బారికేడ్లను ఢీకొట్టి పోలీసుల మీదకు వాహనాన్ని పోనిచ్చిన బీజేపీ ఎంపీ

Written By:

రూల్స్ ఫాలో అవ్వలేదని ఆపినందుకు కొంత మంది వ్యక్తుల పోలీసులతో వారించడాన్ని తరచూ చూస్తుంటాం. ఇలాంటి సంఘటన కారణంగానే కర్ణాటకలోని ఓ బీజేపీ లోక్ సభ ఎంపీ ఇప్పుడు వార్తల్లోకెక్కాడు.

పోలీసుల మీదకు వాహనాన్ని నడిపిన మైసూరు బీజేపీ ఎంపీ

కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నేత ప్రతాప్ సింహ కర్ణాటక పోలీసులతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరుకోవడంతో కోపోద్రిక్తుడైన ప్రతాప్ సింహ పోలీసుల మీదకు వెహికల్‍ను పోనిచ్చి, దురుసుగా ప్రవర్తించాడు.

పోలీసుల మీదకు వాహనాన్ని నడిపిన మైసూరు బీజేపీ ఎంపీ

వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని మైసూరుకు సమీపంలో హన్సూర్ వద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్న కారణంగా ఆ మార్గంలో రాకపోకలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే క్రమంలో అటుగా వచ్చిన ఎంపీ వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షన జరిగింది.

పోలీసుల మీదకు వాహనాన్ని నడిపిన మైసూరు బీజేపీ ఎంపీ

బిలికేరి ప్రాంతంలో పోలీసు సిబ్బంది ప్రతాప్ సింహ ప్రయాణిస్తున్న టయోటా ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ప్రతాప్ వాహనం దిగి పోలీసుల వద్దకెళ్లి వాగ్వాదానికి దిగాడు. మళ్లీ వచ్చి డ్రైవర్ సీటులో కూర్చుని పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టుకుంటూ పోలీసుల మీదకు వాహనాన్ని నడిపాడు.

పోలీసుల మీదకు వాహనాన్ని నడిపిన మైసూరు బీజేపీ ఎంపీ

మీడియా ప్రతినిధులు కూడా అక్కడే ఉండటంతో జరిగిన సంఘటన మొత్తాన్ని రికార్డు చేశారు. దీని గురించి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదకరంగా వాహనాన్ని నడపడం మరియు పోలీసు విధులకు భంగం కలిగించిన అంశాల క్రింద ప్రతాప్ సింహ మీద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను దూషించడం మరియు వారి విధులకు భంగం కలిగించినందుకు గాను సెక్షన్ 353, డ్యూటీలో ఉన్న ప్రజా సేవకుల మీద పాక్షిక దాడికి యత్నించడం- సెక్షన్ 332 అదే విధంగా ర్యాష్ మరియు నిర్లక్షంగా వాహనాన్ని నడిపినందుకు సెక్షన్ 279 క్రింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.

మైసూరు ప్రాంతానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతాప్ సింహ బీజేపీ యూత్ విభాగపు(యువ మోర్చా) ఛీఫ్ వ్యవహరిస్తున్నాడు. బారికేడ్లను ఢీకొన్నందుకు పోలీసులు నా మీద క్రిమినల్ కేసు పెట్టడానికి సిద్దమయ్యారని ప్రతాప్ సింహ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశాడు.

పోలీసుల మీదకు వాహనాన్ని నడిపిన మైసూరు బీజేపీ ఎంపీ

పోలీసు నిభందనలను ఎవరైనా పాటించాల్సిందే. ఇదే సందర్భం మీకు ఎదరైనపుడు పోలీస్ చెక్ పాయింట్ వద్ద వాహనాన్ని ఆపేయండి. పోలీస్ స్టాప్ చెక్ పాయింట్ వద్ద అనధికారికంగా ప్రయాణించడం చట్టరీత్యా నేరం. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం మరియు ప్రజా సేవకులకు హాని కలిగించడం నేరం.

పోలీసుల మీదకు వాహనాన్ని నడిపిన మైసూరు బీజేపీ ఎంపీ

డ్రైవింగ్ అనేది ఒక హక్కుగా కాకుండా ఒక బాధ్యాయుతమైన కర్తవ్యం మరియు ప్రత్యకమైన హక్కుగా ప్రతి ఒక్కరూ భావించాలి. ఇతరులను ప్రమాదాలకు గురిచేయకుండా, వాహనాలతో మరణాలకు కారణం కాకుండా జాగ్రత్తగా వాహనాన్ని నడపండి. ప్రత్యేకించి వెహికల్ ఫస్ట్ గేర్‌లో ఉన్నపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇంజన్ నుండి ఉత్పత్తయ్యే పవర్ మరియు టార్క్ అప్పుడే అధికంగా ఉంటుంది.

పోలీసుల మీదకు వాహనాన్ని నడిపిన మైసూరు బీజేపీ ఎంపీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఈ మొత్తం సంఘటనను పరిశీలిస్తే పోలీసులు ఆపినందుకు బీజేపీ ఎంపీ వారి మీద తీవ్ర కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం సంపదను నాశనం చేయడం మరియు ప్రమాదకరంగా వాహనాన్ని నడపడం వంటివి ఓ ఉన్నత స్థాయి వ్యక్తిగా, మైసూరు వంటి నగరానికి ఎంపీగా వ్యవహరించే వ్యక్తి ఇలాంటి చేయడం చాల చిన్నతనంగా ఉంది.

మనం ఏ స్థాయిలో ఉన్నాసరే ఎవరి విధులకు భంగం కలిగించకుండా సామరస్యంగా వ్యవహరించాలి.

English summary
Read In Telugu: This MP Driving A Toyota Innova Crysta Breaks Barricade And Almost Runs Over Cops

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark