అతి వేగంగా లక్ష యూనిట్ల సేల్స్ మైలు రాయిని అందుకొన్న డిజైర్

కనీవిని ఎరుగని సేల్స్‌తో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచిన డిజైర్ ఇప్పుడు 1 లక్ష యూనిట్ల సేల్స్‌ను అతి త్వరగా అందుకున్న మోడల్‌గా డిజైర్ మోరో రికార్డ్ సృష్టించింది.

By Anil

భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో సంచలనంగా మారిన వార్త ఏదైనా ఉందంటే, "అది మారుతి సుజుకి డిజైర్". నిజమే, విడుదలైనప్పటి నుండి భారీ విక్రయాలతో ప్రతి నెలా ఓ కొత్త రికార్డును నెలకొల్పుతోంది.

మారుతి డిజైర్ సేల్స్

ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో కనీవిని ఎరుగని సేల్స్‌తో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచిన డిజైర్ ఇప్పుడు 1 లక్ష యూనిట్ల సేల్స్‌ను అతి త్వరగా అందుకున్న మోడల్‌గా డిజైర్ మోరో రికార్డ్ సృష్టించింది.

మారుతి డిజైర్ సేల్స్

విడుదలైన కేవలం ఐదు నెలల వ్యవధిలోనే లక్ష యూనిట్ల కొత్త తరం డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి. అంతే కాకుండా, మొదటిసారి కారును కొనే కస్టమర్లు కూడా డిజైర్‌నే ఎంచుకోవడం గమనార్హం.

Recommended Video

Mahindra KUV100 NXT Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మారుతి డిజైర్ సేల్స్

మారుతి డిజైర్ ఉత్పత్తి సామర్థ్యం దీని మీద వస్తున్న డిమాండ్ కంటే తక్కువగా ఉండటంతో వెయిటింగ్ పీరియడ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు బుక్ చేసుకునే వారికి సుమారుగా ఐదు నెలల తర్వాతే డెలివరీ లభికంచనుంది. డిజైర్ మీద ఈ తరహా డిమాండ్ లభించడానికి గల కారణాలేంటో చూద్దాం రండి..

మారుతి డిజైర్ సేల్స్

సరికొత్త మారుతి డిజైర్‌ను 2008లో తొలిసారి విడుదలైన స్విఫ్ట్ డిజైర్‌తో పోల్చుంకుంటే డిజైన్ పరంగా చాలా మార్పులు జరిగాయి. మారుతి సుజుకి హార్టెక్ డిజైన్ ఫిలాసఫీ ఆదారంగా నిర్మించింది మునుపటి డిజైర్‌ కన్నా ఎంతో ఆకర్షణీయమైన మరియు సొగసైన రూపాన్ని సొంతం చేసుకుంది.

మారుతి డిజైర్ సేల్స్

పూర్తి స్థాయిలో కొత్త ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించడంతో మారుతి డిజైర్ బరువు 105కిలోల వరకు తగ్గింది. అదే సందర్భంలో అత్యుత్తమ ధృడత్వాన్ని కలిగి ఉంది. చిన్న మరియు పెద్ద ఫ్యామిలీలు, వ్యక్తిగత అవసరాలతో పాటు వాణిజ్యపరమైన అవసరాలకు కూడా డిజైర్‌ను అధికంగా ఎంచుకుంటున్నారు.

మారుతి డిజైర్ సేల్స్

మునుపటి తరానికి చెందిన డిజైర్ ఇంటీరియర్‌తో పోల్చుకుంటే, ప్రీమియమ్ ఫీల్ కల్పించే ఇంటీరియర్ డిజైన్, ఫీచర్లు మరియు నూతనత్వాన్ని కలిగి ఉంది. డిజైర్‌లో ఎంతో కాలంగా లేనటువంటి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెట్ సిస్టమ్ న్యూ డిజైర్ ద్వారా పరిచయమయ్యింది. ఇది, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మరియు మిర్రర్ లింక్ ఇంకా ఎన్నో కనెక్టివిటి ఫీచర్లను కలిగి ఉంది.

Trending on DriveSpark Telugu:

బ్రేక్ ప్యాడ్స్ ఖచ్చితంగా మార్చాలని తెలిపే ఐదు కారణాలు

రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్లు జర హుషార్: ఈ తప్పు చేస్తే మీ బైకుకూ ఇదే గతి...!!

బస్సు లారీ మధ్య నలిగిపోయిన కారులో అందరూ సేఫ్: ఇంతకీ అది ఏ కారో తెలుసా...?

మారుతి డిజైర్ సేల్స్

మరో ప్రధానమైన మార్పు, ఇండియన్ ప్యాసింజర్ సెగ్మెంట్లో ఎన్నో కార్లు ఆటోమేటిక్(ఏఎమ్‌టి) ట్రాన్స్‌మిషన్‌తో విడుదలవుతున్నప్పటికీ డిజైర్‌లో మాత్రమే ఏఎమ్‌టి గేర్‌‍బాక్స్ లభించేది కాదు. అయితే, ఎట్టకేలకు నూతన డిజైర్ లోని పెట్రోల్ వేరియంట్లో ఏఎమ్‌టి పరిచయం చేసింది.

మారుతి డిజైర్ సేల్స్

భద్రత పరంగా మారుతి సుజుకి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి ఫీచర్లను డిజైర్‌లోని అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందించింది.

మారుతి డిజైర్ సేల్స్

మారుతి డిజైర్ సెడాన్‌లో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అందించింది. డిజైర్‌లో గల 1.2-లీటర్ సామర్థ్యం గల కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మారుతి డిజైర్ సేల్స్

అదే విధంగా డిజైర్‌లోని 1.3-లీటర్ కెపాసిటి ఉన్న డీజల్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో లభిస్తాయి.

మారుతి డిజైర్ సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రతి ఇండియన్ కస్టమర్‌ను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి డిజైర్ అతి ముఖ్యమైన మరియు ప్రాథమిక ఫీచర్లను అందించింది. విశాలమైన క్యాబిన్ స్పేస్, లగ్జరీ ఫీల్ కలిగించే ఇంటీరియర్, ప్రీమియమ్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, ఎన్నో భద్రత ఫీచర్లతో పాటు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ నూతన డిజైర్ సొంతం.

ఈ అంశాల కారణంగా డిజైర్‌ మీద విపరీతమైన స్పందన లభిస్తోంది. అందుకు తగిన ప్రొడక్షన్ లేకపోవడంతో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారు మీద వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగింది.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Dzire Commands Waiting Period Of 3 Months — Here's Why You Should Wait
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X