TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
అవుట్‌ల్యాండర్ విషయంలో దిగ్గజాలకు ఊహించని షాకిచ్చిన మిత్సుబిషి
మిత్సుబిషి ఇండియా తమ అఫీషియల్ వెబ్‌సైట్లో అవుట్‌ల్యాండర్ ఎస్‌యూవీని చేర్చింది. అయితే ఇందులో తప్పేముంది అంటారా.... నిజానికి మిత్సుబిషి విపణిలోకి అవుట్‌ల్యాండర్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంది. విడుదలకు ముందే వెబ్‌సైట్లో వెహికల్ మొత్తం వివరాలను పొందుపరిచి, దీనికి పోటీగా ఉన్న సంస్థలకు షాక్ ఇచ్చింది.
మిత్సుబిషి అవుట్‌ల్యాండర్ ప్రీమియమ్ ఎస్‌యూవీలో డైనమిక్ షీల్డ్ ఫ్రంట్ డిజైన్ లాంగ్వేజ్‌లో రూపొందించింది. గాలితో కలిగే ఘర్షణ తగ్గించేందుకు రూఫ్ మరియు ముందు భాగాన్ని ఏరోడైనమిక్‌తో అభివృద్ది చేసింది.
అవుట్‌ల్యాండర్ ఫ్రంట్ డిజైన్‌లో క్రోమ్ ఫినిషింగ్ గల ట్విన్ స్లాట్ ఫ్రంట్ గ్రిల్ కలదు, రివైజ్ చేయబడిన హెడ్‌ల్యాంప్స్‌కు మధ్యలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ మీద మిత్సుబిషి లోగో యధావిథంగా అందించింది. ఇంటీరియర్‌లోని సెంటర్ కన్సోల్‌కు చుట్టుప్రక్కల పియానో బ్లాక్ ట్రిమ్ కలదు.
మిత్సుబిషి వెబ్‌సైట్లో ఉన్న వివరాల ఆధారంగా చూస్తే అవుట్‌ల్యాండర్ ఎస్‌యూవీలో స్పోర్ట్స్ మోడ్ మరియు పడిల్ షిఫ్టర్స్ గల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో రానుంది.
మిత్సుబిషి అవుట్‌ల్యాండర్ ఎస్‌యూవీ ఎలక్ట్రానికల్‌గా కంట్రోల్ చేయబడే ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాక్టివ్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్ గల ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లున్నాయి.
అవుట్‌ల్యాండర్‌లో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్, రాక్‌ఫోర్డ్ ఫోస్గేట్ ఆడియో సిస్టమ్, 6.1-ఇంచ్ టచ్ స్క్రీన్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మిత్సుబిషి అవుట్‌ల్యాండర్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో విక్రయాలకు సిద్దంగా విడుదల చేస్తే టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.