నవంబరు 14 న వస్తున్నఆల్ న్యూ మహీంద్రా స్కార్పియో

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా తమ మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియోను ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. నవంబరు 14, 2017 న స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదల కానుంది.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ స్కార్పియోతో పోల్చుకుంటే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అప్‌డేటెడ్ స్కార్పియో ఎస్‌యూవీని మహీంద్రా ప్రతినిధులు ఇప్పటికే పలుమార్లు భారత రోడ్ల మీద రహస్యంగా పరీక్షించారు.

Recommended Video - Watch Now!
[Telugu] Mahindra KUV100 NXT Launched In India - DriveSpark
మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ ఎక్ట్సీరియర్‌లో స్వల్ప మార్పులే జరిగాయి, అందులో అధికంగా ఫ్రంట్ డిజైన్‌లో ప్రధాన మార్పులు జరిగాయి. సరికొత్త 7-స్లాట్ ఫ్రంట్ గ్రిల్, ఇంజన్ వైపు ఎక్కువ గాలి ప్రవాహం ఎక్కువగా ఉండేందుకు విశాలమైన ఎయిర్ డ్యామ్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ల మీదున్న ఇండికేటర్లు కొత్తగా అనిపిస్తాయి.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

ముందు డిజైన్ మినహాయిస్తే, ఫేస్‌లిఫ్ట్ స్కార్పియో చూడటానికి అచ్చం పాత వెర్షన్‌నే పోలి ఉంటుంది. అయితే, స్కార్పియో ప్రక్కవైపుల అధునాతన ప్లాస్టిక్ క్లాడింగ్, రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ వచ్చాయి.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ రియర్ డిజైన్‌లో సరికొత్త స్పోర్టివ్ ఫ్లాట్ డోర్ డిజైన్ గుర్తించవచ్చు. టెయిల్ ల్యాంప్ క్లస్టర్ డిజైన్ దాదాపు మారిపోయింది. ఎస్‌యూవీ మొత్తం అక్కడక్క మార్పులు సంతరించుకున్నప్పటికీ, పాత మరియు కొత్త మోడల్‌కు మధ్య తేడా కనబరిచే మార్పులు గుర్తించడం కాస్త అసాధ్యమే.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్‌లో వస్తున్న అతి ప్రధాన మార్పు ఇంజన్ అప్‌డేట్. సాంకేతికంగా ఇందులో 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ రానుంది. ఇది గరిష్టంగా 138బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. మునుపటి వెర్షన్ 120బిహెచ్‌పి పవర్ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, సరికొత్త స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌లతో రానుంది. ఇందులో రానున్న సరికొత్త ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జపాన్ సంస్థ నుండి సేకరిస్తోంది. మునుపటి ఏఎమ్‌టి వెర్షన్‌తో పోల్చితే ఇది అత్యంత సమర్థవంతమైనది మరియు వేగంగా స్పందిస్తుంది.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

మహీంద్రా మునుపటి స్కార్పియోలో అందించిన మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని ఇందులో తీసుకురాలేదు. భారత్‌లో హైబ్రిడ్ వాహనాల మీద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికంగా ఉండటమే ఇందుకు కారణం.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

అధిక మైలేజ్ కోసం మహీంద్రా అండ్ మహీంద్రా 2016లో తమ మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియోలో ఇంటెల్లీ హైబ్రిడ్ అనే పరిజ్ఞానాన్ని అందించింది.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్స్‌కు తొలుత ఎస్‌యూవీని పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. పాశ్చాత సంస్థల తాకిడికి మహీంద్రా తయారు చేసే ఎస్‌యూవీలకు ఆదరణ కొద్దికొద్దిగా తగ్గిపోయింది. అయితే, మహీంద్రా తలరాతను మార్చేసిన స్కార్పియో ఇప్పుడు భారీ మార్పులతో ఫేస్‌లిప్ట్ రూపంలో ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్‌ను చేరనుంది.

English summary
Read In Telugu: Mahindra Scorpio Facelift India Launch Date Revealed
Story first published: Friday, November 10, 2017, 12:14 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark