హ్యుందాయ్ క్రెటా కు పోటీని సిద్దం చేసిన ఎమ్‌జి మోటార్స్

Written By:

చైనా ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ SAIC ఎమ్‌జి మోటార్స్ ఉమ్మడి భాగస్వామ్యంతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించడానికి దాదాపు సిద్దమైంది. ఇందు కోసం హలోల్‌ లో ఉన్న జనరల్ మోటార్స్ వారి షెవర్లే ప్రొడక్షన్ ప్లాంటును సొంతం చేసుకుంది.

ఎమ్‌జి మోటార్స్ హ్యుందాయ్ క్రెటా పోటీ

ఎమ్‌జి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరక్టర్ రాజీవ్ చబా, ప్రముఖ ఆటోమొబైల్ మీడియాతో మాట్లాడుతూ, ఇండియన్ మార్కెట్లో తమ ప్రణాళికలను వివరిచారు. SAIC మరియు ఎమ్‌జి మోటార్స్ ఇరు సంస్థల భాగస్వామ్యంతో హ్యుందాయ్ క్రెటా కు పోటీగా తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టనున్నాయి.

Recommended Video - Watch Now!
Volkswagen Launches Tenth Anniversary special Editions | In Telugu - DriveSpark తెలుగు
ఎమ్‌జి మోటార్స్ హ్యుందాయ్ క్రెటా పోటీ

రాజీవ్ మాట్లాడుతూ, "SAIC సంస్థ తొలి దశలో 2,000 కోట్ల రుపాయలను హలోల్ ప్రొడక్షన్ ప్లాంటు పునరుద్దరణ మరియు ప్రస్తుతం ఉన్న 60,000 యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 80,000 యూనిట్లకు పెంచడానికి వినియోగించనుందని తెలిపాడు."

ఎమ్‌జి మోటార్స్ హ్యుందాయ్ క్రెటా పోటీ

రానున్న ఐదేళ్ల కాలంలో శక్తివంతమైన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా ఇండియన్ మార్కెట్లో అవతరించడానికి SAIC ప్లాన్ చేస్తోంది. అయితే, ఎమ్‌జి మోటార్స్ మరియు SAIC తదుపది ప్రొడక్ట్స్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా కు గట్టి పోటీనిచ్చేలా కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయనుంది.

ఎమ్‌జి మోటార్స్ హ్యుందాయ్ క్రెటా పోటీ

కాంపాక్ట్ ఎస్‌యూవీ తరువాత స్మాల్ ఎమ్‌పీవీ మరియు హ్యాచ్‌బ్యాక్ కార్లను వరుసగా విడుదల చేయనుంది. రాజీవ్ తెలిపిన వివరాల ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ తొలి లాంచ్ 2019లో, తరువాత మోడల్ లాంచ్ 2020 లో ఉండనున్నాయి.

ఎమ్‌జి మోటార్స్ హ్యుందాయ్ క్రెటా పోటీ

ప్రస్తుతం, ఎమ్‌జి మోటార్స్ చెనా విపణిలో ఎమ్‌జి జడ్ఎస్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. ఎమ్‌జి జిస్ మోడల్ యొక్క కుదించిన రూపాన్ని ఎమ్‌జి జడ్ఎస్ గా చెప్పుకోవచ్చు. ఇదే ఎస్‌యూవీ 2017 చివరి నాటికి ఇంగ్లాండ్ మార్కెట్లో విక్రయాలకు సిద్దం కానుంది.

ఎమ్‌జి మోటార్స్ హ్యుందాయ్ క్రెటా పోటీ

ఈ మధ్యనే చైనా మార్కెట్లో విడుదలైన నెక్ట్స్ జనరేషన్ ఎమ్‌జి3 హ్యాచ్‌బ్యాక్ ఆధారిత కారును, కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల అనంతరం, దేశీయ మార్కెట్ కోసం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

ఎమ్‌జి మోటార్స్ హ్యుందాయ్ క్రెటా పోటీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ భారీగా ఉంది. వివిధ రకాల ధరల శ్రేణిని బట్టి చాలా మోడళ్లే ఉన్నాయి. అయితే, హ్యుందాయ్ క్రెటాకు ఇప్పటి వరకు సరాసరి పోటీ రాలేదు. దీనిని అవకాశంగా చేసుకుని SAIC మరియు ఎమ్‌జి మోటార్స్ 2019 నాటికి తమ తొలి ఉత్పత్తిగా ఎమ్‌జి జడ్ఎస్ ఎస్‌యూవీని విడుదల చేయనుంది.

English summary
Read In Telugu: MG Motors To Launch Hyundai Creta Rival In India
Story first published: Tuesday, September 12, 2017, 15:23 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark