ఇండియాలో తొలి తయారీ ప్లాంటును ప్రారంభించిన ఇంగ్లాండ్ కంపెనీ

Written By:

ఇంగ్లాండ్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్ భారత్‌లో తమ తొలి ప్రొడక్షన్ ప్లాంటును ప్రారంభించింది. ప్రాథమిక పెట్టుబడి క్రింద సుమారుగా రెండు వేల కోట్ల రుపాయలు పెట్టుబడి పెట్టింది.

తయారీ ప్లాంటును ఏర్పాటు చేసిన ఎమ్‌జి మోటార్

గుజరాత్‌లోని ఈ ప్రొడక్షన్ ప్లాంటు 170 ఎకరాలలో విస్తరించి ఉంది. దీనిని 2019 నాటికి ఎమ్‌జి మోటార్ పూర్తి స్థాయిలో పునర్నిర్మించనుంది. ప్రస్తుతానికి 70 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ ప్లాంటు త్వరలో మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా చొరవతో మరిన్ని ఉద్యోగాలు కల్పించనుంది.

తయారీ ప్లాంటును ఏర్పాటు చేసిన ఎమ్‌జి మోటార్

నవారాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దసరా పర్వదినాన పూజ కార్యక్రమంతో ఈ గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌జి మోటార్ ఇండియా ఉద్యోగులతో పాటు అందరు ప్రతినిధులు పాల్గొన్నారు.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
తయారీ ప్లాంటును ఏర్పాటు చేసిన ఎమ్‌జి మోటార్

ఎమ్‌జి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరక్టర్ రాజీవ్ చబా మాట్లాడుతూ,"భారత్‌లో తమ తొలి ప్రొడక్షన్ ప్లాంటును ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మోరీస్ గ్యారేజెస్ బ్రాండ్(ఎమ్‌జి మోటార్) మరియు భారత్‌ మధ్య అవినాభావ సంభందం ఉందని తెలిపాడు.

Read more on: #saic
English summary
Read In Telugu: MG Motor Inaugurates Its First Manufacturing Plant In India
Story first published: Saturday, September 30, 2017, 15:41 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark