నిస్సాన్-డాట్సన్ దీపావళి కార్నివాల్: నాలుగు రోజులు ఆఫర్లే ఆఫర్లు...!!

Written By:

నిస్సాన్ మరియు డాట్సన్ కార్ల సంస్థలు దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న తమ విక్రయ కేంద్రాలలో నాలుగు రోజుల అతి పెద్ద కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. పండుగ సీజన్‌లో వివిధ రకాల ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించి సేల్స్ పెంచుకునే క్రమంలో ఈ రెండు కంపెనీలు భారీ ఆఫర్లకు తెరలేపాయి.

నిస్సాన్-డాట్సన్ దీపావళి ఆఫర్లు

నిస్సాన్-డాట్సన్ వారి నాలుగు రోజుల దీపావళి కార్నివాల్‌లో ప్రతి నిస్సాన్ మరియు డాట్సన్ కార్ల కొనుగోలు మీద కస్టమర్లు, ఉచిత ఇన్సూరెన్స్, ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్, తక్కువ వడ్డీ రేటు వంటి దీపావళి ఆఫర్లను పొందవచ్చు.

దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ మరియు డాట్సన్ డీలర్ల వద్ద అక్టోబరు 7 నుండి అక్టోబరు 10, 2017 వరకు నాలుగు రోజుల పాటు కార్నివాల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

నిస్సాన్-డాట్సన్ దీపావళి ఆఫర్లు

నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ మరియు మార్కెటింగ్ హెడ్ జెరోమ్ సైగట్ మాట్లాడుతూ," కస్టమర్ల అవసరాలు మరియు ఎంపికను దృష్టిలో ఉంచుకుని నూతన ఉత్పత్తులను మరియు సేల్స్ తరువాత అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తున్నట్లు తెలిపాడు. పండుగ సీజన్ మొదలైన నేపథ్యంలో కస్టమర్ల కోసం పలు ఆఫర్లను నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పుకొచ్చాడు."

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
నిస్సాన్-డాట్సన్ దీపావళి ఆఫర్లు

ప్రతి నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ కొనుగోలు మీద ఉచిత ఇన్సూరెన్స్, ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ ఆఫర్లతో సహా రూ. 50,000 లు విలువైన లాభాలను అందిస్తోంది.

నిస్సాన్-డాట్సన్ దీపావళి ఆఫర్లు

అదే విధంగా, నిస్సాన్ సన్నీ మీద రూ. 30,000 ల వరకు మరియు నిస్సాన్ మైక్రా మరియు నిస్సాన్ ఆక్టివ్ మోడళ్ల మీద రూ. 20,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.

నిస్సాన్-డాట్సన్ దీపావళి ఆఫర్లు

జపాన్ మరో దిగ్గజం, నిస్సాన్ భాగస్వామ్యపు సంస్థ డాట్సన్ అందిస్తోన్న గో, గో ప్లస్ మరియు రెడి గో(800సీసీ) మరియు రెడి-గో 1.0లీ కార్ల మీద ఉచితి ఇన్సూరెన్స్, ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ ఆఫర్లతో కలుపుకొని రూ. 15,000 ల వరకు ఆఫర్లను అందిస్తోంది.

నిస్సాన్-డాట్సన్ దీపావళి ఆఫర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పండుగ సీజన్‌లో ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించడం సర్వసాధారణమే, అయితే పండుగ వేడుకల్లో కొత్త వాటిని కొనుగోలు చేయడానికి భారతీయులు ఎక్కువగా ఇష్టపడతారు. దీనిని అవకాశంగా చేసుకుని పలు కార్ల కంపెనీలు వివిధ రకాల ఆఫర్లతో సేల్స్ పెంచుకుంటాయి.

కాబట్టి, నిస్సాన్ లేదా డాట్సన్ కార్లను ఎంచుకోవాలనుకుంటే ఒకసారి అక్టోబర్ 7 నుండి 10 మధ్య ఆయా డీలర్లను సంప్రదించి అందుబాటులో ఉన్న ఆఫర్ల మీద ఓ లుక్కేసి, నచ్చినట్లయితే బుక్ చేసేయండి...

English summary
Read In Telugu: Nissan India Announces Four-Day ‘Biggest Diwali Carnival’ For Customers
Story first published: Wednesday, October 4, 2017, 10:21 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark