ఇండియాకొస్తున్న ఈ ఎస్‌యూవీ రేంజ్‌రోవర్‌లో కెల్లా అత్యంత సురక్షితమైనది

Written By:

లగ్జరీ కార్లంటే ముందుగా గుర్తొచ్చే కంపెనీలు ఆడి, మెర్సిడెస్ బెంజ్ మరియు బిఎమ్‌డబ్ల్యూ, కానీ రేంజ్ రోవర్ వీటన్నింటికీ భిన్నం. లగ్జరీ మరియు భద్రతకు పెద్ద పీట వేసే రేంజ్ రోవర్ ఉత్పత్తులకు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విభిన్న కస్టమర్లు ఉన్నారు.

ప్రఖ్యాత లగ్జరీ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం రేంజ్ రోవర్ తమ సరికొత్తకి వెలార్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేసింది. ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్లు మరియు దీని ధృడత్వం చూశారంటే ఆశ్చర్యపోవడం ఖాయం.... ఇవాళ్టి కథనంలో ఆ ప్రత్యేకతలు చూద్దాం రండి...

రేంజ్ రోవర్ వెలార్

ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ పరీక్షలకు ప్రసిద్దిగాంచిన యూరో న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్(NCAP)ఆధ్వర్యంలో రేంజ్ రోవర్ తమ వెలార్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షించలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఐదుకు ఐదు స్టార్ల రేటింగ్ పొందింది.

రేంజ్ రోవర్ వెలార్

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ పెద్దల భద్రత పరంగా 93 శాతం, చిన్న పిల్లల భద్రత పరంగా 85 శాతం మరియు పాదచారుల భద్రత విషయంలో 74 శాతం వరకు సురక్షితమని తేలింది.

రేంజ్ రోవర్ వెలార్

వెలార్ ఎస్‌యూవీలో ప్రత్యేక సేఫ్టీ అసిస్ట్ సిస్టమ్ కలదు, ఈ కెటగిరీలో ఇది 72శాతం స్కోర్ చేసింది. ఎస్‌యూవీ మొత్తం తొమ్మిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, పాదచారులను గుర్తించే ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ టెస్టింగ్‌లో అత్యుత్తమ ఫలితాలను కనబరిచింది.

Recommended Video - Watch Now!
2018 Bentley Continental GT Revealed | In Telugu - DriveSpark తెలుగు
రేంజ్ రోవర్ వెలార్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇంగ్లాడ్ అధిపతి జెరెమీ హిక్స్ మాట్లాడుతూ, " యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో రేంజ్ రోవర్ నుండి ఐదింటికి ఐదు స్టార్ల రేటింగ్ పొందిన నాలుగవ మోడల్ వెలార్ ఎస్‌యూవీని అని చెప్పుకొచ్చాడు. అత్యాధునిక డిజైన లక్షణాలు మరియు ఇందులో భద్రత ఫీచర్ల పరంగా రేంజో రోవర్ వెలార్ కస్టమర్లకు బెస్ట్ లగ్జరీ ఎస్‌యూవీగా నిలుస్తుందని" చెప్పుకొచ్చాడు.

రేంజ్ రోవర్ వెలార్

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ యూరో ఎన్‍‌‌సిఎపి నుండి 84 శాతం స్కోర్ నమోదు చేసుకుంది. ప్రస్తుతం రేంజ్ రోవర్ లైనప్‌లో ఉన్న ఎవోక్ మరియు స్పోర్ట్ మధ్య స్థానాన్ని ఇది భర్తీ చేయనుంది.

రేంజ్ రోవర్ వెలార్

ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న సరికొత్త రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 3.0-లీటర్ సామర్థ్యం గల వి6 డీజల్ ఇంజన్‌తో రానుంది ఇది గరిష్టంగా 296బిహెచ్‌పి పవర్ మరియు 700ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రేంజ్ రోవర్ వెలార్

అదే విధంగా ఇండియన్ స్పెక్ వెలార్ ఎస్‌యూవీలో రెండవ ఇంజన్ ఆప్షన్‍‌గా 2.0-లీటర్ సామర్థ్యం గల ఇంజీనియమ్ ఇంజన్‌ రానుంది. ఇది గరిష్టంగా 177బిహెచ్‌పి పవర్ మరియు 430ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రెండు ఇంజన్ వేరియంట్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ వెలార్ లోని అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా రానున్నాయి.

రేంజ్ రోవర్ వెలార్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యూరో ఎన్‌సిఎపి నుండి 5-స్టార్ రేటింగ్ పొందిన రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో ఒక శక్తివంతమైన మరియు సురక్షితమైన ఎస్‌యూవీగా చెప్పవచ్చు. ఎన్‌సిఎపి వెల్లడించిన ఫలితాల మేరకు వెలార్ అత్యంత సురక్షితమైనదిగా తెలుస్తోంది. పరీక్షల తాలుకు ఫోటోలు మరియు వీడియోలతో సహా వెలార్ సేఫ్టీ ఫీచర్లను ఆవిష్కరించింది.

కాబట్టి ఇండియన్ మార్కెట్లో ఖరీదైన, బ్రాండెడ్, సురక్షితమైన, అధునాతన ఫీచర్లతో నిండిన, లేటెస్ట్ ఎస్‌యూవీ కోసం చూసే వారు ఈ ఏడాదిలోపే విపణిలోకి విడుదల కానున్న వెలార్ ను ఎంచుకోవచ్చు.

English summary
Read In Telugu: India-Bound Range Rover Velar Scores Big On Safety
Story first published: Friday, October 6, 2017, 16:31 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark