XUV500 ఫేస్‌లిఫ్ట్‌ను మళ్లీ పరీక్షించిన మహీంద్రా

Written By:

దేశీయ దిగ్గజ ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఎక్స్‌యూవీ500 ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. మార్పులు చేర్పులతో అప్‌డేట్స్‌కు గురైన ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ వాహనాన్ని ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ మీడియా కంటబడింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500

ఎలాంటి డిజైన్ మరియు ఫీచర్లను గుర్తించడానికి వీల్లేకుండా ఎక్ట్సీరియర్ బాడీ మొత్తాన్ని నలుపు మరియు తెలుపు రంగు చారలున్న పేపర్‌తో దట్టంగా కప్పేసి ఎంతో పకడ్బందీగా పరీక్షించింది. దాని తాలుకు ఫోటోలు ఇప్పుడు లీకయ్యాయి.

Recommended Video - Watch Now!
Why Doesn't A Plane's Tyre Burst While Landing - DriveSpark
మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్‌లో కొన్ని ప్రధానమైన మార్పులు తీసుకొస్తోంది. సరికొత్త డిజైన్‌లో ఉన్న హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ రానున్నాయి. నూతన ఫ్రంట్ గ్రిల్ మరియు రీడిజైన్ చేయబడిన బంపర్‌‌లతో పూర్తిగా రీఫ్రెష్డ్ లుక్‌లో రానుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500

రియర్ డిజైన్‌లో పెద్దగా గుర్తించదగిన మార్పులేవీ చోటు చేసుకోలేదు. అయితే, ప్రస్తుతం అమ్ముడవుతున్న మోడల్‌లో ఉన్న స్పాయిలర్‌ కంటే ఇందులో ఉన్నది కాస్త విభిన్నంగా ఉంది. టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500

అంతే కాకుండా, కొత్త డిజైన్ చేయబడిన బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ను అప్‌డేట్‌‍గా పరిచయం చేయనుంది. ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ ఓవరాల్ డిజైన్ చూడటానికి అచ్చం రెగ్యులర్ మోడల్‌నే పోలి ఉంటుంది. అయితే, అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి.

Trending On DriveSpark Telugu:

2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన బెస్ట్ కార్లు

సముద్ర వంతెన మీద అత్యంత సుందరమైన రన్‌వే నిర్మిస్తున్న భారత్

స్విఫ్ట్ శకానికి ముగింపు పలికిన మారుతి సుజుకి

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో కూడా స్వల్ప మార్పులు జరగనున్నాయి. సీటింగ్ లేవుట్, పొజిషన్ మరియు డ్యాష్ బోర్డ్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు జరగడం లేదు. అయితే, ఫీచర్ల పరంగా కొన్ని కీలక అప్‌డేట్స్ ఉంటాయి. ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేయగల సరికొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500

సాంకేతికంగా మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్‌లో 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ టుర్బోఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 168బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్ అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా తమ అతి ముఖ్యమైన, ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500ను ఫేస్‌‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. అంతే కాకుండా, మహీంద్రా శాంగ్‌యాంగ్ కంపెనీకి చెందిన టివోలి ఎస్‌యూవీని కూడా పరిచయం చేయనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Mahindra XUV500 Facelift Spotted Again — Reveals New Features
Story first published: Saturday, December 30, 2017, 11:15 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark