ఇండియన్ మార్కెట్లోకి ప్యూజో తీసుకురానున్న కార్లు ఇవే!

Written By:

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ పిఎస్ఎ గ్రూపు ప్యూజో బ్రాండ్ పేరుతో, దేశీయంగా ఉన్న సికి బిర్లా గ్రూప్ భాగస్వామ్యంతో ఇండియన్ మార్కెట్లో పూర్తి స్థాయిలో కార్ల తయారీ మరియు విక్రయాలను ప్రారంభించడానికి సిద్దమైంది.

ఇండియాలో ప్యూజో కార్ల వివరాలు

చెన్నైలోని హిందుస్తాన్ మోటార్స్‌కు చెందిన ప్రొడక్షన్ ప్లాంటును సొంతం చేసుకుంది. ఇదే ప్లాంటులో పూర్తి స్థాయి ప్రొడక్షన్‌ను ప్రారంభించడానికి భారీగా పెట్టుబడులు పెట్టింది. తమ మొదటి కారును త్వరలోనే దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టడానికి ప్యూజో ఓ హ్యాచ్‌బ్యాక్ కారును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది.

ఇండియాలో ప్యూజో కార్ల వివరాలు

2020 నాటికి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్దమైన ప్యూజో విపణిలోకి విడుదల చేయనున్న కార్ల వివరాలను వెల్లడించింది. ప్యూజో కార్ల విషయానికి వస్తే, ముందుగా రెండు హ్యాచ్‌బ్యాక్‌లను విడుదల చేయనుంది. అందులో ఒకటి 208 హ్యాచ్‌బ్యాక్. హ్యుందాయ్ ఐ20 కారుకు పోటీగా రానున్న ఇది 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌తో రానుంది.

ఇండియాలో ప్యూజో కార్ల వివరాలు

ప్యూజో నుండి రానున్న రెండవ హ్యాచ్‌బ్యాక్ ప్యూజో 308. దీని గురించిన సాంకేతిక మరియు ఇంజన్ వివరాలు ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశపెట్టింది.

ఇండియాలో ప్యూజో కార్ల వివరాలు

డు హ్యాచ్‌బ్యాక్‌లతో పాటు రెండు ఎస్‌యూవీలను కూడా విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. అవి, ప్యూజో 2008 మరియు ప్యూజో 3008. ఇందులో ప్యూజో 3008 ఎస్‌యూవీ జెనీవా మోటార్ షో వేదిక మీద 2017 కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ పొందింది. ఈ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభించును.

ఇండియాలో ప్యూజో కార్ల వివరాలు

ప్యూజో 3008 ఎస్‌యూవీలోని ఇంజన్‌లే 2008 ఎస్‌యూవీలో కూడా ఉన్నాయి. ప్యూజో తమ 2008 ఎస్‌యూవీ వాహనాన్ని దేశీయంగా తయారు చేయనుంది మరియు 3008 ఎస్‌యూవీని దిగుమతి చేసుకుని విక్రయించింది. ప్రొడక్షన్ అవసరాలకు చెన్నైలోని హిందుస్తాన్ మోటార్స్ ప్లాంటును వినియోగించుకోనుంది.

ఇండియాలో ప్యూజో కార్ల వివరాలు

పిఎస్‌ఎ గ్రూప్ ఉద్యోగి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ప్యూజో వ్యూహాత్మకమైన ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాడు. ఇందుకు అనుగుణంగానే విడుదల చేయాల్సిన ఉత్పత్తులను ఎంచుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.

English summary
Read In Telugu: Peugeot’s India Product Portfolio Revealed
Story first published: Tuesday, July 11, 2017, 11:20 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark