జాగ్వార్ ఎక్స్ఇ డీజల్ వేరియంట్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్ల కోసం...

జాగ్వార్ తమ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్ కారును మరో ఇంధన వేరియంట్లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో అందుబాటులో ఉన్న ఎక్స్ఇ పెట్రోల్ వేరియంట్‌కు కొనసాగింపుగా డీజల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది.

By Anil

దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా అనుభంద సంస్థ జాగ్వార్ నేడు(22 మే, 2017) విపణిలోకి తమ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్ కారును డీజల్ వేరియంట్లో విడుదల చేసింది. ప్రెస్టీజ్ మరియు పోర్ట్‌ఫోలియో అను మరో రెండు వేరియంట్లలో కూడా డీజల్ వెర్షన్ ఎక్స్ఇ అందుబాటులో ఉంది.

జాగ్వార్ ఎక్స్ఇ డీజల్ విడుదల

జాగ్వార్ తమ ఎక్స్ఇ డీజల్ మోడల్ నందు 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజీనియమ్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ అందించింది. పెడల్ షిఫ్టర్ల్ జోడింపు గల 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఈ ఇంజన్ గరిష్టంగా 177బిహెచ్‌పి పవర్ మరియు 430ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

జాగ్వార్ ఎక్స్ఇ డీజల్ విడుదల

జాగ్వార్ ఇండియా లైనప్‌లోని డీజల్ వెర్షన్ లేని ఏకైక సెడాన్ ఎక్స్ఇ. ఇప్పుడు ఇందులో డీజల్ ఇంజన్ అందివ్వడం ద్వారా జాగ్వార్ లైనప్‌లో ఉన్న డీజల్ వేరియంట్ లోటును పూడ్చేసింది.

జాగ్వార్ ఎక్స్ఇ డీజల్ విడుదల

జాగ్వార్ ఎక్స్ఇ డీజల్ వేరియంట్‌కు ప్రత్యక్ష పోటీగా ఉన్న మెర్సిడెస్ సి220డి మోడల్ కన్నా 10బిహెచ్‌పి కన్నా ఎక్కువ మరియు బిఎమ్‌డబ్ల్యూ 320డి అదే విధంగా ఆడి ఏ4 35 టిడిఐ మోడళ్ల కన్నా 10బిహెచ్‌పి తక్కువగా ఉత్పత్తి చేస్తుంది.

జాగ్వార్ ఎక్స్ఇ డీజల్ విడుదల

జాగ్వార్ విడుదల చేసిన బ్రోచర్ ప్రకారం, పెట్రోల్ మరియు డీజల్ వెర్షన్ జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్‌లలో ఉన్న ఫీచర్లలో పెద్దగా తేడాలేమీ లేవు. దేశీయంగా ఉన్న పూనే ప్రొడక్షన్ ప్లాంటులో జాగ్వార్ తమ ఎక్స్ఇ సెడాన్‌ను ఉత్పత్తి చేయనుంది.

జాగ్వార్ ఎక్స్ఇ డీజల్ విడుదల

డిజైన్ పరంగా జాగ్వార్ ఎక్స్ఇ డీజల్, దీనికి తోబుట్టువుగా ఉన్న పెట్రోల్ వేరియంట్‌ను పోలి ఉంటుంది. తేలికపాటి బరువున్న అల్యూమినియం బాడీతో దీనిని రూపొందించారు.

జాగ్వార్ ఎక్స్ఇ డీజల్ విడుదల

ఫీచర్ల పరంగా జాగ్వార్ తమ ఎక్స్ఇ డీజల్ వేరియంట్లో, 8-అంగుళాల పరిమాణం ఉన్న తాకే తెర గల ఇన్‌కంట్రోల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యానరోమిక్ సన్ రూఫ్, మరియు మెరేడియన్ సౌండ్ సిస్టమ్ వంటి వాటితో ఇతర ఫీచర్లున్నాయి.

జాగ్వార్ ఎక్స్ఇ డీజల్ విడుదల

ఈ సెడాన్‌లో డ్రైవర్ విభిన్న డ్రైవింగ్ మోడ్స్ సెలక్ట్ చేసుకుని నడిపేందుకు జాగ్వార్ డ్రైవ్ కంట్రోల్ సిస్టమ్ అందివ్వడం ద్వారా. ఈ వ్యవస్థ ద్వారా నార్మల్, ఎకో, డైనమిక్, రెయిన్ మరియు స్నో అనే ఐదు రకాల మోడ్స్‌లో డ్రైవ్ చేయవచ్చు.

జాగ్వార్ ఎక్స్ఇ డీజల్ విడుదల

జాగ్వార్ గత నెల రోజులుగా ఎక్స్ఇ డీజల్ సెడాన్ మీద బుకింగ్స్ ప్రారంభించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న జాగ్వార్ విక్రయ కేంద్రాలలో అమ్మకాలకు సిద్దంగా ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu Jaguar XE Diesel Launched In India
Story first published: Monday, May 22, 2017, 17:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X