రెట్టింపు వృద్దితో దుమ్ములేపిన మారుతి ఎస్-క్రాస్

Written By:

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఇటీవల ఎస్-క్రాస్ క్రాసోవర్ ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల చేసింది. అక్టోబర్ 1, 2017 నెలలో విడుదలైన ఎస్-క్రాస్ అదే నెలలో అత్యుత్తమ విక్రయాలు నమోదు చేసుకుంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్

మారుతి సుజుకి గత ఏడాది ఇదే నెలలో 2,113 ఎస్-క్రాస్ లను విక్రయించగా, ఈ ఏడాది అక్టోబర్ నెలలో 5,510 యూనిట్ల ఎస్-క్రాస్ ఎస్‌యూవీలను విక్రయించింది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్

2016 తో పోల్చుకుంటే మారుతి సుజుకి ఎస్-క్రాస్ వృద్ది 100 శాతానికి పైగా పెరిగింది. దీనికి ప్రధాన పోటీగా ఉన్నహోండా బిఆర్-వి(1,280) మరియు రెనో డస్టర్(919)ల కంటే అధికంగా విక్రయించింది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్

మారుతి నెక్సా షోరూమ్ లలో మాత్రమే విక్రయిస్తున్న వాటిలో ప్రస్తుతం ఇగ్నిస్, సియాజ్ మరియు ఎస్-క్రాస్ ఉన్నాయి. ఎస్-క్రాస్ సేల్స్ ఇగ్నిస్(3,072) మరియు సియాజ్(4,170)ల కంటే అధికంగా అమ్ముడయ్యి, నెక్సా షోరూమ్ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్

మారుతి సుజుకి తొలిసారి ఎస్-క్రాస్‍‌ను విడుదల చేసినపుడు ఆశించిన మేర సేల్స్ నమోదయ్యేవి కాదు. అయితే, అక్టోబర్ 1, 2017లో భారీ మార్పులు చేర్పులతో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఎస్-క్రాస్ సేల్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

మారుతి సుజుకి ఎస్-క్రాస్

మారుతి సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్ ఎస్‍‌యూవీ కేవలం డీజల్ ఇంజన్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తోంది. ఎస్-క్రాస్‌లోని శక్తివంతమైన 1248సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎస్-క్రాస్ కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే లభిస్తోంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్

భద్రత పరంగా ఎస్-క్రాస్ ఫేస్‍‌లిఫ్ట్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు చిన్న పిల్లల సీట్లను బిగించడానికి ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు వంటి ఫీచర్లను అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందించింది.

English summary
Read In Telugu: Maruti S-Cross clocks 5,510 units in October
Story first published: Saturday, November 11, 2017, 18:13 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark