ఎలక్ట్రిక్ వెర్షన్‌లో మహీంద్రా కెయువి100

Written By:

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్దం చేస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న కెయువి100 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తొలిసారిగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ పట్టుపడింది.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వాహన శ్రేణిని విస్తరించే పనిలో ఉంది. దేశీయ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో రాణించేందుకు విభిన్న ఎలక్ట్రిక్ మోడళ్లను మహీంద్రా అభివృద్ది చేస్తోంది. అందులో భాగంగానే యంగ్ ఎస్‌యూవీ పేరుగాంచిన కెయువి100 ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో డెవలప్ చేసింది.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

మహీంద్రా బృందం తొలిసారిగా కెయువి100 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి అతి రహస్యంగా రహదారి పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు దాని తాలూకు ఫోటోలు ఆన్‌లైన్లో చేరాయి. ఫోటోలను పరిశీలిస్తే కెయువి100 ఎలక్ట్రిక్ చూడటానికి అచ్చం రెగ్యులర్ కెయువి100 వాహనాన్నే పోలి ఉంటుంది.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఎగ్జాస్ట్ పైపు లేదు. అంటే ఎలక్ట్రిక్ మోటార్ వ్యవస్థను ఇన్‌స్టాల్ చేయడంతో ఇక మీదట కెయువి100 శబ్దం రాకుండా పరుగులు పెట్టనుంది. ఎక్ట్సీరియర్ మీద రియర్ బ్లాక్ బంపర్, ఫైరీ ఆరేంజ్ పెయింట్ స్కీమ్ కలదు.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

ప్రస్తుతానికి మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించిన సాంకేతిక వివరాలు ఇంకా వెల్లడవ్వలేదు. దీనిని 2019 నాటికి పూర్తి స్థాయిలో సిద్దం చేసి, విక్రయాలకు అందుబాటులోకి తీసుకురానుంది.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

తాజాగా అందిన సమాచారం మేరకు, దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో రానున్న 3 - 5 సంవత్సరాలలోపు సుమారుగా 4,000 కోట్ల రుపాయలను పెట్టబడిగా పెట్టనుంది. మరో రెండేళ్లలోపు రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనుంది.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

మహీంద్రా ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల లైనప్‌లోకి తీసుకురానున్న వాటిలో మొదటిది ఎలక్ట్రిక్ వెర్షన్ కెయువి100. మరియు రెండవ మోడల్‌ను ఇప్పటికే లైనప్‌లో ఉన్న ఇతర మోడల్‌లో ఎలక్ట్రిక్ వ్యవస్థను జోడించి తీసుకురానుంది.

English summary
Read In Telugu: Mahindra KUV100 Electric Spied Testing India

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark