షాకింగ్ ప్రైజ్‌తో విడుదలైన 4-వీల్ డ్రైవ్‌ హ్యుందాయ్ టక్సన్

Written By:

హ్యుందాయ్ మోటార్స్ విపణిలోకి టక్సన్ 4-వీల్ డ్రైవ్ వేరియంట్‌ను విడుదల చేసింది. సరికొత్త ఫోర్ వీల్ డ్రైవ్ వెర్షన్ హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ ధర రూ. 25.19 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

హ్యుందాయ్ టక్సన్ ఫోర్ వీల్ డ్రైవ్

హ్యుందాయ్ టక్సన్ 4-వీల్ డ్రైవ్ వేరియంట్లో 2.0-లీటర్ సామర్థ్యం గల టుర్బో డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే 182 బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

హ్యుందాయ్ టక్సన్ ఫోర్ వీల్ డ్రైవ్

టక్సన్‌లో పరిచయం చేసిన సరికొత్త 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఫోర్ వీల్ డ్రైవ్ మోడ్‌లను వెహికల్ రన్నింగ్‌లో ఉన్నపుడు కూడా ఆటోమేటిక్‌గా మార్చుతుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్‌లో ఆశించిన మేర టార్క్ అందకపోతే డ్రైవ్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా మారిపోతుంది.

హ్యుందాయ్ టక్సన్ ఫోర్ వీల్ డ్రైవ్

వెహికల్ రన్నింగ్‌లో ఉన్నపుడు డ్రైవ్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా మారే ఫీచర్ ఉండటం ద్వారా అధిక మైలేజ్ పొందవచ్చు. అయితే, మ్యాన్యువల్‌గా కేవసం 4-వీల్ డ్రైవ్‌లో వెహికల్ నడిపితే ముందు మరియు వెనుక చక్రాలకు టార్క్ సమానంగా సరఫరా అవుతుంది. మరియు ఇందులో అత్యాధునిక ట్రాక్షన్ కార్నరింగ్ కంట్రోల్ సిస్టమ్ కలదు, మలుపుల్లో అధిక గ్రిప్ పొందడానికి ఇది సహకరిస్తుంది.

హ్యుందాయ్ టక్సన్ ఫోర్ వీల్ డ్రైవ్

హ్యుందాయ్ టక్సన్ లోని జిఎల్ వేరియంట్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. టక్సన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, వెహికల్ స్టెబిలిటి మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్ హిల్ బ్రేక్ అసిస్ట్ కంట్రోల్, మరియు అత్యుత్త డ్రైవింగ్ పనితీరు కోసం బ్రేక్ అసిస్ట్ వ్యవస్థను అందించింది.

హ్యుందాయ్ టక్సన్ ఫోర్ వీల్ డ్రైవ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ పరిచయంతో టక్సన్ ఎస్‌యూవీలో ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలు మరింత మెరుగయ్యాయని చెప్పవచ్చు. విపణిలో ఉన్న జీప్‌తో గట్టి పోటీని ఎదుర్కుంటున్న టక్సన్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చింది. అయితే, ఇది కంపాస్ 4-వీల్ డ్రైవ్‌ వేరింయట్‌ను అధిగమించడం కష్టమే.

English summary
Read In Telugu: Hyundai Tucson 4WD Launched In India At Rs 25.19 Lakh
Story first published: Friday, October 6, 2017, 17:57 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark