రెనో క్యాప్చర్ విడుదల: ధర, వేరియంట్లు, ఫీచర్లు మరియు ఫోటోలు

ఫ్రెంచ్ దిగ్గజం రెనో ఇండియన్ మార్కెట్లోకి తమ సరికొత్త "క్యాప్చర్" క్రాసోవర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. రెనో క్యాప్తర్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

By Anil

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో ఇండియన్ మార్కెట్లోకి తమ సరికొత్త క్యాప్తర్ క్రాసోవర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. రెనో క్యాప్చర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

రెనో క్యాప్చర్ వేరియంట్ల ధరలు, బుకింగ్స్, ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్స్, కలర్స్, మరియు ఫోటోలతో పూర్తి విడుదల వివరాలు నేటి కథనంలో...

రెనో క్యాప్చర్ విడుదల

ఏడు విభిన్న వేరియంట్లు మరియు ఐదు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో లభించే రెనో క్యాప్తర్ ఎస్‌యూవీని రూ. 25,000 లతో క్యాప్చర్ యాప్ నుండి బుక్ చేసుకోవచ్చు. సరికొత్త క్యాప్తర్ ప్రీమియమ్ క్రాసోవర్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు టాటా హెక్సా వెహికల్స్‌కు గట్టి పోటీనివ్వనుంది.

Recommended Video

[Telugu] Jeep Compass Launched In India - DriveSpark
రెనో క్యాప్చర్ విడుదల

క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీ ఐదు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో ఎంచుకోవచ్చు. అవి, మూన్ లైట్ సిల్వర్, ప్లానెట్ గ్రే, కయీన్ ఆరేంజ్, మహాగని బ్రౌన్ మరియు పర్ల్ వైట్. రెనో క్యాప్చర్ మూడు పెట్రోల్ వేరియంట్లు మరియు నాలుగు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

రెనో క్యాప్చర్ విడుదల

రెనో క్యాప్చర్ ఇంజన్ వివరాలు

ఇండియన్ వెర్షన్ రెనో క్యప్చర్ 1.5-లీటర్ ఇంజన్ కెపాసిటితో లభిస్తున్నాయి. క్యాప్చర్ లోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5,600ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 105బిహెచ్‌పి పవర్ మరియు 4,000ఆర్‌పిఎమ్ వద్ద 142ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రెనో క్యాప్చర్ విడుదల

అదే విధంగా క్యాప్చర్‌లోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 4,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 119బిహెచ్‌పి పవర్ మరియు 1,750ఆర్‌పిఎమ్ వద్ద 240ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ పరంగా చూస్తే పెట్రోల్ క్యాప్చర్ ఎస్‌యూవీ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు డీజల్ క్యాప్చర్ ఎస్‌యూవీ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

రెనో క్యాప్చర్ విడుదల
వేరియంట్లు ధరలు
RXE (Petrol) Rs 9.99 lakh
RXE (Diesel) Rs 11.39 lakh
RXL (Petrol) Rs 11.07 lakh
RXL (Diesel) Rs 12.47 lakh
RXT (Petrol) Rs 11.69 lakh
RXT (Diesel) Rs 13.09 lakh
Platine (Diesel) Rs 13.88 lakh

Trending On DriveSpark Telugu:

పవన్, చిరు, చెర్రీల కార్ కలెక్షన్!!

ఆ డ్రైవర్ నెలసరి వేతనం 2 లక్షల రుపాయలు!!

అన్ని ఫోర్ వీలర్లకు డిసెంబర్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి: కేంద్రం

మోడీకి చూపించు: డిజీలాకర్ చూపించిన బైక్ రైడర్‌కు పోలీసు సమాధానం

రెనో క్యాప్చర్ విడుదల

కొలతలు

రెనో క్యాప్చర్ ప్రీమియమ్ క్రాసోవర్ ఎస్‌టయూవీ పొడవు 4,329ఎమ్ఎమ్, వెడల్పు 1,813ఎమ్ఎమ్, ఎత్తు 1,619ఎమ్ఎమ్, ఇండియన్ వెర్షన్ క్యాప్చర్ వీల్ బేస్ 2,673ఎమ్ఎమ్ మరియు గ్రౌడ్ క్లియరెన్స్ 210ఎమ్ఎమ్‌గా ఉంది. సరికొత్త క్యాప్చర్ బూట్ స్పేస్ 310-లీటర్లు మరియు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 50-లీటర్లుగా ఉంది.

రెనో క్యాప్చర్ విడుదల

డిజైన్

రెనో క్యాప్చర్ క్రాసోవర్‌ను యూరోపియన్ డిజైన్ స్టైల్లో రూపొందించారు. డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా అదే డిజైన్ శైలిలో అభివృద్ది చెందుతున్న అన్ని మార్కెట్లలో రెనో క్యాప్చర్‌ను విడుదల చేస్తోంది.

రెనో క్యాప్చర్ విడుదల

రెనో బ్యాడ్జి పేరు గల క్రోమ్ ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి. బంపర్‌లో పెద్ద పరిమాణంలో గల ఆంగ్లపు సి-ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ మరియు కార్నరింగ్ ఎల్ఇడి యూనిట్లు ఉన్నాయి. 17-అంగుళాల పరిమాణంలో ఉన్న క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

రెనో క్యాప్చర్ విడుదల

క్యాప్చర్ రియర్ డిజైన్ విషయానికి వస్తే, ఆంగ్లపు సి-ఆకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, క్యాప్చర్ పేరు గల క్రోమ్ ప్లేట్ దీనికి పైన గల రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉంది. ఫ్రంట్ బంపర్ తరహాలోనే రియర్ బంపర్‌లో గ్రే స్కిడ్ ప్లేట్లు మరియు దీనికి జోడింపుతో ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంది.

రెనో క్యాప్చర్ విడుదల

రెనో క్యాప్చర్ ఇంటీరియర్‌లో సరికొత్త ఆల్ న్యూ బ్లాక్ అండ్ వైట్ థీమ్ కలదు. క్యాప్చర్ టాప్ ఎండ్ వేరియంట్లో గోల్డ్ అండ్ వైట్ సొబగులు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. డిజిటల్ స్పీడ్ మీటర్లు గల ట్విన్ పోడ్ డిజైన్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు.

అంతే విధంగా, పియానో బ్లాక్ సరౌండింగ్ల్ గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటి, వాయిస్ గుర్తించే పరిజ్ఞానం మరియు న్యానిగేషన్ వంటివి సపోర్ట్ చేస్తుంది.

రెనో క్యాప్చర్ విడుదల

భద్రత పరంగా రెనో తమ ఇండియన్ వెర్షన్ క్యాప్చర్ ఎస్‌యూవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రెనో క్యాప్చర్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త రెనో క్యాప్చర్ క్రాసోవర్ కాంపాక్ట్ ఎస్‌యూవీల ప్రపంచంలో రాణించడానికి ప్రయత్నిస్తోంది. యూరోపియన్ డిజైన్ స్టైల్, క్రాసోవర్ బాడీ డిజైన్, అత్యాధునిక ఇంటీరియర్ ఫీచర్లు మరియి సేఫ్టీ అంశాలతో ధరకు తగ్గ విలువలతో హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీనివ్వడానికి సిద్దమయ్యింది.

Most Read Articles

English summary
Read In Telugu: Renault Captur Launched In India; Prices Start At Rs 9.99 Lakhs - 7 Models & 5 Colours Available
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X