20 ఏళ్ల తరువాత మళ్లీ ఇండియన్‌ మార్కెట్లోకి ఎంట్రీ: తొలికారు ఇదే!

Written By:

1997లో ఇండియన్ మార్కెట్ నుండి వైదొలగిన ప్యూజో మోటార్స్ సరిగ్గా రెండు దశాబ్దాల అనంతరం రెండు దేశీయ దిగ్గజ వాహన సంస్థల ఉమ్మడి భాగస్వామ్యపు సహకారంతో ఇండియన్ మార్కెట్లోకి రీ ఎంట్రీకి సిద్దమైంది. అందులో భాగంగా ప్యూజో తమ తొలి ఉత్పత్తిని విడుదల చేడానికి సన్నాహాలు చేస్తోంది.

208 హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయంగా పరీక్షించిన ప్యూజో

దేశీయంగా ప్యాసింజర్ కార్ల మార్కెట్లో తనదైన శైలిలో రాణించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో సికె బిర్లా గ్రూప్ ఉమ్మడి భాగస్వామ్యంతో కార్లను ఉత్పత్తి చేయనుంది. హిందుస్తాన్ మోటార్స్‌కు అంబాసిడ్ బ్రాండ్ పేరును కూడా ప్యూజో సొంతం చేసుకుంది.

208 హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయంగా పరీక్షించిన ప్యూజో

ఈ నేపథ్యంలో ప్యూజో దేశీయ రోడ్ల మీద ఓ హ్యాచ్‌బ్యాక్ కారును పరీక్షిస్తూ మీడియా కంటబడింది. 2016 లో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విదేశీయ మార్కెట్లలో విడుదలైన 208 మోడల్‌ కారును పరీక్షించింది.

208 హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయంగా పరీక్షించిన ప్యూజో

ప్యూజో లైనప్‌లో ఉన్న మూడు సిలిండర్ల ఇంజన్ గల ఈ కారు అనేక అవార్డులు గ్రహీత. మరియు అంతర్జాతీయ విపణిలో అత్యధిక ఆదరణ పొందిన మోడల్ కూడా ఇదే. ఈ 208 మోడల్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్యూజో తమ మొదటి ఉత్పత్తిగా తీసుకురానుంది.

208 హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయంగా పరీక్షించిన ప్యూజో

యూరోపియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడల్‌లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 108బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

208 హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయంగా పరీక్షించిన ప్యూజో

ప్యూజో 208 హ్యాచ్‌బ్యాక్ 4.5 లీటర్ల కన్నా తక్కువ పెట్రోల్‌తో 100కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. లీటర్‌కు 22.2కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

208 హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయంగా పరీక్షించిన ప్యూజో

ప్యూజో ఈ 208 హ్యాచ్‌బ్యాక్‌ను ముంబాయ్ రోడ్ల మీద ప్రయోగాత్మకంగా పరీక్షించింది. దేశీయంగా దీనికి ఉన్న సాధ్యాసాద్యాలను పరిశీలించే రిపోర్ట్ రూపంలో సేకరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం రెనో మీద దృష్టిసారించినట్లు స్పష్టమవుతోంది.

208 హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయంగా పరీక్షించిన ప్యూజో

చిన్న కార్లతో పాటు విభిన్న డిజైన్ శైలిలో ఉండే ఎస్‌యూవీ ఉత్పత్తుల అభివృద్ది మరియు తయారీ మీద ప్యూజో దృష్టి పెడుతోంది. దేశీయ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో ఎక్కువ వృద్దిని సాధిస్తోంది ఎస్‌యూవీ సెగ్మెంట్.

English summary
Read In Telugu Peugeot 208 Spotted Testing In India
Story first published: Friday, June 2, 2017, 12:52 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark