మేడిన్ ఇండియా జీప్ కంపాస్ క్రాష్ టెస్ట్: మతిపోగొట్టిన ఫలితాలు

Written By:

సేఫ్టీ మరియు క్వాలిటీ పరంగా ఫారిన్ కార్లే బెస్ట్ అనుకునే ఇండియన్స్‌కు, ఫారిన్ కార్లే కాదు మేడిన్ ఇండియా కార్లు కూడా సురక్షితమైనవని జీప్ కంపాస్ ఎస్‌యూవీ నిరూపించింది.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్

ఇండియాలో తయారైన జీప్ కంపాస్ ఎస్‌యూవీకి ఆస్ట్రేలియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగామ్(ANCAP) క్రాష్ టెస్టులో అద్భుతమైన ఫలితాలు కనబరించింది. ఆధునిక సేఫ్టీ ప్రమాణాలను పాటించేలా డిజైన్ చేయబడిన జీప్ కంపాస్ ఫుల్ సేఫ్ అని నిరూపించుకుంది.

Recommended Video - Watch Now!
Honda CR-V Crashes Into A Wall
మేడిన్ ఇండియా జీప్ కంపాస్

ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ మార్కెట్లలో అమ్ముడవుతున్న మేడిన్ ఇండియా జీప్ కంపాస్‌కు ఆస్ట్రేలియాలో క్రాష్ పరీక్షలు నిర్వహించగా ఐదింటిగాను ఐదు స్టార్ల రేటింగ్ పొంది భారతదేశంలోని అత్యుత్తమ నిర్మాణ నాణ్యతను చాటింది.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్

డ్యూయల్ ఫ్రంట్, చెస్ట్, కర్టెన్ మరియు డ్రైవర్ నీ ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్‌గా లభించే సెప్టెంబర్ 2017 నుండి జీప్ తయారు చేసిన అన్ని కంపాస్ వేరియంట్లకు ఆ సేఫ్టీ రేటింగ్స్ వర్తిస్తాయి. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు లేన్ సపోర్ట్ వంటి ఫీచర్లు కొన్ని వేరియంట్లలో ఆప్షనల్ ఫీచర్లుగా ఉన్నాయి.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్

క్రాష్ పరీక్షల్లో భాగంగా ముందు నుండి ఢీకొట్టించారు, ఈ టెస్టులో ప్రమాదం తీవ్రత బాడీ మీద మరియు చక్రాల మీద చాలా తక్కుగా ఉంది. ముందు వరుసలో ఉన్న ప్రయాణికులకు కూడా ప్రమాద తీవ్రత దరిచేరనివ్వలేదు. తల మరియు కాళ్ల సురక్షితమే అని తేలినా... చెస్ట్ మరియు పాదాల మీద కొంత వరకు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్

ఫ్రంట్ సైడ్ క్రాష్ టెస్టులో 16 కు గాను 14.93 పాయింట్ల పొందింది. అయితే, సైడ్ క్రాష్ టెస్టులో ఫుల్ పాయింట్లు సాధించింది. సైడ్ బ్యారీయర్ మరియు సైడ్ పోల్స్ పరంగా చూస్తే వరుసగా 16 మరియు 2 పాయింట్లు సాధించింది.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్

పాదచారుల భద్రత పరంగా ఆమోదించదగిన మంచి స్కోర్ లభించింది. అయితే, ఫ్రంట్ మిర్రర్ మరియు ఏ-పిల్సర్స్ పరంగా 36 కు గాను 29.01 పాయింట్లను సాధించింది.

ANCAP క్రాష్ టెస్టులో మొత్తం 37 పాయింట్లకు గాను జీప్ కంపాస్ 35.93 పాయింట్లను సాధించింది. యూరో ఎన్‌సిఎపి ప్రకారం ANCAP కూడా భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేసింది. పెద్దల భద్రత, చిన్న పిల్లల సేఫ్టీ, పాదచారుల భద్రత మరియు సేఫ్టీ అనే నాలుగు అంశాల పరంగా క్రాష్ పరీక్షలు నిర్వహిస్తోంది.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అత్యుత్తమ నాణ్యతా ప్రమణాలతో ఉత్పత్తి తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవాలని జీప్ ఇండియా భావిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రైడ్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ సిస్టమ్ ఉన్న మార్కెట్ల కోసం కంపాస్ ఎస్‌యూవీలను కేవలం ఇండియాలో మాత్రమే ఉత్పత్తి చేస్తోంది.

నాణ్యత విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మించడంతో ANCAP క్రాష్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. దీంతో అమెరికా దిగ్గజం జీప్ దేశీయ మార్కెట్‌తో ప్రపంచ మార్కెట్లో కూడా భద్రత పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Made-In-India Jeep Compass Scores A Brilliant 5-Star Safety Rating By ANCAP
Story first published: Saturday, December 23, 2017, 14:36 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark