అమ్మకాల్లో దుమ్ములేపుతున్న ఇగ్నిస్: మొదటి నెల విక్రయాలు

Written By:

మారుతి సుజుకి 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన వేదిక మీద తమ ఇగ్నిస్ క్రాసోవర్‌ను ప్రదర్శించిన సందర్భంలోనే సందర్శకుల నుండి దీనికి ఎలాంటి స్పందన లభించిందనే విషయం అంచనా వేసింది. అంచనాని నిజం చేసేందుకు ఈ ఏడాది ప్రారంభంలో ఇగ్నిస్ క్రాసోవర్‌ను అమ్మకాలకు సిద్దంగా మార్కెట్లోకి విడుదల చేసింది.

మారుతి ఊహించని రీతిలో విక్రయాలు నమోదయ్యాయి. కేవలం మూడు వారాల్లోనే 4,800 యూనిట్ల ఇగ్నిస్ క్రాసోవర్లు అమ్ముడుపోయాయి. పాత మరియు కొత్త డిజైన్ మెళుకువలతో అందుబాటులోకి వచ్చిన ఇగ్నిస్ ఇప్పటికీ భారీ విక్రయాల దిశగా దూసుకుపోతోంది.

దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో సాధారణ విక్రయ కేంద్రాలు ఉన్నప్పటికీ, మారుతి తమ ప్రీమియమ్ నెక్సా విక్రయ కేంద్ర నుండి మాత్రమే ఈ ఇగ్నిస్‌ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న చాలా వరకు నగరాలలో నెక్సా ఇంకా తెరచుకోలేదు.

స్టాండర్డ్‌గా మారుతి ఈ ఇగ్నిస్ క్రాసోవర్‌లో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, ప్రి టెన్షనర్లు గల సీట్ బెల్ట్‌లు, ఐఎస్ఒఫిక్స్ గల చైల్డ్ సీట్ వంటి భద్రత ఫీచర్లను అందించింది.

ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని మారుతి మొదటి సారిగా తమ ఇగ్నిస్ క్రాసోవర్ మీద అందించింది. తొలి వారంలోనే ఏకంగా 11,000 యూనిట్లు బుక్ అయ్యాయి. 1980 నుండి 1990 ల మధ్య కాలంలో జన్మించిన వారిని లక్ష్యం చేసుకుని దీనిని అభివృద్ది చేసినట్లు మారుతి తెలిపింది.

ఇగ్నిస్ క్రాసోవర్ ఇంటీరియర్‌లో అత్యాధునిక మరియు ఆకర్షణీయమైన ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 7-అంగుళాల పరిమాణం ఉన్న తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మిర్రర్ లింక్ అప్లికేషన్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి.

అంతే కాకుండా దీనిని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. మరియు ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ను ఆప్షనల్‌గా అందిస్తోంది.

పోటీదారులను ఎదుర్కునేందుకు కేవలం రూ. 4.59 లక్షల ప్రారంభ ధరతో ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా విడుదల చేసింది. మారుతి సుజుకి ఇగ్నిస్ క్రాసోవర్ మరిన్ని ఫోటోల కోసం క్రింది గ్యాలరీని వీక్షించగలరు.

  

English summary
Maruti Suzuki Ignis Begins With A Bang In Its First Month Of Sale
Please Wait while comments are loading...

Latest Photos