జీప్ కంపాస్ క్రాష్ పరీక్షల్లో అద్బుతమైన ఫలితాలు: నిశ్చింతగా కొనొచ్చు

Written By:

జీప్ కంపాస్‍ ఇండియాలో విడుదలైనప్పటి నుండి మంది ఆదరణ లభిస్తోంది. ఇప్పటకే కంపాస్ 10,000 లకు పైగా బుకింగ్స్ అందుకోగా 92,000 లకు పైగా ఎంక్వైరీలు వచ్చాయి.

దీనికి తోడు యూరో ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో ఐదుకు 5-స్టార్ల రేటింగ్ దక్కించుకుంది. ఈ క్రాష్ పరీక్షల ఫలితాలు జీప్ కంపాస్ ధృడత్వాన్ని బయటపెట్టాయి. కంపాస్ మీద భద్రత పరంగా ఇండియన్స్ ఉంచుకున్న నమ్మకం నిజమైందని చెప్పాలి.

 జీప్ కంపాస్ క్రాష్ పరీక్షలు

పెద్దల భద్రత పరంగా 90 శాతం, చిన్న పిల్లల సేఫ్టీ పరంగా ఎస్‌యూవీ 83 శాతం మరియు 64 శాతం పాదచారుల భద్రత పరంగా స్కోర్ చేసింది. జీప్ కంపాస్ 4X4 లిమిటెడ్ వేరియంట్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వెహికల్‌ను పరీక్షించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా లెఫ్ట్ హ్యాండ్ మరియు రైడ్ హ్యాండ్ డ్రైవ్ వేరియంట్లలో అదే స్థాయి సేఫ్టీని అందిస్తున్నట్లు జీప్ వెల్లడించింది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
 జీప్ కంపాస్ క్రాష్ పరీక్షలు

ఇండియన్ స్పెక్ జీప్ కంపాస్ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉండగా, గ్లోబల్ వేరియంట్లో ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. అయితే రెండు మోడళ్లలో ఒకే విధమైన నిర్మాణ విలువలు, అదే ధృడమైన బాడీ మరియు ఇతర సేఫ్టీ ఫీచర్లున్నాయి.

 జీప్ కంపాస్ క్రాష్ పరీక్షలు

కంపాస్ ఎస్‌యూవీకి ముందు వైపు నుండి నిర్వహించిన క్రాష్ టెస్టు ముందు వరుస మరియు వెనుక వరుస ప్రయాణికులకు ప్రమాదం తీవ్రత చేరే అవకాశం దాదాపు తక్కువగా ఉన్నట్లు యూరో ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ బృందం వెల్లడించింది.

 జీప్ కంపాస్ క్రాష్ పరీక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ మోడల్ కంపాస్‌ మధ్య ఎయిర్ బ్యాగులు వ్యత్యాసం మినహాయిస్తే, రెండింటిలో దాదాపు ఒకే విధమైన భద్రత ఫీచర్లు ఉన్నాయి. మరియు శరీర నిర్మాణం పరంగా అదే ధృడత్వాన్ని కలిగి ఉంది.

మరిన్ని వివరాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు నిర్వహించిన జీప్ కంపాస్ రివ్యూను చదవండి....

English summary
Read In Telugu: jeep compass crash test scores 5 stars NCAP

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark