హ్యుందాయ్ ఎక్సెంట్ ప్రైమ్ సిఎన్‌జి వేరియంట్ విడుదల

Written By:

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కారును ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో విడుదల చేసింది.

టి మరియు టిప్లస్ అనే రెండు వేరియంట్లలో సిఎన్‌జి పరిజ్ఞానాన్ని అందించినట్లు హ్యుందాయా మోటార్స్ తెలిపింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హ్యుందాయ్ ఎక్సెంట్ సిఎన్‌జి

భారతదేశపు కమర్షియల్ సెడాన్ సెగ్మెంట్లో సిఎన్‌జితో పరిచయమైన తొలి కారుగా హ్యుందాయ్ ఎక్సెంట్ ప్రైమ్ సిఎన్‌జి నిలిచింది. ఎక్సెంట్ ప్రైమ్ సిఎన్‌జి వేరియంట్ మీద 100,000 కిలోమీటర్లు లేదా మూడేళ్ల పాటు వారంటీ అందిస్తోంది.

Recommended Video
Volkswagen Launches Tenth Anniversary special Editions | In Telugu - DriveSpark తెలుగు
హ్యుందాయ్ ఎక్సెంట్ సిఎన్‌జి

హ్యుందాయ్ మోటార్స్ తమ ఎక్సెంట్ ప్రైమ్ కాంపాక్ట్ సెడాన్‌లో అందించిన ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‍‌లో స్పీడ్ లిమిటింగ్ ఫంక్షన్(వేగ పరిమితి)ను అదనపు ధర లేకుండా పూర్తి ఉచితంగా అందిస్తోంది.

హ్యుందాయ్ ఎక్సెంట్ సిఎన్‌జి

అంతే కాకుండా, తయారీదారుడు అందించిన సిఎన్‌జి కిట్ గల కార్ల రిజిస్ట్రేషన్ మరియు ఫైనాన్స్ పనులు చాలా వేగంగా జరుగుతాయి. కొన్ని రాష్ట్రాలలో సిఎన్‌జి కిట్ గల కార్ల రిజిస్ట్రేషన్ మీద రాయితీలు కూడా ఉన్నాయి. సాధారణ కార్లలో సిఎన్‌జి కిట్ అమర్చుకోవడం చాలా కష్టతరమైనది. అయితే హ్యుందాయ్ కస్టమర్ల కోసం ఫ్యాక్టరీలోనే సిఎన్‌జి కిట్ అమర్చి డెలివరీ ఇస్తోంది.

హ్యుందాయ్ ఎక్సెంట్ సిఎన్‌జి

సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కస్టమర్లకు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభవాన్ని కల్పించడం కోసం, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా, తమ కార్లలో మార్పులు తీసుకొస్తున్నట్లు ఎక్సెంట్ ప్రైమ్ సిఎన్‌జి వేరియంట్ విడుదల సంధర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సేల్స్ మరియు మార్కెటింగ్ మేనేజర్ రాకేష్ శ్రీవాస్తవ తెలిపాడు.

హ్యుందాయ్ ఎక్సెంట్ సిఎన్‌జి

వాణిజ్య పరమైన అవసరాలకు అధిక సంఖ్యలో కార్లను కొనుగోలు చేసే వారికి సరసమైన ధరలోనే సిఎన్‌జి పరిజ్ఞానం గల హ్యుందాయ్ ఎక్సెంట్ ప్రైమ్ సిఎన్‌జి కార్లను విక్రయించనున్నట్లు హ్యుందాయ్ తెలిపింది.

హ్యుందాయ్ ఎక్సెంట్ సిఎన్‌జి

హ్యుందాయ్ ఎక్సెంట్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఎక్సెంట్ ప్రైమ్ సిఎన్‌జి మోడల్ 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో లభిస్తోంది. 82బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తోంది.

హ్యుందాయ్ ఎక్సెంట్ సిఎన్‌జి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అద్దె కార్ల వ్యాపార నిర్వహణ కోసం మారుతి డిజైర్, టయోటా ఎటియోస్ మరియు హ్యుందాయ్ ఎక్సెంట్ కార్లను ఇప్పుడు అధికంగా ఎంచుకుంటున్నారు. వాణిజ్యపరమైన విక్రయాలను పెంచుకునేందుకు హ్యుందాయ్ తమ ఎక్సెంట్ సెడాన్‌లో సిఎన్‌జి కిట్ పరిచయం చేసింది.

English summary
Read In Telugu: Hyundai Xcent Prime With Factory-Fitted CNG Introduced In India
Please Wait while comments are loading...

Latest Photos