భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా మళ్లీ మారుతి ఆల్టో

Written By:

ఇండియాలో కార్లను అత్యధికంగా విక్రయిస్తున్న సంస్థ మారుతి సుజుకి, మరి మారుతిలో ఎక్కువగా అమ్ముడుపోతున్న కారు ఏదో తెలుసా ? మనం ఎప్పుడూ ఊహించినట్లే ఆల్టో తొలి స్థానంలో నిలిచింది. ఒక్కో సారి స్విఫ్ట్ ఆల్టో సేల్స్‌ తినేస్తూ వచ్చేది, అయితే ఈ సారి నమోదైన భారీ విక్రయాలు స్విఫ్ట్‌ను రెండవ స్థానానికి పరిమితం చేసింది.

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ కారు మారుతి ఆల్టో

గడిచిన మే 2017లో దేశవ్యాప్తంగా 23,618 యూనిట్ల ఆల్టో కార్లు అమ్ముడుపోయాయి. ఇదే నెలలో 16,532 యూనిట్ల స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడుపోయాయి. అయితే, దీనికి ముందు ఏప్రిల్ 2017లో మారుతి 23,802 యూనిట్ల స్విఫ్ట్ కార్లను విక్రయించింది.

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ కారు మారుతి ఆల్టో

ఏప్రిల్ నెలలో సాధించిన ఫలితాలను మే నెలలో ఆర్జించడంలో స్విఫ్ట్ విఫలమైంది. కానీ కొన్ని సంవత్సరాల పాటు మొదటి స్థానంలో నిలుస్తూ వచ్చిన ఆల్టో మే 2017 విక్రయాలతో తన స్థానాన్ని యథావిధిగా భర్తీ చేసింది.

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ కారు మారుతి ఆల్టో

స్విఫ్ట్ విక్రయాలు తగ్గుముఖం పట్టడానికి మరో ప్రధాన కారణం మారుతి బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్. మే 2017లో 14,629 యూనిట్లు అమ్ముడుపోయాయి. అందులో 85 శాతం పెట్రోల్ కార్లే కావడం గమనార్హం. బాలెనో స్విఫ్ట్ సేల్స్ తినేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ కారు మారుతి ఆల్టో

మారుతి వద్ద ఉన్న మరో గేమ్‌ చేంజర్, డిజైర్ కాంపాక్ట్ సెడాన్, గత నెల విక్రయాల్లో 9,413 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి తాజాగ తమ 2017 న్యూ డిజైర్ చేసింది. ఈ మోడల్ మీద బుకింగ్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి వచ్చే నెలలో మారుతి లైనప్‌లో మూడవ గరిష్ట విక్రయాలు చేపట్టే మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది.

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ కారు మారుతి ఆల్టో

దేశవ్యాప్తంగా గడిచిన మే 2017 ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో మొదటి స్థానంలో నిలిచిన ఆల్టో 800 మరియు కె10 లలో అందుబాటులో ఉంది. ఆల్టో800 మోడల్‌లోని 799సీసీ ఇంజన్ 47.33బిహెచ్‌పి పవర్ మరియు 69ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ కారు మారుతి ఆల్టో

ఆల్టో కె10 లోని 998సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. ఆల్టో 800 5-స్పీడ్ మ్యాన్యువల్ అదే విధంగా కె10 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఎంచుకోవచ్చు.

English summary
Read In Telugu Maruti Suzuki Alto Regains Its Top Position In The Market

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark