2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర రూ. 9.97 లక్షలు

By N Kumar

మహీంద్రా అండ్ మహీంద్రా 2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్‌ను విపణిలోకి విడుదల చేసింది. ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో మార్పులు చేర్పులతో మోస్ట్ పాపులర్ స్కార్పియో ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త 2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 9.97 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్‌ వేరియంట్లు, ధరలు, ఇంజన్, ఫీచర్లు మరియు పూర్తి వివరాలు నేటి కథనంలో...

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

మహీంద్రా తమ స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ ఎన్నో కీలక మార్పులు చేసింది. ఇంటీరియర్, ఎక్ట్సీరియర్, ఫీచర్లు మరియు శక్తివంతమైన ఇంజన్ అప్‌గ్రేడ్‌తో పాటు అదనంగా వేరియంట్ల పేర్లను పూర్తిగా మార్చేసింది.

స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ ఎస్3, ఎస్5, ఎస్7 మరియు ఎస్11 వేరియంట్లలో లభిస్తోంది.

Recommended Video - Watch Now!
[Telugu] Mahindra KUV100 NXT Launched In India - DriveSpark
2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

2017 స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ ధరలు

స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ ధరలు
S3 2WD Rs 9.97 Lakh
S5 2WD Rs 11.62 Lakh
S7 120bhp 2WD Rs 12.69 Lakh
S7 140bhp 2WD Rs 12.99 Lakh
S11 2WD Rs 14.79 Lakh
S11 4WD Rs 16.01 Lakh
2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ డిజైన్

డిజైన్ పరంగా, స్కార్పియో ఫేస్‌లిఫ్ట్‌లో ఆశించిన మార్పులేమీ చోటు చేసుకోలేదు. అయితే, మునుపటి వెర్షన్ స్కార్పియోతో పోల్చుకుంటే వ్యత్యాసం కనబడేందుకు ముందు మరియు రియర్ డిజైన్‌లో స్వల్ప అప్‌డేట్స్ జరిగాయి. మహీంద్రా ఇంపీరియో ఉన్నట్లు పెద్ద పరిమాణంలో ఉన్న 7-స్లాట్ ఫ్రంట్ గ్రిల్ ఇందులో వచ్చింది.

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

రీడిజైన్ చేయబడిన బంపర్‌తో పాటు హెడ్ ల్యాంప్ క్లస్టర్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ప్రీమియమ్ ఫీల్ కలిగించే ఫాగ్ లైట్లను బంపర్‌లో ఒదిగిపోయేలా అమర్చారు. మరియు ఇంజన్‌కు అత్యంత గాలి ప్రసరణ ఉండేందుకు విశాలమైన ఎయిర్ ఇంటేకర్ అందివ్వడం జరిగింది.

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

ముందు మరియు రియర్ బంపర్లకు సరికొత్త ఫాక్స్ స్కిడ్ ప్లేట్లను జోడించింది. సరికొత్త స్కార్పియో ఐదు విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అవి, న్యూ ప్రీమియమ్ పర్ల్ వైట్(ఎస్11), డైమండ్ వైట్(ఎస్11లో మినహాయింపు), నెపోలి బ్లాక్, డి శాట్ సిల్వర్ మరియు మోల్టన్ రెడ్.

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

సైడ్ మరియు రియర్ డిజైన్‌లో కూడా పెద్దగా మార్పులేమీ జరగలేదు. అయితే, సరికొత్త అల్లాయ్ వీల్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు, రీడిజైన్ చేయబడిన టెయిల్ గేట్, రియర్ బంపర్ మరియు ఫేస్‌లిఫ్ట్‌లో భాగంగా వచ్చిన పూర్తి స్థాయి రూఫ్ రెయిల్స్ ఇందులో ఉన్నాయి.

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్

సరికొత్త స్కార్పియో ఫేస్‌లిఫ్ట్‌లో గుర్తించదగిన మార్పులు జరగలేదు. అయితే, సీట్ల డిజైన్‌ను పూర్తిగా మార్చేయడం జరగింది. హ్యాడ్ రెస్ట్ మరియు మూడవ వరుస సీటింగ్ వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు.

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

ఫీచర్లు

ఇంటీరియర్‌లో మ్యాచింగ్ ఫాక్స్ లెథర్ అప్‌హోల్‌స్ట్రే, రివైజ్ చేయబడిన డ్యాష్ బోర్డ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. డ్యాష్ బోర్డ్ మధ్యలో జిపిఎస్ న్యావిగేషన్ సపోర్ట్ గల 6-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

మహీంద్రా ఇందులో డైనమిక్ అసిస్ట్ గల రియర్ పార్కింగ్ కెమెరా, సింగల్ టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్, ఆటోమేటిక్‌గా అద్దాలు పైకి రోల్ అవ్వడం, పది విభిన్న భాషల్లో జిపిఎస్ న్యావిగేషన్ మరియు ఇతర ఫీచర్లను అందించింది.

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్‌లో సాంకేతికంగా అదే 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ కలదు. అయితే, ఇది 120బిహెచ్‌పి మరియు 140బిహెచ్‌పి రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేస్తుంది.

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

120బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్ గరిష్టంగా 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరియు అత్యంత శక్తివంతమైన ఇంజన్ వెర్షన్ 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్‌లోని బేస్ వేరియంట్ ఎస్3 75బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే అదే పాత ఎమ్2డిఐసిఐఆర్ డీజల్ ఇంజన్ కలిగి ఉంది.

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

120బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్ గల ఎస్3, ఎస్5 మరియు ఎస్7 వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు అదే విధంగా ఎస్11 మరియు 140బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే ఎస్7 వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యుల్ గేర్‌బాక్స్‌తో లభించును.

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

తాజాగ విడుదల చేసిన స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో శబ్దం, కుదుపులు మరియు కఠినత్వ (నాయిస్, వైబ్రేషన్స్ & హార్ష్‌నెస్) స్థాయి చాలా వరకు తక్కువ అని మహీంద్రా తెలిపింది. వీటిలో ఆరవ తరానికి చెందిన బార్గ్ వార్నర్ టుర్బో ఛార్జర్ మరియు 9.1 బాష్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించింది.

2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే 2017 మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ అత్యంత శక్తివంతమైది. మహీంద్రా మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియో ఇప్పుడు విపణిలో ఉన్న టాటా సఫారీ స్టార్మ్, రెనో డస్టర్, రెనో క్యాప్చర్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2017 Mahindra Scorpio Facelift Launched In India; Prices Start At Rs 9.97 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X