నూతన ఫ్యూయల్ వేరియంట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ500

Written By:

ఇండియన్ మార్కెట్లోకి ఎస్‌యూవీలకు ప్రసిద్ది చెందిన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా. మహీంద్రా బొలెరో మరియు స్కార్పియో తరువాత అత్యంత ప్రజాదరణ తెచ్చుకున్న మోడల్ మహీంద్రా ఎక్స్‌యూవీ500.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్

మహీంద్రా లైనప్‌లో అత్యంత ఖరీదైన వెహికల్ అయినప్పటికీ సేల్స్ విషయంలో ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. దీంతో విభిన్న కస్టమర్లను చేరుకునేందుకు ఎక్స్‌యూవీ500 ను ఇప్పుడు మరో కొత్త ఫ్యూయల్ వేరియంట్లో విడుదలకు సిద్దం చేసింది. దీని గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

Recommended Video - Watch Now!
[Telugu] Mahindra KUV100 NXT Launched In India - DriveSpark
మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్

తాజాగా అందుతున్న సమాచారం మేరకు, మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్

పెట్రోల్ వేరియంట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ500లో సాకేతికంగా 2.2-లీటర్ కెపాసిటి గల ఇంజన్ రానుంది. ఇది 138బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్

మహీంద్రా ఈ పెట్రోల్ ఇంజన్‌ను ఎమ్‌హాక్ 2.2-లీటర్ డీజల్ ఇంజన్ ఆధారంగా రూపొందించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ500లో లభించే 2.2-లీటర్ డీజల్ వేరియంట్ గరిష్టంగా 138బిహెచ్‌పి పవర్ మరియు 330ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పేర్లు డబ్ల్యూ సిరీస్‌తో ఉంటాయి. అయితే, కొత్తగా వస్తున్న ఎక్స్‌యూవీ 500 పెట్రోల్ వేరియంట్ల పేర్లు "జి" సిరీస్‌తో రానున్నాయి. అంటే డబ్ల్యూ అనే వేరియంట్ నేమ్ కేవలం డీజల్ ఇంజన్ ఎక్స్‌యూవీ500 లకు మాత్రమే పరిమితం.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్

సరికొత్త పెట్రోల్ వేరియంట్ పేరు ఎక్స్‌యూవీ500 జి9 గా ఉండనుంది మరియు ఇది కేవలం 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో మాత్రమే లభించనుంది. మ్యాన్యుల్ ట్రాన్స్‌మిషన్ గల పెట్రల్ ఎక్స్‌యూవీ500 ఆలస్యంగా విడుదల కానుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్

సరికొత్త పెట్రోల్ వెర్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. సాధారణ డీజల్ వెర్షన్‌నే పోలి ఉంటుంది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానుంది, అయితే లెథర్ సీట్లు మరియు అల్లాయ్ వీల్స్ మిస్సవుతున్నాయి. కేవలం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మాత్రమే రానున్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్

డిజైన్ పరంగా చూస్తే, పెట్రోల్ వేరియంట్ ఎక్స్‌యూవీ500 అచ్చం డీజల్ వెర్షన్‌నే పోలి ఉంటుంది. ఎక్ట్సీరియర్ బాడీ డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోయినా.... డీజల్ మరియు పెట్రోల్ మోడళ్ల మధ్య తేడా కనబరచేందుకు మరిన్ని నూతన కలర్ స్కీమ్స్ పరిచయం చేసే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా ఎక్స్‌యూవీ500 వెహికల్ కలిగి ఉండటాన్ని చాలా ఇండియన్స్ గర్వంగా ఫీలవుతారు. అయితే, ఎక్స్‌యూవీలో నచ్చే అంశాల ప్రాతిపదికగానే ఎంచుకుంటున్నారు. అయితే, అన్ని రకాల కస్టమర్లను చేరుకునేందుకు విభిన్న వేరియంట్లతో పాటు సరికొత్త ఫ్యూయల్ ఆప్షన్లలో ఎక్స్‌యూవీ500ను లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్ వేరియంట్ విపణిలో ఉన్న జీప్ కంపాస్ పెట్రోల్ మోడల్‌తో గట్టి పోటీని ఎదుర్కోనుంది. మహీంద్రా లోని మరిన్ని ఎస్‌యూవీల గురించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి....

English summary
Read In Telugu: Mahindra To Launch XUV500 Petrol In India
Story first published: Tuesday, November 7, 2017, 13:08 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark