రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రివీల్డ్

Written By:

బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీని ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ మార్పులతో ఫేస్‌లిఫ్ట్‌లో రూపంలో ఆవిష్కరించింది.

రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రివీల్డ్

రేంజ్ రోవర్ లోని 567బిహెచ్‌పి ఎస్‌విఆర్ వేరియంట్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్లో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అప్‌డేట్ చెందిన ఎస్‌యూవీ స్థానాన్ని 2020 నాటికి సరికొత్త మోడల్‌ భర్తీ చేయనుంది.

రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రివీల్డ్

టాప్ స్పెక్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్‌ లో 567బిహెచ్‌పి పవర్ మరియు 700ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 5-లీటర్ వి8 టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది కేవలం 4.5 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రివీల్డ్

రేంజ్ రోవర్ లోని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్ ఎస్‌యూవీ పి400ఇ బ్యాడ్జితో రానుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుండి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వస్తున్న తొలి ఎస్‌యూవీగా స్థానాన్ని పధిలం చేసుకోనుంది. పి400ఇ ఎలక్ట్రిక్ మరియు 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 398బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రివీల్డ్

రేంజ్ రోవర్ స్పోర్ట్ PHEV (Plug-in Hybrid Electric Vehicle) హైబ్రిడ్ ఎస్‌యూవీ కేవలం 6.7 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ల్యాండ్ రోవర్ తెలిపిన వివరాల మేరకు, ఇది లీటర్‌కు 37.75కిమీల మైలేజ్ ఇవ్వగలదు మరియు కేవలం ఎలక్ట్రిక్ మోటర్‌తో 50కిమీల వరకు ప్రయాణిస్తుంది.

రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రివీల్డ్

ఎలక్ట్రిక్ మోటార్‌కు కావాల్సిన పవర్ ఫ్రంట్ బానెట్ క్రింద ఉన్న 13.1kWh లిథియం-అయాన్ బ్యాటరీ నుండి అందుతుంది. ఫ్రంట్ గ్రిల్‌లో ఉన్న ల్యాండ్ రోవర్ లోగో వెనుకాల ఛార్జింగ్ కేబుల్ యాక్సెస్ ఉంది. రెండు గంటల 45 నిమిషాల్లో బ్యాటరీ మొత్తం ఛార్జ్ అవుతుంది.

రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రివీల్డ్

ఎస్‌విఆర్ మరియు పి400ఇ మినహాయిస్తే, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ వి6 మరియు వి8 పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. సరికొత్త ఫేస్‌లిఫ్టెడ్ ఎస్‌యూవీలో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రివీల్డ్

ఫేస్‌లిఫ్ట్ రేంజ్ రోవర్ స్పోర్ట్ వేరియంట్ల ఇంటీరియర్‌లో వెలార్ ప్రేరిత మరియు సరికొత్త టచ్ ప్రొ డ్యూఒ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇందులో 10-అంగుళాల పరిమాణం ఉన్న హై డెఫినిషన్ టచ్ స్కీన్ డిస్ల్పే, 12 పవర్ పాయింట్లు, కీ లేకుండానే వెహికల్‌ను అన్‌లాక్ చేసేందుకు యాక్టివిటి కీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రివీల్డ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ల్యాండ్ రోవర్ తొలిసారిగా తమ రేంజ్ రోవర్ స్పోర్ట్ వేరియంట్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌తో ఆవిష్కరించింది. అయితే, ఫేస్‌లిఫ్ట్ రేంజ్ రోవర్ స్పోర్ట్ వేరియంట్ల ఇండియా విడుదలను ల్యాండ్ రోవర్ స్పష్టం చేయలేదు.

అయితే, విపణిలోకి విడుదలైతే ప్రస్తుతం ఉన్న పోర్షే కయీన్ టుర్బో లగ్జరీ ఎస్‌యూవీకి పోటీనివ్వనుంది. అంతే కాకుండా, అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి వెలార్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తోంది.

English summary
Read In Telugu: New Range Rover Sport SVR And Plug-In Hybrid Revealed
Story first published: Saturday, October 7, 2017, 9:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark