న్యూ డిజైర్‌లో ఆ ఒక్క అంశం పరంగా అసంతృప్తి మిగిల్చిన మారుతి

Written By:

ఇది వరకు మారుతి సుజుకి మీద ఇండియన్ ఆటో పరిశ్రమకు ఉన్న అంచనాల మేరకు సరికొత్త డిజైర్ రెగ్యులర్ మరియు ఆర్ఎస్ వెర్షన్‌లలో విడుదల కావాల్సి ఉంది. అయితే న్యూ డిజైర్‌ కేవలం రెగ్యులర్‌ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుందని, ఆర్ఎస్ బ్యాడ్జి వెర్షన్‌లో ఉండబోదని మారుతి స్పష్టం చేసింది.

మారుతి సుజుకి డిజైర్ ఆర్ఎస్ వెర్షన్

భారత దేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ నూతన డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌కు డిజైన్ పరంగా అనేక మార్పులు చేర్పులు చేసి, నూతన ఫీచర్లు అందించింది విపణిలోకి విడుదల చేసింది.

మారుతి సుజుకి డిజైర్ ఆర్ఎస్ వెర్షన్

మారుతి ఈ నూతన డిజైర్‌ను బాలెనోను అభివృద్ది చేసిన ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేసింది. కాబట్టి బాలెనో తరహాలో ఈ నూతన డిజైర్ ఆర్ఎస్ తరహాలో విడుదలయ్యే అవకాశం ఉందని చాలా మంది భావించారు.

మారుతి సుజుకి డిజైర్ ఆర్ఎస్ వెర్షన్

మారుతి తమ బాలెనోను తొలుత రెగ్యులర్ వెర్షన్‌లో విడుదల చేసి అనంతరం 1.0-లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్‌తో బాలెనో ఆర్ఎస్ వెర్షన్‌లో విడుదల చేసింది.

మారుతి సుజుకి డిజైర్ ఆర్ఎస్ వెర్షన్

రిపోర్ట్స్ ప్రకారం మారుతి సుజుకి తమ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును ఆర్ఎస్ వేరియంట్లో చేయడం లేదని తెలిసింది. దీంతో డిజైర్ ఆర్ఎస్ వెర్షన్ మీద అశలు పెట్టుకున్న వారికి నిరాశే మిగిలింది.

మారుతి సుజుకి డిజైర్ ఆర్ఎస్ వెర్షన్

నిజానికి ఆర్ఎస్ వెర్షన్ కార్లకు దేశీయంగా మంచి డిమాండ్ ఉంది. మారుతి సుజుకి తమ బాలెనో ఆర్ఎస్ కార్లను నెలకు 800 నుండి 1,000 యూనిట్ల వరకు విక్రయిస్తోంది.

మారుతి సుజుకి డిజైర్ ఆర్ఎస్ వెర్షన్

ఆర్ఎస్ వెర్షన్ డిజైర్ గురించి మారుతి ప్రస్తావిస్తూ... సెడాన్ సెగ్మెంట్లో స్పోర్టివ్ వెర్షన్‌ను ఎవరూ ఇష్టపడరు. ఒక వేళ శక్తివంతమైన కారును కావాలనుకునే వారి తమ లైనప్‌లో ఉన్న స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్(బాలెనో ఆర్ఎస్) ఎంచుకోగలరని సూచించింది.

మారుతి సుజుకి డిజైర్ ఆర్ఎస్ వెర్షన్

నూతన డిజైర్ కాంపాక్ట్ సెడాన్ విషయానికి వస్తే, ఇది 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్‌లలో ఎంచుకోవచ్చు.

మారుతి సుజుకి డిజైర్ ఆర్ఎస్ వెర్షన్

ఆర్ఎస్ వెర్షన్ పరంగా న్యూ డిజైర్ అంసతృప్తిని మిగిల్చినప్పటికీ, మారుతి నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ 102బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. దీనిని 2018 ప్రారంభం నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.

English summary
Read In Telugu No RS Variant For The 2017 Maruti Suzuki Dzire — Report
Story first published: Monday, May 22, 2017, 10:33 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark