దేశవ్యాప్తంగా పెరిగిన ఇసుజు వాహనాల ధరలు: కానీ ఏపిలో తగ్గుముఖం పట్టాయి

Written By:

జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తర్వాత ప్యాసింజర్ కార్ల మీద జిఎస్‌టి స్లాబుల్లో ఉన్న గరిష్ట జిఎస్‌టి ట్యాక్స్‌ను అమలు చేసారు. అయితే వివిధ కెటగిరీల వారీగా జిసిటిలో వ్యత్యాసం కనబరిచేందుకు అదనంగా జిఎస్‌టి సెస్ విధించారు.

ఇసుజు కార్ల ధరలు

అయితే, తాజాగా జిఎస్‌టి మండలి ప్యాసింజర్ కార్ల మీద ఉన్న జిఎస్‌టి ట్యాక్స్‌లలో మార్పులు చేర్పులు చేసి నూతన జిఎస్‌టి ట్యాక్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ మార్పులు వర్తించే వాహనాలలో జిఎస్‌టి పెరగడంతో వాటి ధరలు కూడా పెరిగాయి.

ఇసుజు కార్ల ధరలు

జిఎస్‌టి మండలి చేసిన మార్పుల్లో మిడ్ సైజ్ కార్లు, లగ్జరీ కార్లు మరియు ఎస్‌యూవీల మీద అదనంగా 2 నుండి 7 శాతం వరకు సెస్ పెంచడం జరిగింది. దీనికి అనుగుణంగా టయోటా కిర్లోస్కర్ ఇడియా తమ ఉత్పత్తుల మీద ధరలు పెంచింది. ఇప్పుడు ఇసుజు కూడా తమ వెహికల్స్ మీద ధరలు పెంచినట్లు ప్రకటించింది.

Recommended Video - Watch Now!
Volkswagen Launches Tenth Anniversary special Editions | In Telugu - DriveSpark తెలుగు
ఇసుజు కార్ల ధరలు

ఇసుజు ఇండియా లైనప్‌లో ఉండే ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీ మరియు డి-మ్యాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్కుల మీద ధరలు పెరిగాయి. ధరల సవరణ అనంతరం వీటి ధరలు ఇలా ఉన్నాయి.

  • ఇసుజు ఎమ్‌యు-ఎక్స్(4X2) వేరియంట్ ధర రూ. 23.47 లక్షలు
  • ఇసుజు ఎమ్‌యు-ఎక్స్(4X4) వేరియంట్ ధర రూ. 25.43 లక్షలు ఎక్స్-షోరూమ్(చెన్నై)గా ఉన్నాయి.
ఇసుజు కార్ల ధరలు

ఇసుజు గత ఏడాది భారతదేశపు తొలి అడ్వెంచర్ యుటిలిటి వెహికల్ డి-మ్యాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్కును విడుదల చేసింది. జిఎస్‌టి మార్పుల అనంతరం జరిగిన ధరల సవరణ తర్వాత దీని ధర రూ. 13.11 లక్షలు. దేశవ్యాప్తంగా వీటి ధరలు పెరిగినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో తగ్గినట్లు ఇసుజు పేర్కొంది.

ఇసుజు కార్ల ధరలు

ఆంధ్రప్రదేశ్‌లో వీటి ధరలు ఎందుకు తక్కువ..?

AP ప్రభుత్వం మేరకు, ఇసుజు మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లో విక్రయించే వాహనాల మీద మార్చి 31, 2021 వరకు మోటార్ వెహికల్ ట్యాక్స్ వర్తించదని ఇసుజు ప్రకటించింది. ఏపిలో వాహన తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇసుజు కార్ల ధరలు

ఏపిలో ఇసుజు ప్యాసింజర్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు ఇన్ వాయిస్ బిల్లులోని 14 శాతం జీవిత కాలపు ట్యాక్స్ చెల్లించనవసరం లేదు. అయితే, ఇసుజు వాణిజ్య వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు ప్రతి మూడు నెలలకొకసారి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

ఇసుజు కార్ల ధరలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల శ్రీసిటి ఇసుజు ప్రొడక్షన్ ప్లాంటు 107 ఎకరాలలో విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఏడాదికి 50,000 యూనిట్ల ప్రొడక్షన్ జరుగుతోంది, దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1,20,000 యూనిట్లుగా ఉంది.

ఇసుజు కార్ల ధరలు

ఇసుజు ఇండియాలో లైనప్‌లోని ప్యాసింజర్ వెహికల్ విభాగంలో ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీ, డి-మ్యాక్స్ వి-క్రాస్ అడ్వెంచర్ యుటిలిటి వెహికల్ ను విక్రయిస్తోంది. అదే విధంగా కమర్షియల్ విభాగంలో డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ మరియు డి-మ్యాక్స్ వాహనాలు ఉన్నాయి.

ఇసుజు కార్ల ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నాలుగు మీటర్ల కన్నా ఎక్కువ పొడవున్న వాహనాల మీద జిఎస్‌టి మళ్లీ పెంచడంతో ఇసుజు మోటార్ ఇండియా తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి.

Read more on: #ఇసుజు #isuzu
English summary
Read In Telugu: Isuzu Car Prices Increase After GST Revision On Cess
Story first published: Thursday, September 14, 2017, 18:13 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark