ఎలక్ట్రిక్ వెర్షన్‌లో మహీంద్రా స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా మాత్రమే ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు, తమ వద్ద ఉన్న పాపులర్ ఎస్‌యూవీలను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టడానికి మహీంద్రా సిద్దమవుతోంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్

తాజాగ అందిన నివేదకల ప్రకారం, మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ డివిజన్, స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500 వాహనాలను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అభివృద్ది చేసి విడుదల చేయనున్నట్లు తెలిసింది.

మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా తమ ఎలక్ట్రిక్ వెహికల్ డివిజన్ మీద సుమారుగా 300 నుండి 400 కోట్ల రుపాయలను పెట్టుబడిగా పెడుతున్నట్లు తెలిసింది. వెహికల్‌లో ఎలక్ట్రిక్ మోటార్ వ్యవస్థ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ సంభందిత పరిజ్ఞానం గల కంపెనీలతో జట్టు కట్టడానికి మహీంద్రా సిద్దంగా ఉంది.

Recommended Video - Watch Now!
2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్

మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం ఇప్పటికే వెరిటో మరియు మిని వ్యాన్‌లను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వేరియంట్లో రానున్న మహీంద్రా ఫ్లాగ్‌షిప్ మోడళ్లు స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500 ల ధరలు రెగ్యులర్ వాహనాల కంటే అధికంగా ఉండనున్నాయి.

మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్

స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500 ఎలక్ట్రిక్ వెర్షన్ వెహికల్స్ విడుదల ఎప్పుడనేది ఖచ్చితంగా చెప్పలేదు. ప్రస్తుతం ఈ రెండు ఎస్‌యూవీలలో 2.2-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు.

మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్

5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న స్కార్పియో 120బిహెచ్‌పి పవర్ అదేవిధంగా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభించే ఎక్స్‌యూవీ500లో 140బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్

ఎలక్ట్రిక్ వెర్షన్‌తో పాటు ఫేస్‌లిఫ్ట్ రూపంలో కూడా మహీంద్రా తమ స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500 లను అభివృద్ది చేస్తోంది. ఈ రెండింటిని 2018లో విపణిలోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వెర్షన్ స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500 ల ధరలు రూ. 12 లక్షల నుండి 15 లక్షల మధ్య ఉండవచ్చు.

మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎస్‌యూవీల సెగ్మెంట్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న మహీంద్రా ఒకప్పుడు బెస్ట్ ఎస్‌యూవీల తయారీ సంస్థగా నిలిచింది. కానీ, విదేశీ సంస్థల వాహనాలతో పోటీపడలేక తన స్థానాన్ని కోల్పోయింది. అయితే ఎలాగైనే మార్కెట్లో తన స్థానాన్ని పధిలపరుచుకునేందుకు అతి ముఖ్యమైన స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500 లను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో సిద్దం చేస్తోంది.

English summary
Read In Telugu: Mahindra Working On Electric Versions Of The Scorpio And XUV500
Story first published: Friday, September 15, 2017, 10:23 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark