మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్, విడుదల మరియు సాంకేతిక వివరాలు....

Written By:

భారత దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. రిపోర్ట్స్ ప్రకారం, ఎస్-క్రాస్ ప్రీమియమ్ క్రాసోవర్ వచ్చే సెప్టెంబర్ 2017 లో విడుదల కానుంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

తాజాగా అందుతున్న సమాచారం మేరకు, మారుతి సుజుకి దేశవ్యాప్తంగా ఉన్న నెక్సాన్ విక్రయ కేంద్రాలలో తమ ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ మీద సెప్టెంబర్ 1, 2017 నుండి బుకింగ్స్ స్వీకరించనున్నట్లు తెలిసింది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

ఎస్-క్రాస్ బాడీ డిజైన్ పరంగా మార్పులు జరగలేదు. అయితే, ఫ్రంట్ డిజైన్‌లో సరికొత్త గ్రిల్ పొడవాటి క్రోమ్ పట్టీలను కలిగి ఉంది. రీడిజైన్ చేయబడిన హెడ్ ల్యాంప్ క్లస్టర్‌లో ప్రొజెక్టర్ హెడ్ లైట్లు ఉన్నాయి మరియు రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ గుర్తించవచ్చు.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ రియర్ డిజైన్‌లో కూడా మార్పులు జరిగాయి. టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియ రియర్ బంపర్‌ల డిజైన్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఫేస్‌లిఫ్ట్ ఓవరాల్ డిజైన్ ప్రస్తుతం ఉన్న ఎస్-క్రాస్‌నే పోలి ఉంది. మారుతి ఇందులో అల్లాయ్ వీల్స్ కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, సీట్లు మరియు డ్యాష్ బోర్డ్ ఆకృతిలో ఎలాంటి మార్పులు జరగలేదు. అయితే ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేయగల సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రానుంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

ఇప్పటికే ఉన్న అవే 1.3-లీటర్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ రానుంది. 1.3-లీటర్ డీజల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‍‌మిషన్‌లతో రానున్నాయి. అంతే కాకుండా 1.5-లీటర్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యింది. మరియు ఇండియాలో కూడా పలుమార్లు రహస్య పరీక్షలకు గురయ్యింది. నూతన ఎక్ట్సీరియర్ కలర్ ఆప్షన్‌లతో పాటు పెట్రోల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Maruti Suzuki S-Cross Facelift India Launch Details Revealed
Story first published: Tuesday, August 15, 2017, 9:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark