భారతదేశపు తొలి, అరుదైన ల్యాంబోర్గిని హురాకన్ ఫర్మామెంట్ కారు భాగ్యనగరంలో

Written By:

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ల్యాంబోర్గిని అత్యంత అరుదైన హురాకాన్ పర్ఫామెంట్ కారును ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. తరువాత తొలి హురాకాన్ పర్ఫామెంట్ కారును ముంబాయ్‌లో విక్రయించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హైదరాబాద్‌లో ల్యాంబోర్గిని హురాకాన్ పర్ఫామెంట్ కారు

లాంబోర్గిని ఇప్పుడు తమ రెండవ హురాకాన్ పర్ఫామెంట్ కారును హైదరాబాద్‌లో విక్రయించింది. భారతదేశపు రెండవ హురాకాన్ పర్ఫామెంట్ సూపర్ కారు గురించి మరిన్ని వివరాలు ఇవాళ్టి కథనంలో...

Recommended Video
[Telugu] BMW 330i Gran Turismo Launched In India - DriveSpark
హైదరాబాద్‌లో ల్యాంబోర్గిని హురాకాన్ పర్ఫామెంట్ కారు

ప్రపంచపు అత్యంత అరుదైన ల్యాంబోర్గిని హురాకాన్ పర్ఫామెంట్ కారును అందుకున్న భారతదేశపు రెండవ నగరం ముంబాయ్ తరువాత హైదరాబాద్. ఈ కారును కొనుగోలు చేసిన వ్యక్తి భాగ్య నగరంలోని దేవాలయంలో పూజ నిర్వహిస్తున్న ఫోటోలను ల్యాంబోర్గిని కంపెనీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

హైదరాబాద్‌లో ల్యాంబోర్గిని హురాకాన్ పర్ఫామెంట్ కారు

ఇండియా యొక్క రెండవ హురాకాన్ పర్ఫామెంట్ సూపర్ కారు ధర రూ. 3.97 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ల్యాంబోర్గిని దీనిని హురాకాన్ ట్రోఫియో రేస్ కార్ ప్రేరణతో డెవలప్ చేసింది.

హైదరాబాద్‌లో ల్యాంబోర్గిని హురాకాన్ పర్ఫామెంట్ కారు

కారు పై గాలి ద్వారా కలిగే ఘర్షణను మరియు డౌన్ ఫోర్స్‌ను తగ్గించడానికి ఆక్టివా ఏరో అజెండా అనే టెక్నాలజీని ఫ్రంట్ డిజైన్‌ను అభివృద్ది చేసింది. దీని ద్వారా గరిష్టంగా ఏర్పడే డౌన్‌ఫోర్స్‌ను ముందు వైపు ఫ్రంట్ గ్రిల్‌లో ఉన్న ఫ్లిప్స్ మరియు రియర్ స్పాయిలర్‌ను ఆపరేట్‌ చేయడం ద్వారా తగ్గించవచ్చు.

హైదరాబాద్‌లో ల్యాంబోర్గిని హురాకాన్ పర్ఫామెంట్ కారు

ల్యాంబోర్గిని హురాకాన్ పర్ఫామెంట్ కారులో ఇంజన్ కవర్, ఫ్రంట్ స్పాయిలర్, రియర్ బంపర్, రియర్ స్పాయిలర్, ఢిఫ్యూసర్, సెంటర్ కన్సోల్, పెడల్స్, హెచ్‌విఎస్ వెంట్స్, మరియు డోర్ హ్యాండిల్స్ వంటి ఫోర్జ్‌డ్ కాంపోజిట్ కార్బన్ ఫైబర్ విడిపరికరాలు కలవు.

హైదరాబాద్‌లో ల్యాంబోర్గిని హురాకాన్ పర్ఫామెంట్ కారు

హురాకాన్ పర్ఫామెంట్ మోడల్‌లో ఈ ఫోర్జ్‌డ్ కాంపోజిట్ కార్బన్ ఫైబర్ విడిపరికరాలను వినియోగించడం వలన రెగ్యులర్ హురాకాన్‌తో పోల్చితే బరువు 40కిలోల వరకు తగ్గింది. ఇంటీరియర్‌లో సరికొత్త డిజిటల్ కాక్‌పిట్ డిస్ల్పే కలదు. మరియు ఈ స్పోర్ట్స్ కారును స్ట్రాడా, స్పోర్ట్ లేదా కోర్సా డ్రైవింగ్ మోడ్‌లలో డ్రైవ్ చేయవచ్చు.

హైదరాబాద్‌లో ల్యాంబోర్గిని హురాకాన్ పర్ఫామెంట్ కారు

సాంకేతికంగా ల్యాంబోర్గిని హురాకాన్ పర్ఫామెంట్ మోడల్‌లో 5.2-లీటర్ కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 640బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హైదరాబాద్‌లో ల్యాంబోర్గిని హురాకాన్ పర్ఫామెంట్ కారు

7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ గల ల్యాంబోర్గిని హురాకాన్ పర్ఫామెంట్ సూపర్ కారు ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్‌ను వెనుక చక్రాలకు సరఫరా చేస్తుంది. ఈ సూపర్ కేవలం 2.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 - 100కిమీల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 325కిలోమీటర్లుగా ఉంది.

English summary
Read In Telugu: India’s Second Lamborghini Huracan Performante Delivered In Hyderabad
Story first published: Tuesday, October 31, 2017, 12:52 [IST]
Please Wait while comments are loading...

Latest Photos