సరికొత్త మైక్రా విడుదలపై నిస్సాన్ స్పష్టత

Written By:

నిస్సాన్ ఇండియా విభాగానికి ఇప్పటికీ వరకు చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. అయితే నెక్ట్స్ జనరేషన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసి, తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది వరకే మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారుకు మంచి డిమాండ్ ఉంది.

నిస్సాన్ మైక్రా

నిస్సాన్ నెక్ట్స్ జనరేషన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారును 2019 లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే ప్రపంచ విపణిలో ఉన్న మైక్రాను స్వల్ప మార్పులతో ఫేస్‌లిఫ్ట్ తరహాలో రూపొందించి దేశీయంగా విడుదలకు సిద్దం చేయనుంది. అయితే, ఇప్పటికే విపణిలో ఉన్న మైక్రాతో పోల్చుకుంటే ఇది చాలా వరకు విభిన్నంగా ఉండనుంది.

Recommended Video - Watch Now!
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
నిస్సాన్ మైక్రా

నిస్సాన్ వి ఫ్లాట్‌ఫామ్ ఆధారిత యూరోపియన్ మార్కెట్లో ఉన్న మైక్రా ను, ఇండియన్ స్పెక్ మోడల్‌గా అతి తక్కవ ధరలో అందుబాటులో ఉంచేందుకు సిఎమ్ఎఫ్ ఎ+ ఫ్లాట్‌ఫామ్ మీద నెక్ట్స్ జనరేషన్ మైక్రాను అభివృద్ది చేస్తున్నారు.

నిస్సాన్ మైక్రా

సిఎమ్‌ఎఫ్ ఫ్లాట్‌ఫామ్ మీద మైక్రాతో పాటు సరికొత్త నిస్సాన్ సన్నీ సెడాన్ కారును కూడా అభివృద్ది చేస్తున్నారు. 2018 లో నిస్సాన్ సన్నీ కారును ఆవిష్కరించనున్నారు. సన్నీ మరియు మైక్రా రెండూ 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌లతో రానున్నాయి.

నిస్సాన్ మైక్రా

ఈ మధ్యనే డస్టర్ ఎస్‌యూవీలో ఈ 1.5-లీటర్ ఇంజన్‌ను జోడించారు. ఇది గరిష్టంగా 106బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు నిస్సాన్ ప్రస్తుతానికి నెక్ట్స్ జనరేషన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ కేవలం పెట్రోల్ ఇంజన్ వేరియంట్‌లో మాత్రమే విడుదలకానుంది.

నిస్సాన్ మైక్రా

నెక్ట్స్ జనరేషన్ మైక్రా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆప్షనల్ ఎక్స్-ట్రానిక్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ లలో లభించనుంది. ప్రస్తుతం విపణిలో ఉన్న మైక్రా మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కార్లతో పోటీపడుతోంది.

నిస్సాన్ మైక్రా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నిస్సాన్ స్వే కాన్సెప్ట్ కారు ఆధారంతో నెక్ట్స్ జనరేషన్ మైక్రాను రూపొందించింది. దీని ఫ్రంట్ డిజైన్‌లో వి-మోషన్ గ్రిల్ ఉండటంతో అగ్రెసివ్ రూపాన్ని కలిగి ఉంది. అయితే దీని ధరలను పోటీదారులను దృష్టిలో ఉంచుకుని అత్యంత చాకచక్యంగా నిర్ణయిస్తే మంచి సక్సెస్ ఖాతాలో వేసుకోవచ్చు.

English summary
Read In Telugu: Nissan To Introduce Next-Gen Micra In India In 2019
Story first published: Wednesday, August 2, 2017, 13:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark