రెండు ఇంజన్ ఆప్షన్‍‌లతో ఇండియాకు ప్యూజో కార్లు

Written By:

సుమారుగా 20 ఏళ్ల తరువాత ప్యూజో కార్ల తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లో కార్యకలపాలను ప్రారంభించనుంది. ఇప్పటికే దీనికి సంభందించిన కీలక ఒప్పందాలు పూర్తి చేసింది. దేశీయ సంస్థ సికె బిర్లా గ్రూపుతో జట్టు కడూతూ ఫ్రాన్స్‌కు చెందిన పిఎస్ఎ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ప్యూజో, సిట్రియోన్ మరియు డిఎస్ ఆటోమొబైల్స్ సంస్థలకు చెందిన కార్లను బిఎస్‌ఎ గ్రూప్ విక్రయిస్తోంది. ఈ మూడు సంస్థలకు మాతృసంస్థగా వ్యవహరిస్తున్న పిఎస్‌ఎ గ్రూప్ దేశీయంగా కార్ల తయారీకి కసరత్తులు చేస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఇండియాకు ప్యూజో కార్లు

హిందుస్తాన్ మోటార్స్ మరియు మిత్సుబిషి భాగస్వామ్యంతో ఉన్నటువంటి చెన్నైలోని హిందుస్తాన్ ప్రొడక్షన్ ప్లాంటు వేదికగా పిఎస్‌ఎ మరియు సికె బిర్లా భాగస్వామ్యం మూడు కార్ల తయారీ సంస్థలకు (ప్యూజో, సిట్రియోన్ మరియు డిఎస్ ఆటోమొబైల్స్) చెందిన కార్లను ఉత్పత్తి చేయనుంది.

ఇండియాకు ప్యూజో కార్లు

పిఎస్ఎ గ్రూప్ ఇండియాలో తయారు చేసే అన్ని కార్లకు ట్రాన్స్‌మిషన్ మరియు పవర్ ట్రైన్‌తో పాటు ఇతర పరికరాలను ఏవిటిఇసి సంస్థ సరఫరా చేసే విధంగా మరో ఒప్పందం జరిగింది. ఆటోమొబైల్ విడి పరికరాలను తయారు చేసే ఏవిటిఇసి సికె బిర్లాలో ఒక విభాగం. ఇరు సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో 50:50 ఒప్పందం చేసుకున్నాయి.

ఇండియాకు ప్యూజో కార్లు

చెన్నైలోని హిందుస్తాన్ మోటార్స్ ప్రొడక్షన్ ప్లాంటులో కార్లను తయారుచేయనున్న పిఎస్‌ఎ సంస్థ 2020 నాటికి తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.

ఇండియాకు ప్యూజో కార్లు

అయితే గత ఏడాది జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఏవిటిఇసి సంస్థ యూరో-6 ఉద్గార నియమాలను పాటించే రెండు ఇంజన్‌లను ప్రదర్శించింది. అయితే పిఎస్ఎ ఇండియా ఈ రెండింటిని ప్యూజో కార్లలో అందించే అవకాశం ఉంది.

ఇండియాకు ప్యూజో కార్లు

ఎస్‌యువి మరియు లైట్ కమర్షియల్ వాహనాలకు సరిపోయే 1,999సీసీ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌ను అభివృద్ది చేసింది. ఇది గరిష్టంగా 174బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఇండియాకు ప్యూజో కార్లు

ఏవిటిసి ప్రదర్శించిన మరో ఇంజన్ 1,200సీసీ సామర్థ్యం గల పెట్రోల్ టర్బో ఛార్జ్‌డ్. ప్రస్తుతం విపణిలో ఉన్న బి-సెగ్మెంట్ కార్లలో వినియోగించుకోగల ఇది 128బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఇండియాకు ప్యూజో కార్లు

ప్రస్తుతం ప్యూజో అంతర్జాతీయ విపణిలో ఉన్న 301 మరియు 2008 అనే మోడళ్లు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే పిఎస్ఎ గ్రూప్ మాత్రం ఎలాంటి ఉత్పత్తులను విడుదల చేయనుందనే సమచారాన్ని వెల్లడించలేదు.

 

English summary
Peugeot Cars For India Might Include Two Engines
Story first published: Wednesday, February 1, 2017, 13:08 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark