ట్రాఫిక్ చలానా చెల్లించేందుకు డబ్బు లేదా..? అయితే పేటిఎమ్ ఉపయోగించండి!

Written By:

ట్రాఫిక్ చలానాలు చెల్లించేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్లలో సాధారణంగా జరిమానాలను చెల్లిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ ట్రాఫిక్ చలానాలను మన స్మార్ట్ ద్వారా కూడా చెల్లించవచ్చు. ఇందు కోసం ఆన్ లైన్ చెల్లింపుల వ్యాపారంలో దూసుకెళ్తున్న పేటిఎమ్ ముందడుగు వేసింది.

చలానా చెల్లింపులకూ పేటిమ్

మొబైల్ పేమెంట్ వేదిక పేటిఎమ్ ద్వారా ట్రాఫిక్ చలానాలను చెల్లించేందుకు తమ స్మార్ట్ అప్లికేషన్‌లో మార్పులు చేసింది. అనగా ఇదివరకే ఉన్న పేటిఎమ్ అప్లికేషన్‌లోనే ట్రాఫిక్ చలానా చెల్లించే విధంగా మార్పులు తీసుకొచ్చింది.

చలానా చెల్లింపులకూ పేటిమ్

నగదు చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఫీచర్ అందించింది. వినియోగదారులు పేటిమ్ యాప్‌తో లాగిన్ అయ్యాక ట్రాఫిక్ చలానా(Traffic Challan) ఆప్షన్ ఎంచుకుని వెహికల్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కొన్ని వెరిఫికేషన్స్ అనంతరం పేమెంట్ పూర్తి చేయవచ్చు.

చలానా చెల్లింపులకూ పేటిమ్

పేటిఎమ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కిరణ్ వాసిరెడ్డి మాట్లాడుతూ, "దేశవ్యాప్తంగా నిర్ధేశించిన కౌంటర్లలో ట్రాఫిక్ చలానాలా చెల్లింపులు పెద్ద మొత్తంలో డబ్బు రూపంలో జరుగుతున్నాయి. కలిసి చలానాలను సులభతరం చేసేందుకు వివిధ రాష్ట్రాల ట్రాఫిక్ పోలీసు శాఖలతో భాగస్వామ్యపు ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు".

చలానా చెల్లింపులకూ పేటిమ్

పేటిఎమ్ ద్వారా చెల్లింపు పూర్తయిన తరువాత, డిజిటల్ పేమెంట్ జనరేట్ చేస్తుంది. కస్టమర్లకు పేమెంట్ డాక్యుమెంట్ రూపంలో ఆయా పోలీసు శాఖల నుండి పోస్టల్ సర్వీసు ద్వారా పంపడం జరుగుతుంది.

చలానా చెల్లింపులకూ పేటిమ్

వాసిరెడ్డి గారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరిగే అన్ని చెల్లింపులు ఆన్ లైన్ ద్వారా జరపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాము, ఇందుకోసం ప్రభుత్వ మరియు ప్రయివేట్ సంస్థలతో అనేక ఒప్పందాలు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

చలానా చెల్లింపులకూ పేటిమ్

ప్రస్తుతానికి పేటిఎమ్ ద్వారా ట్రాఫిక్ చలానాల చెల్లింపులు జరిపేందుకు ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ మరియు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల ట్రాఫిక్ పోలీసు శాఖలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మరిన్ని రాష్ట్రాలు మరియు నగరాలకు విస్తరించనున్నారు.

English summary
Read In Telugu To Know More Now You Can Pay Traffic Challan Through Paytm
Story first published: Friday, June 9, 2017, 19:50 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark