రెనో నుండి మరో సంచలనాత్మక మోడల్: బ్రిజా, ఎకోస్పోర్ట్ లకు మరో శాపం

Written By:

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో, ప్రపంచ విపణిలో అందుబాటులో ఉన్న క్యాప్చర్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి కప్తుర్ పేరుతో విడుదల చేయడానికి సిద్దం అయ్యింది. కప్తుర్ ఎస్‌యూవీ టీజర్ ఫోటోను విడుదల చేస్తూ, మార్కెట్లో దీని విడుదలను రెనో అధికారికంగా ఖరారు చేసింది.

రెనో కప్తుర్

డస్టర్ ను ప్రవేశపెట్టడం ద్వారా కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో రెనో ఇప్పటికే మంచి పట్టును కలిగి ఉంది. అయితే ఇప్పుడు క్రాసోవర్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కప్తుర్ ను విడుదల చేసి మొత్తం ఎస్‌యూవీ విభాగాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
రెనో కప్తుర్

డిజైన్ పరంగా రెనో ఈ క్రాసోవర్ ఎస్‌యూవీ కప్తుర్‌లో ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, రెనో ఐబ్రోస్ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, ఆంగ్లపు సి-ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ప్లాస్టిక్ క్లాడింగ్‌ మరియు హెడ్ లైట్లను కలుపుతూపోయే బ్లాక్ బార్ వంటివి ఇందులో ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.

రెనో కప్తుర్

రెనో కప్తుర్ పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభించనుంది. ఇప్పటికే రెనో వద్ద ఉన్న 1.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో రానున్న కప్తుర్ విపణిలో డస్టర్ కు పైనున్న స్థానాన్ని భర్తీ చేయనుంది.

రెనో కప్తుర్

కప్తుర్‌లోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 102బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది, దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. అదే విధంగా 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేస్తుంది. అవి, 83.8బిహెచ్‌పి మరియు 108బిహెచ్‌పి. డీజల్ ఇంజన్‌ కప్తుర్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించనున్నాయి.

రెనో కప్తుర్

రెనో కప్తుర్‌ను ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో కూడా ఎచుకోవచ్చు. విడుదల అనంతరం కొంత కాలం తరువాత ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు పరిచయం చేయనుంది.

రెనో కప్తుర్

విభిన్న కనెక్టివిటి ఫీచర్లు ఉన్న 7-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో అందివ్వడంతో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లకు రెనో ఇందులో స్థానం కల్పిస్తోంది.

రెనో కప్తుర్

"ప్రపంచ విపణిలో రెనోకు మంచి సక్సెస్ తెచ్చిపెట్టిన క్రాసోవర్ ఎస్‌యూవీ కప్తుర్‌ను ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైనట్లు రెనో ఇండియా సిఇఒ మరియు మేనేజింగ్ డైరక్టర్ సుమిత్ సానే తెలిపాడు."

రెనో కప్తుర్

రెనో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పది లక్షల యూనిట్లకు పైగా కప్తుర్ క్రాసోవర్ వాహనాలను విక్రయించింది. దేశీయంగా న్యూ డిజైన్, లగ్జరీ ఫీల్ మరియు సౌకర్యవంతమైన ఫీచర్లతో పాటు శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్స్ గల క్రాసోవర్‌ను ఎంచుకోవాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఛాయిస్‌గా నిలవనుంది.

English summary
Read In Telugu: Renault Captur India Launch Details Revealed
Story first published: Wednesday, August 30, 2017, 11:10 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark