టియాగో కారును ఎక్కువగా ఎంచుకోవడానికి ఇవీ అసలు కారణాలు!

Written By:

టాటా చరిత్రలో భారీ విజయాన్ని తెచ్చిన మోడల్ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారు. ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో టాటా బ్రాండ్ విలువను పెంచడంలో టియాగో కీలకపాత్ర పోషిస్తోంది. నెల నెలా అత్యధిక అమ్మకాలతో దీనికి పోటీగా ఉన్న కార్లకు చుక్కలు చూపిస్తోంది.

జూన్ నెలలో 5,438 టియాగో కార్లు అమ్ముడయ్యాయి. రెనో బెస్ట్ సెల్లింగ్ కారు క్విడ్ కన్నా ఒక్క యూనిట్ తక్కువ. అయితే ఎక్కువ మంది టియాగో కారును ఎంచుకోవడానికి దోహపడిన అంశాలు ఏంటి ? ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి.

టియాగో కారును ఎక్కువగా ఎంచుకోవడానికి గల కారణాలు

డబ్బుకు భారీ విలువ:

ఏ వస్తువు కొన్నా డబ్బుకు తగ్గ విలువైనదేనా అని చూసుకుంటాం. ఈ విధంగా చూసుకుంటే మనం చెల్లించే డబ్బు కన్నా అత్యంత విలువైనది టియాగో. నిజానికి టాటా కార్లు అన్ని కూడా డబ్బుకు తగ్గ విలువైనవే, అయితే టియాగో ఇందులో మొదటి స్థానంలో ఉంది.

టియాగో కారును ఎక్కువగా ఎంచుకోవడానికి గల కారణాలు

ధర పరంగా చూసుకుంటే టియాగో పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 3.2 లక్షలుగా ఉంది. అంటే మారుతి సుజుకి ఆల్టో కె10 మరియు హ్యుందాయ్ ఇయాన్ 1.0 కార్ల కన్నా తక్కువ ధరకే లభిస్తుంది. ఇకపోతే డీజల్ వెర్షన్ టియాగో 3.95 లక్షల ప్రారంభ ధరతో లభిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అతి తక్కువ ధరకు లభిస్తున్న తొలి డీజల్ హ్యాచ్‌బ్యాక్ టియాగో.

టియాగో కారును ఎక్కువగా ఎంచుకోవడానికి గల కారణాలు

ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో ఫీచర్లను అంతగా ఆశించలేము. కానీ టియాగో విషయంలో టాటా అద్బుతమే చేసిందని చెప్పవచ్చు. కనెక్ట్ నెక్ట్స్ న్యావిగేషన్, వాయిస్ కంట్రోల్, 8-స్పీకర్లు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వంటి హై ఎండ్ కార్లలో వచ్చే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనికి పోటీగా ఉన్న కార్లలో ఈ ఫీచర్లను రాలేదు.

టియాగో కారును ఎక్కువగా ఎంచుకోవడానికి గల కారణాలు

రోడ్డును బట్టి మరియు అవసరాన్ని బట్టి డ్రైవింగ్ వ్యవస్థను మార్చుకునేందుకు రకరకాల డ్రైవింగ్ మోడ్స్ కేవలం హై ఎండ్ కార్లలోనే వస్తాయి. కానీ టాటా మోటార్స్ టియాగోలో విభిన్న డ్రైవింగ్ మోడ్స్ అందించింది. అదే విధంగా ఈ సెగ్మెంట్లో అత్యధిక బూట్ స్పేస్ 240-లీటర్లు వరకు ఉంది. ఈ రెండు అంశాలు దీనికి పోటీగా ఉన్న కార్లలో లేకపోవడం టియాగోకు ప్లస్ అయ్యింది.

టియాగో కారును ఎక్కువగా ఎంచుకోవడానికి గల కారణాలు

అద్బుతమైన డిజైన్:

ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోవడంలో టియాగో డిజైన్ ఎంతో కీలకంగా మారింది. నిజానికి టాటా కార్లలో చెప్పుకోదగ్గ డిజైన్ లక్షణాలు ఉండేవి కావు. అయితే టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా తమ తరువాత కార్లను తీర్చిదిద్దింది. అందులో మొదటిది టియాగో. పదునైన ఫ్రంట్ డిజైన్, కారుకు ప్రక్కవైపుల ఆకర్షణీయమైన క్యారెక్టర్ లైన్స్ అదే విధంగా రియర్ డిజైన్‌లో స్పోర్టివ్ స్పాయిలర్ వంటివి యువ కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

టియాగో కారును ఎక్కువగా ఎంచుకోవడానికి గల కారణాలు

శక్తివంతమైన డీజల్ ఇంజన్ గల తొలి స్మాల్ డీజల్ హ్యాచ్‌బ్యాక్:

టాటా టియాగో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ డీజల్ ఇంజన్‌లలో లభిస్తోంది. పెట్రోల్ వేరియంట్ 84బిహెచ్‌పి పవర్, 114ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా డీజల్ వేరియంట్ 69బిహెచ్‌పి పవర్, 140ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఈ సెగ్మెంట్లో డీజల్ ఇంజన్ గల తొలి కారు టియాగో. గతంలో సెలెరియో డీజల్ ఇంజన్ వేరియంట్లో లభించేది అయితే, విపణి నుండి తొలగించింది.

టియాగో కారును ఎక్కువగా ఎంచుకోవడానికి గల కారణాలు

షెవర్లే బీట్ మరియు ఇండికా కార్లను మినహాయిస్తే, ధర పరంగా టియాగో డీజల్ వెర్షన్ కారు తరువాత మార్కెట్లో లభించే డీజల్ కారు మహీంద్రా కెయువి100. కెయువి100 డీజల్ వేరియంట్ రూ. 5.5లక్షలతో ప్రారంభమవుతంది. అయితే ఈ రెండింటి మధ్య ఒకటిన్నర లక్ష వరకు ధర వ్యత్యాసం ఉంది. అంతే కాకుండా అన్ని రకాల కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్ వేరియంట్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా అందించింది.

టియాగో కారును ఎక్కువగా ఎంచుకోవడానికి గల కారణాలు

సెగ్మెంట్లో అధిక మైలేజ్ ఇవ్వగల మోడల్:

ఇండియన్ మార్కెట్లో కొత్తగా కారు కొనే ప్రతి కస్టమర్ మైలేజ్‌కు తొలి ప్రాధాన్యతనిస్తున్నాడు. సెగ్మెంట్ మొత్తం మీద టియాగో అత్యుత్తమ మైలేజ్ ఇస్తోంది. 1.2-లీటర్ ఇంజన్ ఉన్న పెట్రోల్ టియాగో లీటర్‌కు 23.84కిమీల మైలేజ్ ఇస్తోంది. ఆల్టో మైలేజ్ 24.07కిమీలతో పోల్చుకుంటే కాస్త తక్కువగానే ఉంటుంది. డీజల్ టియాగో కారు లీటర్‌కు 27.28కిమీల మైలేజ్ ఇస్తుంది. దీంతో ఇండియాలో అధిక మైలేజ్ ఇవ్వగల ఐదవ కారుగా జాబితాలో స్థానంలో దక్కించుకుంది.

టియాగో కారును ఎక్కువగా ఎంచుకోవడానికి గల కారణాలు

అత్యుత్తమ నాణ్యత:

ఒకప్పుడు టాటా కార్ల నాణ్యత మరియు ఫినిషింగ్ పట్ల తక్కువ మార్కులే పడేవి. కానీ ఈ ధోరణి మారింది. టియాగోలోని అన్ని ప్రదేశాల్లో నాణ్యతకు పెద్ద పీటవేసింది. ఇంటీరియర్‌లో వినియోగించిన ప్లాస్టిక్, పరికరాలు మరియు ఎక్ట్సీరియర్ బాడీ వంటి పరంగా కస్టమర్లు టియాగో కారును అధికంగా ఎంచుకుంటున్నారు. టియాగో మీద పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కస్టమర్లు స్వచ్చందంగా టియాగోను ఇష్టపడి మరీ సెలక్ట్ చేసుకుంటున్నారు.

టియాగో కారును ఎక్కువగా ఎంచుకోవడానికి గల కారణాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

తక్కువ ధరకు శక్తివంతమైన డీజల్ ఇంజన్, అధిక మైలేజ్, అత్యుత్తమ ఫీచర్లు, విభిన్న డిజైన్, నిర్మాణపరమైన నాణ్యత, అన్ని రకాల వయస్సు వారికి, రెండు రకాల గేర్‌బాక్స్, రెండు ఇంజన్ ఆప్షన్స్, ఐదు విభిన్న కలర్ ఆప్షన్స్ ఇలాంటి ఎన్నో అంశాలను కలిగి ఉండటంతో టియాగో కారుకు దేశవ్యాప్తంగా సానుకూలమైన స్పందన లభిస్తోంది. తొలిసారి కారు కొనేవారికి టియాగో మంచి ఎంపికే! అన్ని నగరాలలో టాటా టియాగో ఎక్స్-షోరూమ్ మరియు ఆన్-రోడ్ ధరలు ఇక్కడ తెలుసుకోండి.

English summary
Read In Telugu: Real Reasons Why Everyone Is Buying Tata Tiago
Story first published: Friday, July 14, 2017, 13:32 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark