టియూవీ500 ఎమ్‌పీవీకి రహస్యంగా పరీక్షలు నిర్వహించిన మహీంద్రా

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా తమ తరువాత మోడల్ టియూవీ500 ఎమ్‌పీవీని ఇండియన్ రోడ్ల మీద నిర్భయంగా పరీక్షించింది. ఎవరూ దీనిని గుర్తించడానికి వీల్లేకుండా నలుపు మరియు తెలుపు రంగుల చారలున్న పేపర్‌ కప్పేసి మరీ పరీక్షించారు.

మహీంద్రా టియూవీ500 ఎమ్‌పీవీ

మహీంద్రా తమ టియూవీ500 వెహికల్‌ను తమిళనాడులోని మెట్టుపాళ్యంలో జితేష్ అనే డ్రైవ్‌స్పార్క్ పాఠకుడు ఫోటోలు తీసి మాతో పంచుకున్నాడు. ఈ ఫోటోల ప్రకారం పెద్ద బాక్స్ ఆకారంలో ఉన్న వీల్ బేస్ పొడగించబడిన టియూవీ300 ను పోలి ఉంటుంది.

మహీంద్రా టియూవీ500 ఎమ్‌పీవీ

ఇది ఏడు లేదా ఎనిమిది కూర్చునే సీటింగ్ సామర్థ్యంతో రానున్నట్లు సమాచారం. అయితే మహీంద్రా ఎక్స్‌యూవీ500 చివరి వరుస కుంచించుకుపోయిన తరహాలో కాకుండా అన్ని వరుసల్లో కూడా సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఈ టియూవీ500లో ముందు నుండి వెనుక వరకు ఒకే విధమైన వెడల్పు కలదు.

మహీంద్రా టియూవీ500 ఎమ్‌పీవీ

నూతన టియూవీ500 కు చెందిన ఇంటీరియర్ ఫోటోలు విడుదల కాలేదు, అయితే ప్రస్తుతం ఉన్న రియర్ ప్రొఫైల్ ప్రకారం ఇది అచ్చం టియూవీ300 రియర్ డిజైన్‌ను పోలి ఉంది. అదనంగా అందించిన టైర్ మినహాయిస్తే ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

మహీంద్రా టియూవీ500 ఎమ్‌పీవీ

తాజా రిపోర్ట్స్ ప్రకారం మహీంద్రా తమ టియూవీ500 ఎమ్‌పీవీలో 2.2-లీటర్ లేదంటే 1.5-లీటర్ సామర్థ్యం డీజల్ ఇంజన్ వినియోగించే అవకాశం ఉంది. అయితే టియూవీ300 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందివ్వడానికి బదులుగా టియూవీ500లో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందివ్వనున్నట్లు సమాచారం.

మహీంద్రా టియూవీ500 ఎమ్‌పీవీ

ఇంత వరకు మహీంద్రా తమ టియూవీ500 విడుదలకు సంభందించి ఎలాంటి అధికారిక సూచనలు చేయలేదు. అయితే ఈ ఏడాది ముగిసేలోపు దీనిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీకీ దీనిని గట్టి పోటీగా సిద్దం చేయనుంది.

English summary
Read In Telugu Mahindra TUV500 Spotted Testing
Story first published: Tuesday, May 16, 2017, 18:24 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark