హాట్ హ్యాచ్‌బ్యాక్. వేరియంట్లు, ధర, ఫీచర్లు, ఇంజన్ మరియు పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి...

హోండా మోటార్స్ అతి త్వరలో తమ డబ్ల్యూఆర్-వి కాంపాక్ట్ క్రాసోవర్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. తాజా ఆటోమొబైల్ సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి... హోండా ఈ మధ్యనే విడుదల చేసిన 2017 సిటి సెడాన్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

 

English summary
Honda Mobilio Production Ends — What Went Wrong For Honda's MPV Dream?
Story first published: Saturday, March 4, 2017, 12:29 [IST]
Please Wait while comments are loading...

Latest Photos