మారుతి సెలెరియో లోని డీజల్ వేరియంట్ ఇక మీదట కొనలేరు

Written By:

భారత దేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఇప్పుడు నాణ్యతకు సంభందించి ఎలాంటి విమర్శలను ఎదుర్కోవడానికి సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. ఎవరో ఒకరు వేలెత్తి చూపడానికి ముందే. నాణ్యత పరంగా తమ ఉత్పత్తులను ప్రక్షాళన చేస్తోంది. అందులో భాగంగానే సెలెరియో డీజల్ వేరియంట్‌ను విపణి నుండి తొలగించింది.

అయితే దీనిని లైనప్‌ నుండి తొలగించినట్లు ఇంకా ఎలాంటి ప్రకటన మారుతి విడుదల చేయలేదు. కాకపోతే మారుతి అధికారిక వెబ్‌సైట్లో సెలెరియో లోని పెట్రోల్ మరియు సిఎన్‌జి వేరియంట్ల ధరలను మాత్రమే ఉంచి, డీజల్ వేరియంట్‌ను తొలగించింది.

ఇండియాలో అత్యంత సరసమైన ధరతో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో పరిచయమైన మొట్టమొదటి ఉత్పత్తి ఇదే. తొలినాళ్లలో పెట్రోల్ మరియు సిఎన్‌జి తో విడుదలయ్యి, తరువాత డీజల్ వేరియంట్లో కూడా అందుబాటులోకి వచ్చింది.

మారుతి సుజుకి తమ సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ను మొదటి సారిగా 2014 లో పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంధన వేరియంట్లో పరిచం చేసింది. అయితే అమ్మకాల్లో సెలెరియో మంచి ఫలితాలను సాధించేసరికి 2015 లో డీజల్ వేరియంట్‌ను విడుదల చేసింది.

భారత దేశంలో మొదటిసారిగా డీజల్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసిన ఏకైక సంస్థగా నిలిచింది. తరువాత అనేక కార్ల తయారీ సంస్థ తమ డీజల్ వాహన శ్రేణిలో ఏఎమ్‌టి అనుసంధనం మొదలుపెట్టాయి.

మారుతి సెలెరియోలో 793సీసీ సామర్థ్యం గల రెండు సిలిండర్ల డీజల్ ఇంజన్‌ను అందించింది, ఇది గరిష్టంగా 47బిహెచ్‌పి పవర్ మరియు 125ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కూడా ఉండేది.

ఎంట్రీ లెవల్ డీజల్ ఇంజన్ లో శబ్దం, వైబ్రేషన్ మరియు హరాష్‌నెస్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి. మరియు 793సీసీ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ 47 బిహెచ్‌పి, ఇదే ధరకు లభించే ఇతర కార్లు ఎక్కువ పవర్ ఉత్పత్తి చేయడం దీనికి గండంగా మారింది.

ఎలాగైనా సెలెరియో డీజల్ వేరియంట్ అమ్మకాలను పెంచుకునేందుకు డీలర్లు సుమారుగా రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్లు అందించాయి. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో అమ్మకాలు సాధ్యం కాలేదు.

ప్రారంభ కొనుగోళ్లు మాత్రమే కాదు, వీటికి రీసేల్ వ్యాల్యూ కూడా ఉండదు అనే భయం కస్టమర్లకు పట్టుకుంది. విడిపరికరాల భారం, సర్వీస్ వ్యయం వంటివి ఎక్కువ అనే కారణాలు కూడా వీటి అమ్మకాలకు శాపంగా మారాయి. ఏదేమయినప్పటికీ ఇప్పటి వరకు రోడ్ల మీదున్న సెలెరియో డీజల్ వాహనాలకు మారుతి ఎల్లప్పూడూ సపోర్ట్‌గా వ్యవహరించనుంది.

హ్యాచ్‌బ్యాక్ కారును కోనే ఆలోచనలో ఉన్నారా...? మారుతి సుజుకి అంతర్జాతీయ శైలిలో క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫీచర్లు మరియు ఎంపిక చేసుకోదగ్గ ఆప్షన్‌లతో పరిచయం చేసిన ఇగ్నిస్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీని వీక్షించగలరు.

 

English summary
Rumor! Maruti Suzuki Celerio Diesel Variant Discontinued
Story first published: Friday, February 3, 2017, 11:58 [IST]
Please Wait while comments are loading...

Latest Photos