మహీంద్రా నుండి ట్రాక్‌స్టార్ బ్రాండ్ పేరుతో కొత్త ట్రాక్టర్లు

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్‌స్టార్ బ్రాండ్ పేరు క్రింది కొత్త ట్రాక్టర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా భాగస్వామ్యపు సంస్థ మహీంద్రా గుజరాత్ ట్రాక్టర్స్ లిమిటెడ్(MGTL) పేరును గ్రోమ్యాక్స్ అగ్రి ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ గా మార్చినట్లుగా ప్రకటించింది.

మహీంద్రా ట్రాక్‌స్టార్ ట్రాక్టర్లు

గ్రోమ్యాక్స్ సంస్థ ట్రాక్‌స్టార్ అనే సరికొత్త ట్రాక్టర్ బ్రాండ్ పేరును పరిచయం చేస్తున్నట్లు ఈ సంధర్భంగా వెల్లడించింది. సంస్థ యొక్క మూడవ ట్రాక్టర్ బ్రాండ్ ట్రాక్‌స్టార్. దీని పేరు క్రింది ధరకు తగ్గ విలువ చేసే నూతన వ్యవసాయ పరికరాలను ఉత్పత్తి చేయనుంది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
మహీంద్రా ట్రాక్‌స్టార్ ట్రాక్టర్లు

ట్రాక్‌స్టార్ పేరుతో 30 నుండి 50 హెచ్‌పి మధ్య ప్రతి ఐదు హార్స్‌పవర్ యూనిట్లకు ఒక ట్రాక్టర్ చెప్పున మొత్తం ఐదు ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకురానుంది. అంటే ట్రాక్‌స్టార్ బ్రాండ్ పేరు క్రింది 30Hp, 35Hp, 40Hp, 45Hp మరియు 50Hp పవర్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ట్రాక్టర్లను ప్రవేశపెట్టనుంది.

మహీంద్రా ట్రాక్‌స్టార్ ట్రాక్టర్లు

మహీంద్రా అండ్ మహీంద్రా వ్యవసాయ పనిముట్ల విభాగాధిపతి రాజేష్ మాట్లాడుతూ," అధునిక వ్యవసాయం పరికరాలతో రైతులను చేరడం మరియు రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా మహీంద్రా చేసిన ప్రయాణంలో గ్రోమ్యాక్స్ కీలకంగా వ్యవహరిస్తోందని తెలిపాడు."

మహీంద్రా ట్రాక్‌స్టార్ ట్రాక్టర్లు

రాజేష్ మాట్లాడుతూ, "ట్రాక్‌స్టార్ శ్రేణి ట్రాక్టర్లు మార్కెట్లో ఉన్న 80శాతం వరకు ట్రాక్టర్లతో పోటీపడతాయి. గ్రోమ్యాక్స్‌తో భాగస్వామ్యం మరియు గుజరాత్‌ ప్రభుత్వపు సహాకారం మరువలేదని ఆయన చెప్పుకొచ్చాడు."

మహీంద్రా ట్రాక్‌స్టార్ ట్రాక్టర్లు

రైతుల అవసరాలకు అనుగుణంగా నూతన సాంకేతికతతో కొత్త ట్రాక్టర్లను మరియు వ్యవసాయ పరికరాలను ప్రవేశపెట్టడం మీద గ్రోమ్యాక్స్ దృష్టిసారిస్తోంది. ధరకు తగ్గ విలువలతో విశ్వాసనీయమైన పనితీరు కలిగి ఉండేలా కొత్త ఉత్పత్తులను గ్రోమ్యాక్స్ అభివృద్ది చేస్తోంది.

మహీంద్రా ట్రాక్‌స్టార్ ట్రాక్టర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయ ట్రాక్టర్లు మరియు ఇతర వ్యవసాయ పరికరాల తయారీలో మహీంద్రా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. డబ్బుకు తగ్గ విలువలతో నూతన శ్రేణి ట్రాక్టర్లను తయారు చేయడంలో మహీంద్రా కీలంగా ఉంది. ఇప్పుడు మూడవ ట్రాక్టర్ బ్రాండ్ ట్రాక్‌స్టార్‌ను ప్రవేశపెట్టింది. ఈ పేరుతో అనేక కొత్త ట్రాక్టర్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది.

English summary
Read In Telugu: Mahindra To Launch Third Tractor Brand, Trackstar
Story first published: Tuesday, August 29, 2017, 17:16 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark