7-సీటింగ్ కెపాసిటితో వ్యాగన్ఆర్ అభివృద్ది చేస్తున్న మారుతి సుజుకి

Written By:

మారుతి సుజుకి ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఉన్న వివిధ కార్ల తయారీ సంస్థ మధ్య వేడిని పెంచుతూ... వివిధ రకాల కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

మారుతి భవిష్యత్తులో విడుదల చేయనున్న ఒక్కొక్క మోడల్ గురించిన వివరాలు ఇప్పుడు ఆన్‌లైన్ వేదికగా ఇంటర్నెట్లోకి చేరుతున్నాయి. అందులో ఒకటి మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్ ఎమ్‌పీవీ. దీని గురించిన పూర్తి వివరాలు నేటి కథనంలో...

Recommended Video - Watch Now!
[Telugu] Mahindra KUV100 NXT Launched In India - DriveSpark
మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

స్మాల్ హ్యాచ్‌బ్యాక్, ఎమ్‌పీవీ, క్రాసోవర్ మరియు ఖరీదైన ఎస్‌యూవీ ఈ నాలుగు కెటిగిరీలలో ఒక్కోదానిలో ఒక్కటి చెప్పున వచ్చే నాలుగేళ్లలోపు నాలుగు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి మారుతి సుజుకి సన్నద్దం అవుతోంది.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

వీటిలో బాగా ప్రాచుర్యం పొందిన వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ కారును 7-సీటింగ్ కెపాసిటితో మల్టీ పర్పస్ వెహికల్ సెగ్మెంట్లోకి విడుదల చేసే ఆలోచనలో మారుతి ఉంది.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

2013లో జరిగిన ఇండోనేషియా ఆటో షో వేదిక మీద సుజుకి ప్రదర్శించిన మూడు వరుసల సీటింగ్ గల వ్యాగన్‌ఆర్ ప్రేరణతో అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది.

Trending On DriveSpark Telugu:

ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే 14 బెస్ట్ డీజల్ కార్లు...!!

ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం ఎంతో తెలుసా...?

30కిమీల మైలేజ్‌తో సరికొత్త ఆల్టోను సిద్దం చేస్తున్న మారుతి సుజుకి

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

ఇది విపణిలోకి ప్రవేశిస్తే, ప్రస్తుతం అతి తక్కువ ధరతో ఆరు మంది ప్రయాణించే వీలున్న డాట్సన్ గో ప్లస్ కారుకు గట్టి పోటీనివ్వనుంది. ఇంజన్ వివరాలు తెలియరాలేదు, అయితే మారుతి లైనప్‌లో ఉన్న అదే 1.0-లీటర్ మూడు సిలిండర్ల కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ అందించే అవకాశం ఉంది.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

మూడు వరులతో ఏడు మంది కూర్చునే సీటింగ్ లేవుట్‌తో సరికొత్త ఎమ్‌పీవీని విడుదల చేస్తామని ప్రకటించినా... ఖచ్చితంగా ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయాన్ని వెల్లడించడానికి మారుతి నిరాకరించింది.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

అంతర్జాతీయంగా వైజెసి అనే కోడ్ పేరుతో కాన్సెప్ట్ రూపంలో 2013లో ప్రదర్శించిన 3 వరుసల సీటింగ్ గల 7-సీటర్ వ్యాగన్ఆర్ కారును గుజరాత్‌లోని మారుతి సుజుకి ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

డిజైన్ పరంగా అదే కాన్సెప్ట్‌ను పోలి ఉంటుంది. అప్పట్లో ప్రదర్శనకు వచ్చిన మోడల్‌ పొడవును 100ఎమ్ఎమ్ వరకు పెంచి, అదే వీల్ బేస్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎమ్‌పీవీని నిర్మించనుంది.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

సబ్ కాంపాక్ట్ ఎమ్‌పీవీ సెగ్మెంట్లోకి వచ్చే వ్యాగన్ఆర్ 7-సీటర్ సాంకేతికంగా మారుతి వారి పాపులర్ 1.0-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

ట్రాన్స్‌మిషన్ పరంగా చూస్తే వ్యాగన్ఆర్ 7-సీటర్‌ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌బాక్స్‌తో ఆప్షనల్‌గా లభించనుంది. మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్ ఎమ్‌పీవీ ధరల శ్రేణి రూ. 4.5 లక్షల నుండి 6 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.

క్షణకాలంలో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారతదేశపు శక్తివంతమైన 10 యుద్ద విమానాలు

దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు

English summary
Read In Telugu: Maruti Suzuki WagonR 7 seat MPV In The Works

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark