మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ఫోటోలు....

Written By:

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.29 లక్షలు ఎక్స్-షోరూమ్‌(ఢిల్లీ)గా ఉన్నట్లు మారుతి తెలిపింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ నాలుగు విభిన్న వేరియంట్లలో విడుదలయ్యింది. అవి, సిగ్మా, డెల్టా, జెటా మరియు ఆల్ఫా. సరికొత్త మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ దేశవ్యాప్తంగా ఉన్న కేవలం నెక్సా ప్రీమియమ్ విక్రయ కేంద్రాలలో మాత్రమే లభించనుంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌లో భారీ మార్పులు చేసింది. సరికొత్త క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, మలచబడిన తీరులో ఉన్న ఫ్రంట్ బానెట్, రీడిజైన్ చేయబడిన హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. వీటితో పాటు, సరికొత్త ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ బంపర్, విశాలమైన ఎయిర్ ఇంటేకర్ మరియు నూతన ఫాగ్ ల్యాంప్స్ కలవు.

Recommended Video
Tata Nexon Review: Specs
మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ధరలు(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు ధరలు
సిగ్మా రూ. 8.49 లక్షలు
డెల్టా రూ. 9.39 లక్షలు
జెటా రూ. 9.98 లక్షలు
ఆల్ఫా రూ. 11.29 లక్షలు
మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

మారుతి విడుదల చేసిన ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో నూతన అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేయబడిన అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్ ఎస్-క్రాస్‌లో పదునైన ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్ వంటివి ఉన్నాయి.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

సరికొత్త ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డిడిఐఎస్ డీజల్ ఇంజన్ కలదు.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

మారుతి ఇందులో ఐడిల్ స్టాప్ మరియు స్టార్ట్ సిస్టమ్, టార్క్ అసిస్ట్, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ సిస్టమ్ మరియు గేర్‌షిఫ్ట్ ఇండికేటర్లతో పాటు మారుతి వారి స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ SHVS (స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి) ఇందులో ఉంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

ట్రాన్స్‌మిషన్ కోసం ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. అయితే, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ రాలేదు. గతంలో మారుతి విడుదల చేసిన ఎస్-క్రాస్‌లో 1.6-లీటర్ డీజల్ ఇంజన్ ఉండేది. అయితే మారుతి దానిని తొలగించింది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

భద్రత పరంగా ఎస్-క్రాస్ ఫేస్‍‌లిఫ్ట్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు చిన్న పిల్లల సీట్లను బిగించడానికి ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందించింది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

సరికొత్త ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ క్రాసోవర్‌లో అదనంగా, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ మరియు స్టాప్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరాలు ఉన్నాయి. ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను ఐదు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, నెక్సాన్ బ్లూ, పర్ల్ ఆర్కిటిక్ వైట్, కేఫెన్ బ్రౌన్, ప్రీమియమ్ సిల్వర్ మరియు గ్రాన్ గ్రే.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మునుపటి వెర్షన్ ఎస్-క్రాస్‍‌తో పోల్చుకుంటే ఎస్-క్రాస్ ఫేస్‍‌లిఫ్ట్‌లో ఎక్ట్సీరియర్‌లో భారీ మార్పులు జరిగాయి. డిజైన్ మొత్తం ఒకేలా ఉన్నప్పటికీ, సరికొత్త ఎలిమెంట్లను జోడించడం జరిగింది.

ఇంటీరియర్‌లో కూడా కొన్ని మార్పులతో పాటు అదనపు ఫీచర్లు వచ్చాయి. భద్రత పరంగా అన్ని వేరియంట్లకు సమానమైన ప్రాధ్యానతనిచ్చింది. మారుతి మొత్తానికి ఎస్-క్రాస్‌లో ప్రీమియమ్ ఫీల్ కల్పించింది. ఇది విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వేరియంట్లతో పోటీపడనుంది.

English summary
Read In Telugu: Maruti Suzuki S-Cross Facelift Launched In India; Prices Start At Rs 8.49 Lakh. maruti suzuki s cross facelift launched in india launch price mileage specifications images
Story first published: Tuesday, October 3, 2017, 19:19 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark