ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీని లాంచ్ చేసిన రేంజ్ రోవర్: ధర రూ. 2.80 కోట్లు

Written By:

రేంజ్ రోవర్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఎస్‌విఓ బెస్పోక్ వేరియంట్ "ఆటోబయోగ్రఫీ"ని ల్యాండ్ రోవర్ విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త రేంజ్ రోవర్ ఎస్‌విఓ బెస్పోక్ ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీ ధర రూ. 2.80 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీని జాగ్వార్ ల్యాండ్ రోవర్ స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్(SVO) బృందం డిజైన్ చేసి, డెవలప్ చేసింది.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌విఓ బెస్పోక్

ఎస్‌విఓ బెస్పోక్ మోడల్‌ను 2017 లాంగ్ వీల్ బేస్ రేంజ్ రోవర్ ఆధారంగా అభివృద్ది చేశారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా బెస్పోక్ ఎస్‌యూవీలో ఎన్నో కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ల్యాండ్ రోవర్ ఇండియన్ మార్కెట్లో కేవలం ఐదు ఆటోబయోగ్రఫీ ఎస్‌విఓ బెస్పోక్ ఎస్‌యూవీలను మాత్రమే విక్రయించనుంది.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌విఓ బెస్పోక్

ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్ రెండు రకాల పెయింట్ స్కీమ్స్ ఉన్నాయి. అందులో, బెస్పోక్ సాటిన్ బ్లూ మరియు బెస్పోక్ బ్లాక్ విత్ కాపర్ ఫ్లేక్. వీటితో పాటు బాడీ కలర్ మిర్రర్ క్యాప్స్, ఎక్ట్సీరియర్ అసెంట్ ప్యాక్ ఉన్నాయి. అంతే కాకుండా కస్టమర్లు దీనిని 21- మరియు 22-అంగుళాల పరిమాణం అల్లాయ్ వీల్స్ ఆప్షన్స్‌తో ఎంచుకోవచ్చు.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌విఓ బెస్పోక్

కొత్తగా విడుదలైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌విఓ బెస్పోక్ ఎస్‌యూవీలో 4.4-లీటర్ కెపాసిటి గల వి8 డీజల్ మరియు 5-లీటర్ సూపర్ ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌లతో లభ్యం కానుంది. ఇవి, వరుసగా 330బిహెచ్‌పి పవర్ మరియు 535బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తాయి. ఇది కవలం కేవలం 5.4-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌విఓ బెస్పోక్

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఇంటీరియర్‌లో ఆటోబయోగ్రఫీ రంగులు, సెంటర్ కన్సోల్ మీద బెస్పోక్ కలహార్ వెనీర్ కలప సొబగులు ఉన్నాయి. వెనుక వరుసలో ఎక్జ్సిక్యూటివ్ సీట్లు, కూలర్ బాక్స్ వంటివి ఉన్నాయి.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌విఓ బెస్పోక్

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రపీ ఎస్‌విఓ బెస్పోక్ ఎస్‌యూవీని దేశవ్యాప్తంగా ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ డీలర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. లేదంటే కస్టమర్లు నేరుగా ఇంగ్లాడులోని బెస్పోక్ కమినషనింగ్ ప్లాంటును సంప్రదించవచ్చు.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌విఓ బెస్పోక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌విఓ బెస్పోక్ వేరియంట్ లగ్జరీ ఫీచర్లు, ప్రీమియమ్ ఫీలింగ్ అంశాల పరంగా మరో కొత్త అంచులను తాకిందని చెప్పవచ్చు. పలు కస్టమైజేషన్స్ ఆప్షన్స్‌తో పాటు ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో ఎన్నో విలాసవంతమైన నూతన ఫీచర్లు ఉన్నాయి. సాధారణ ఆటోబయోగ్రఫీతో పోల్చుకుంటే ఇది చాలా విభిన్నమైన మోడల్.

విపణిలో ఉన్న బెంట్లీ బెంట్యాగా మరియు మాసేరాటి లేవంటే మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Range rover autobiography by svo bespoke launched india. price, specs and images.

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark