విడుదలకు ముందే భారీ ప్రమాదానికి గురైన నెక్ట్స్ జనరేషన్ 2017 స్విఫ్ట్ డిజైర్

Written By:

మారుతి సుజుకి తమ స్విఫ్ట్ డిజైర్‌ ను నెక్ట్స్ జనరేషన్ మోడల్‌గా మే 16, 2017 దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే సరికొత్త స్విఫ్ట్ డిజైర్ భారీ ప్రమాదానికి గురైంది.

భారీ ప్రమాదానికి గురైన 2017 స్విఫ్ట్ డిజైర్

మరో వారం రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో మారుతి సుజుకి ఈ 2017 స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కార్లను డీలర్ల చెంతకు చేరుస్తోంది.

భారీ ప్రమాదానికి గురైన 2017 స్విఫ్ట్ డిజైర్

బహుశా డీలర్లకు చేర్చే క్రమంలో కారు ప్రమాదానికి గురై ఉంటుందని భావిస్తున్నారు.

భారీ ప్రమాదానికి గురైన 2017 స్విఫ్ట్ డిజైర్

విడుదలకు ముందే ఇలా ప్రమాదానికి గురవడం దీని స్ట్రెంత్ ఏంటో కస్టమర్లకు తెలిసిపోయేలా చేసిందని చెప్పవచ్చు.

భారీ ప్రమాదానికి గురైన 2017 స్విఫ్ట్ డిజైర్

ఈ ప్రమాదం మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. అయితే కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారు. దీనిని డీలర్లకు చేర్చే సందర్భంలో జరిగిందా లేదంటే దీనికి రోడ్ టెస్ట్ నిర్వహిస్తుంటే ప్రమాదానికి గురైందా అనే విషయం తెలియరాలేదు.

భారీ ప్రమాదానికి గురైన 2017 స్విఫ్ట్ డిజైర్

టాటా సఫారీ వాహనం మరియు ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ ఒకదానినొకటి ఢీకొన్నాయి.

భారీ ప్రమాదానికి గురైన 2017 స్విఫ్ట్ డిజైర్

ఈ ప్రమాదంలో స్విఫ్ట్ డిజైర్ కుడివైపు పూర్తిగా ధ్వంసం కాగా, టాటా సఫారీ కుడివైపు పాక్షికంగా దెబ్బతింది.

భారీ ప్రమాదానికి గురైన 2017 స్విఫ్ట్ డిజైర్

ప్రమాదానికి గురైన సరికొత్త స్విఫ్ట్ డిజైర్‌ ఎయిర్ బ్యాగులను కలిగి ఉన్న మోడల్ అని తేలింది. ప్రమాదానంతరం కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు విచ్చుకుంది. అయితే డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ప్రమాదం ధాటికి పేలిపోయినట్లు తెలుస్తోంది.

భారీ ప్రమాదానికి గురైన 2017 స్విఫ్ట్ డిజైర్

డ్రైవ్‌స్పార్క్ పాఠకుడు ఈ సరికొత్త స్విఫ్ట్ డిజైర్ ప్రమాదానికి చెందిన ఫోటోలు మరియు ప్రమాద వివరాలను పంచుకున్నాడు.

భారీ ప్రమాదానికి గురైన 2017 స్విఫ్ట్ డిజైర్

డిజైన్ పరంగా మునుపటి స్విఫ్ట్ డిజైర్‌తో పోల్చుకుంటే ఇందులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మారుతి సుజుకి దీనిని HEARTECT ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేసింది.

భారీ ప్రమాదానికి గురైన 2017 స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి ఇప్పటికే ఈ మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ డిజైర్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభించింది. ఈ డిజైర్‌లో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో నూతన ఫీచర్లను గుర్తించవచ్చు.

English summary
Read In Telugu New Maruti Suzuki 2017 Swift Dzire Crash

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark