మహీంద్రా టియువి300 లో సరికొత్త టి10 వేరియంట్ విడుదల

Written By:

దేశీయ దిగ్గజ ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా విపణిలోకి టియువి300 ఎస్‌యూవీలో టాప్ ఎండ్ వేరియంట్‌గా టి10 వేరియంట్‌ను విడుదల చేసింది. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో పాటు అధునాతన ఫీచర్లతో టియువి300 టి10(mahindra tuv300) వేరియంట్‌ను విడుదల చేసినట్లు మహీంద్రా వెల్లడించింది.

మహీంద్రా టియువి300 టి10

సరికొత్త మహీంద్రా టియువి300 టి10 వేరియంట్లో 7-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జిపిఎస్, యుఎస్‌బి వీడియో మరియు ఇమేజ్ ప్లేబ్యాక్, బ్లూటూత్ మ్యూజిక్ మరియు ఆడియో కాలింగ్, మహీంద్రా బ్లూసెన్స్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, స్టీరింగ్ ఆధారిత ఆడియో కంట్రోల్స్ మరియు రెండు ట్వీటర్లతో పాటు ఎన్నో ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా టియువి300 టి10

మహీంద్రా టియువి300 టి10 వేరియంట్లో సరికొత్త బ్లాక్ క్రోమ్ తొడగులున్న ఫ్రంట్ గ్రిల్‌ మరియు ఫాగ్ ల్యాంప్స్ సరౌండింగ్స్, సరికొత్త మెటాలిక్ గ్రే ఫనిషింగ్ గల అల్లాయ్ వీల్స్, స్పేర్ వీల్ కవర్, రూఫ్ రెయిల్స్‌తో పాటు సెగ్మెంట్లోనే తొలిసారిగా కార్బన్ బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్న హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
మహీంద్రా టియువి300 టి10

టియువి300 టి10 ఇంటీరియర్‌లో సరికొత్త ఫాక్స్ లెథర్ సీట్లు, డ్రైవర్ మరియు కో-డ్రైవర్ కోసం లంబార్ సపోర్ట్, ఎత్తను అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల డ్రైవర్ సీటు, ఎలక్ట్రిక్ పవర్‌తో అడ్జెస్ట్ చేసుకునే అవకాశం ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, మరియు డ్రైవర్ సీట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా టియువి300 టి10

మహీంద్రా టియువి300 టి10 టాప్ ఎండ్ వేరియంట్‌ను ఆరు విభిన్న సింగల్ టోన్ కలర్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు. అవి, వెర్వ్ బ్లూ, డైనమైట్ రెడ్, మాజెస్టిక్ సిల్వర్, మోల్టన్ ఆరేంజ్, గ్లేజర్ వైట్, బోల్డ్ బ్లాక్ మరియు బ్రాంజ్ గ్రీన్ కలర్స్. వీటితో పాటు ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎరుపు/నలుపు లేదా సిల్వర్/బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్‌లో ఎంచుకోవచ్చు.

మహీంద్రా టియువి300 టి10

సాంకేతికంగా మహీంద్రా టియువి300 టి10 వేరియంట్లో 1.5-లీటర్ సామర్థ్యం గల అదే మునుపటి ఎమ్‌హాక్ 100 డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 240ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

మహీంద్రా టియువి300 టి10

టియువి300 టి10 వేరియంట్ విడుదల అయినప్పటికీ ఇంకా దీని ధరలు వెల్లడించలేదు. అయితే, మహీంద్రా లైనప్‌లో ప్రస్తుతం టాప్ ఎండ్ వేరియంట్‌గా ఉన్న టి8 వేరియంట్ కన్నా 50,000 రుపాయలు అదనంగా రూ .9.20 లక్షల అంచనా ధరతో లభించే అవకాశం ఉంది.

మహీంద్రా టియువి300 టి10

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా లైనప్‍‌లో టియువి300 మంచి విక్రయాలు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో మరో కొత్త వేరియంట్ జోడింపుతో విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. టి8 వేరియంట్‌తో పోల్చుకుంటే ఎన్నో అదనపు ఫీచర్లతో రావడంతో టియువి300 శ్రేణిలో టి10 టాప్ ఎండ్ వేరియంట్‌గా నిలిచింది.

English summary
Read In Telugu: New Mahindra TUV300 T10 Variant Features & Specifications Revealed
Story first published: Monday, September 18, 2017, 18:57 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark