స్కార్పియోలోని ఆ వేరియంట్‌కు వీడ్కోలు పలికిన మహీంద్రా

Written By:

మహీంద్రా ఇండియా ప్రొడక్ట్ వెబ్‌సైట్ లోని ఉత్పత్తుల జాబితా నుండి స్కార్పియోలోని ఆటోమేటిక్ వేరియంట్‌ను తొలగించింది. మహీంద్రా ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉండగా వాటిలో ఆటోమేటిక్‌ వేరియంట్‌ను తొలగించింది.

మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్ తొలగింపు

ఆటోమేటిక్‌ వేరియంట్ స్కార్పియోలను విపణి నుండి తొలగించి మ్యాన్యువల్ వేరియంట్ స్కార్పియోలను యథావిధిగా కొనసాగిస్తామని మహీంద్రా స్కార్పియో అనే పేరున్న ట్విట్టర్ అకౌంట్‌తో ఓ ట్వీట్ వెలువడింది.

మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్ తొలగింపు

మహీంద్రా స్కార్పియో ప్రొడక్ట్ రేంజ్‌లోని ఎస్10 వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యమయ్యేది అయితే మిగిలిన వేరియంట్లు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌‌లో లభిస్తున్నాయి. ఎస్4 ప్లస్ మరియు ఎస్10 వేరియంట్లు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్ తొలగింపు

షడన్‌గా తీసుకున్న ఈ స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్ విపణి నుండి తొలగింపు నిర్ణయం వెనుక ఓ కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను మహీంద్రా అభివృద్ది చేస్తున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా.

మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్ తొలగింపు

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు నూతనంగా రానున్న స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ కోసం సరికొత్త ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను మహీంద్రా డెవలప్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే ప్రస్తుతం ఉన్న అన్ని ఆటోమేటిక్ వేరియంట్లలో నూతన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ గల గేర్‌బాక్స్ రావడం ఖాయం.

మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్ తొలగింపు

రిపోర్ట్స్ నుండి అందుతున్న సమాచారం మేరకు, మహీంద్రా ఫేస్‌లిఫ్ట్ స్కార్పియోను అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. అంతర్గతంగా ఈ ఫేస్‌లిఫ్ట్‌కు జడ్101 అనే కోడ్ పేరును కూడా ఖరారు చేసింది.

మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్ తొలగింపు

అధిక పవర్ మరియు టార్క్ ఉత్పత్తి లక్ష్యంగా శక్తివంతమైన ఎస్‌యూవీ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఫేస్‌లిఫ్ట్ స్కార్పియోలో 2.2-లీటర్ సామర్థ్యం ఉన్న ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్‌ రానుంది.

మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్ తొలగింపు

ప్రస్తుతం విపణిలో మహీంద్రా స్కార్పియో మూడు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అవి, 2.0, 2.2, మరియు 2.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌లు. అన్ని ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్ తొలగింపు

పనితీరు విషయానికి వస్తే, స్కార్పియోలోని 2.0-లీటర్ మరియు 2.2-లీటర్ డీజల్ వేరియంట్లు 120బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. అదే విధంగా 2.5-లీటర్ ఇంజన్ వేరియంట్ గరిష్టంగా 75బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్ తొలగింపు
  • స్కార్పియో 2.0-లీటర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.8 లక్షలు
  • స్కార్పియో 2.2-లీటర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 10.45 లక్షలు
  • స్కార్పియో 2.5-లీటర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.71 లక్షలు
*ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) సగటు ధరలుగా ఇవ్వబడ్డాయి. స్కార్పియోలోని అన్ని వేరియంట్ల ధరలను మీకు నచ్చిన నగరంలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
English summary
Read In Telugu To Know About Mahindra Scorpio Automatic Variants Discontinued
Story first published: Tuesday, June 6, 2017, 13:22 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark