విపణిలోకి ఇసుజు ఎమ్‌యు-ఎక్స్: ధర రూ. 23.99 లక్షలు

Written By:

జపాన్‌ దిగ్గజం ఇసుజు మోటార్స్ విపణిలోకి ఎమ్‌యు-ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 23.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఎస్‌యూవీ విడుదల వివరాలు...

ఇసుజు మోటార్స్‌కు చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటిలో ఉన్న తయారీ ప్లాంటులో ఈ ప్రీమియమ్ ఎస్‌యూవీ ఎమ్‌యు-ఎక్స్‌ తయారవుతోంది. ఈ ఎస్‌యూవీ శ్రీ సిటి ప్లాంటు నుండి రెండవది.

ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఎస్‌యూవీ విడుదల వివరాలు...

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి, టూ వీల్ డ్రైవ్ మరియు ఫోర్ వీల్ డ్రైవ్. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ. 25.99 లక్షలు ఎక్స్‌-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఎస్‌యూవీ విడుదల వివరాలు...

తొలుత ఇసుజు విడుదల చేసిన డి-మ్యాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్కు యొక్క డిజైన్ లక్షణాలను సేకరించి ఎమ్‌యు-ఎక్స్‌లో అందివ్వడం జరిగింది. ముందు మరియు వైనుక వైపు ఉబ్బెత్తు రూపాన్ని కలిగి ఉంటుంది.

ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఎస్‌యూవీ విడుదల వివరాలు...

ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌లో రెండు క్రోమ్ స్లాట్లు ఉన్న క్రోమ్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి. మరియు 17-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ వీల్స్ అదే విధంగా రూఫ్ రెయిల్స్ ఇందులో ప్రత్యేకం.

ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఎస్‌యూవీ విడుదల వివరాలు...

సాంకేతికంగా ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌‌యూవీలో 3-లీటర్ల సామర్థ్యం ఉన్న టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 177బిహెచ్‌పి పవర్ మరియు 380ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఎస్‌యూవీ విడుదల వివరాలు...

టూ వీల్ మరియు ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్లు ఉన్న ఈ ఎస్‌యూవీలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ కలదు. టూ వీల్ డ్రైవ్ వేరియంట్ లీటర్‌కు 13.8కిమీల మైలేజ్ ఇవ్వగలదని ఇసుజు ప్రకటించింది.

ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఎస్‌యూవీ విడుదల వివరాలు...

ఇసుజులోని ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్లో ఇంజన్ విడుదల చేసే పవర్ రెండు చక్రాలకు లేదా నాలుగు చక్రాలకు సరఫరా అయ్యేవిధంగా రకరకాల రేంజ్‌ల ఆధారంగా డ్రైవ్ మోడ్ సెలక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లో టు-హై, ఫోర్-హై మరియు ఫోర్-లో అనే రేంజ్‌లు ఉన్నాయి.

ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఎస్‌యూవీ విడుదల వివరాలు...

ఇసుజు తమ పికప్ ట్రక్ డి-మ్యాక్స్ వి-క్రాస్ ఇంటీరియర్ ఆధారంగా ఎమ్‌యు-ఎక్స్ ఇంటీరియర్ డెవలప్ చేయడం జరిగింది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటి గల 7-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఎస్‌యూవీ విడుదల వివరాలు...

రూఫ్ ఆధారంతో నిర్మించిన 10-అంగుళాల మానిటర్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొండలు మరియు లోయ ప్రాంతాల్లో సురక్షితమైన డ్రైవింగ్ కోసం అప్ హిల్ మరియు డౌన్ హిల్ కంట్రోల్ వ్యవస్థ కలదు.

ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఎస్‌యూవీ విడుదల వివరాలు...

భద్రత పరంగా ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఎస్‌యూవీ విడుదల వివరాలు...

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీని నాలుగు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి,

  • సిల్కీ వైట్,
  • ఆర్చిడ్ బ్రౌన్,
  • కాస్మిక్ బ్లాక్,
  • టైటానియమ్ సిల్వర్.
ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఎస్‌యూవీ విడుదల వివరాలు...

ఇసుజు తాజాగ అంతర్జాతీయ విపణిలోకి ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు దేశీయ విపణిలోకి విడుదలైన ఎమ్‌యు-ఎక్స్ ప్రి-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌. ఇది టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్‌లకు బలమైన పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu About Isuzu MU-X Launched In India

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark